MURDER: ఇక్కడ చంపి.. అక్కడ పడేశారా?
ABN, Publish Date - May 31 , 2024 | 11:49 PM
ఎనఎ్‌సయూఐ జాతీయ కార్యదర్శి సంపతకుమార్‌ను హిందూపురం ప్రాంతంలో హత్యచేసి ధర్మవరం వద్ద పడేసినట్లు పోలీసులు ఆనవాళ్లను గుర్తించినట్లు సమాచారం.
తీసుకెళ్లినవారే హతమార్చారా ?
లేక పాత నేరస్థుల పనా..?
హంతకులను పట్టుకునేందుకు రెండు బృందాల ఏర్పాటు
హిందూపురం, మే 31: ఎనఎ్‌సయూఐ జాతీయ కార్యదర్శి సంపతకుమార్‌ను హిందూపురం ప్రాంతంలో హత్యచేసి ధర్మవరం వద్ద పడేసినట్లు పోలీసులు ఆనవాళ్లను గుర్తించినట్లు సమాచారం. బుధవారం రాత్రి సంపతకుమార్‌ను అతని ఇంటి నుంచి తీసుకెళ్లిన గుర్తుతెలియని దుండగులు సరిహద్దులోని కర్ణాటక చింతలపల్లి సమీపంలో మద్యం సేవించి అక్కడికి కిలోమీటరు దూరం తీసుకెళ్లి మరోసారి మద్యం సేవించే సమయంలో హతమార్చి అదే వాహనంలో తీసుకెళ్లి ధర్మవరం చెరువు కట్టకింద మృతదేహాన్ని పడేసినట్లు శుక్రవారం పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.
తీసుకెళ్లినవారే హతమార్చారా?
ఇదిలా ఉంటే బుధవారం రాత్రి సంపతకుమార్‌ను తన ఇంటివద్ద నుంచి హిందూపురానికి చెందిన కారులోనే అతనికి కొద్దిరోజులుగా స్నేహితుడిగా ఉన్న యువకుడు తీసుకెళ్లాడు. ఆ వాహనంలో సంపతతోపాటు నలుగురు వెళ్లినట్లు సమాచారం. వారు కర్ణాటక చింతలపల్లివద్ద వైనషాపులో మద్యం సేవించినట్లు తెలిసింది. అదిచాలక మరో రౌండ్ కోసం మద్యం బాటిల్ తీసుకెళ్లి అక్కడి నుంచి కిలోమీటరు దూరంలో పారిశ్రామికవాడకు వెళ్లే కాలి బాటకు సమీపంలో మద్యం సేవించారని అక్కడి ఆనవాళ్లు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. హిందూపురం నుంచి సంపతకుమార్‌ను తీసుకెళ్లినవారు హతమార్చారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కానీ తీసుకెళ్లినవారు ఇంతవరకు అలాంటి నేరాలకు పాల్పడినట్లు వారిపై అనుమానాలు లేవు. కానీ డబ్బుకోసం ఒకవేళ హతమార్చి ఉంటారా అన్న కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు. ఇదే సందర్భంలో హిందూపురం నుంచి సంపతను తీసుకెళ్లినవారు కేవలం తీసుకెళ్లేందుకే ఉపయోగించుకున్నారా లేక పాత హంతకులు ఇందులో ఏమైనా కలిసి ఉంటారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. హిందూపురం నుంచి తీసుకెళ్లిన యువకులు కొన్ని నెలల క్రితం జరిగిన హత్యకేసుకు సంబంధించిన వారితో పరిచయం ఉన్నట్లు పట్టణంలో చర్చించుకుంటున్నారు. అంతేకాక మెడపై, తలపై నరికిన ఆనవాళ్లు చూస్తుంటే గతంలో హత్యలు చేసిన వారి పనై ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఆ కోణంలో కూడా దర్యాప్తు ముమ్మరం చేశారు.
వైసీపీ నాయకుడిపై అనుమానం
సంపతకుమార్ హత్యకు మునుపు వైసీపీ నాయకుడిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అనంతరం కూడా సంపతకుమార్ తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సదరు నాయకుడు పేరు పేర్కొన్నారు. దీంతో గతం నుంచి ఆయన నేరచరిత్ర ఉన్న వారు హిందూపురంలో సదరు నాయకుడిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏ నలుగురు కలిసినా అతని గురించే చెప్పుకుంటున్నారు. ఆయన కొంతకాలంగా హిందూపురానికి దూరంగా ఉంటూ వచ్చారు. హిందూపురం నుంచి అధికార పార్టీ తరుఫున బరిలో ఉన్న అభ్యర్థి తరపున ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. ఆయన కొన్నిరోజులుగా ఇక్కడే మకాం వేసినట్లు సమాచారం. ఆయన పేరును బాధిత కుటుంబం ఫిర్యాదులో పేర్కొనడం అనుమానాలకు తావిస్తోంది.
రెండు బృందాల ఏర్పాటు
సంపతకుమార్ దారుణ హత్యపై కాంగ్రెస్ పార్టీ నాయకులు రాష్ట్రస్థాయిలో స్పందించారు. రాష్ట్ర అధ్యక్షురాలు షర్మీల సంపత హత్యపై ట్వీట్ చేశారు. అతన్ని అనుమానాస్పదమనడం కలిచివేసిందని అద్భుతమైన రాజకీయ భవితవ్యం ఉన్న నేత సంపతకుమార్ అంటూ సమగ్రంగా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. దీంతోపాటు రఘువీరారెడ్డి, శైలజానాథ్, హర్షకుమార్ స్పందించడంపై పోలీసు ఉన్నతాధికారులు సీరియ్‌సగా పరిగణించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం జిల్లా ఎస్పీ నిందితులను పట్టుకోవాలని ధర్మవరం, హిందూపురం వనటౌన సీఐలను రెండు బృందాలుగా ఏర్పాటుచేసి వారికి మరికొంతమంది సిబ్బందిని కేటాయించారు. వారు శుక్రవారం మధ్యాహ్నం నుంచి ఈ కేసుపై దర్యాప్తు ప్రారంభించినట్లు విశ్వసనీయ సమాచారం. అయితే సంపతను తీసుకెళ్లిన యువకుల్లో ఒకరు ఉత్తరాది జిల్లాలో ఉన్నట్లు అనుమానించారు. అయితే ఈ కేసుకు సంబంధించి సంపతకుమార్ తండ్రి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్న వ్యక్తులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
Updated Date - May 31 , 2024 | 11:49 PM