ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

VARALAKSHMI VRATHAM: కరుణించమ్మా... వరలక్ష్మీమాత..!

ABN, Publish Date - Aug 17 , 2024 | 12:03 AM

శ్రావణమాసం రెండో శుక్రవారాన్ని పురస్కరించుకుని జిల్లావ్యాప్తంగా వరలక్ష్మీ వ్రతాలను మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు చేశారు. ఇళ్లలో వరలక్ష్మీ వ్రతం చేసే సంప్రదాయం లేనివారు సమీప ఆలయాల్లో వ్రతాలను ఆచరించారు.

Devotees performing Varalakshmi Vrat

అనంతపురం కల్చరల్‌, ఆగస్టు 16: శ్రావణమాసం రెండో శుక్రవారాన్ని పురస్కరించుకుని జిల్లావ్యాప్తంగా వరలక్ష్మీ వ్రతాలను మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు చేశారు. ఇళ్లలో వరలక్ష్మీ వ్రతం చేసే సంప్రదాయం లేనివారు సమీప ఆలయాల్లో వ్రతాలను ఆచరించారు. జిల్లాకేంద్రంలో కొత్తూరు వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో ఉదయాన్నే వాసవీమాతకు పంచామృతాభిషేకాలు, వివిధ రకాల పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించి పూజించారు. అనంతరం ఆలయానికి చేరుకున్న మహిళలు సామూహికంగా వరలక్ష్మీ వ్రతాలను ఆచరిస్తుండగా... పురోహితులు వేదమంత్రాలు వల్లించడంతోపాటు వ్రతవిధానాన్ని భక్తులకు వివరించారు. అమ్మవారిని స్వర్ణకవచ చీరతో విశేషంగా అలంకరించి పూజలు గావించారు. ఐదో రోడ్డు కనకదుర్గ ఆలయంలోనూ వరలక్ష్మి పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. శారదానగర్‌లోని శృంగేరి శంకరమఠం, మొదటిరోడ్డులోని కాశీవిశ్వేశ్వర కోదండ రామాలయం, చౌడేశ్వరి దేవాలయం, పాతూరులోని వాసవీ కన్యకాపరమేశ్వరి, మహాలక్ష్మి ఆలయం, రామ్‌నగర్‌లోని పెద్దమ్మ దేవాలయం, హెచ్చెల్సీ కాలనీలోని నసనకోట ముత్యాలమ్మ ఆలయం తదితర ప్రాంతాల్లో అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు.

Updated Date - Aug 17 , 2024 | 12:03 AM

Advertising
Advertising
<