SP JAGADEESH: పోలీసు ఆయుధాలపై అవగాహన అవసరం
ABN, Publish Date - Oct 25 , 2024 | 11:57 PM
పోలీసు విధుల్లో వినియోగించే ఆయుధాల పట్ల విద్యార్థి దశ నుంచే అవగాహన కలిగి ఉండటం మంచిదని ఎస్పీ జగదీష్ అభిప్రాయపడ్డారు. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లోని షాదీఖానాలో శుక్రవారం ఓపెన హౌస్ కార్యక్రమం నిర్వహించారు.
అనంతపురం క్రైం, అక్టోబరు 25(ఆంధ్రజ్యోతి): పోలీసు విధుల్లో వినియోగించే ఆయుధాల పట్ల విద్యార్థి దశ నుంచే అవగాహన కలిగి ఉండటం మంచిదని ఎస్పీ జగదీష్ అభిప్రాయపడ్డారు. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లోని షాదీఖానాలో శుక్రవారం ఓపెన హౌస్ కార్యక్రమం నిర్వహించారు. పోలీసులు తమ దైనందిన విధుల్లో వినియోగించే వివిధ రకాల ఆయుధాలు, పరికరాలు, సాధనాలను ప్రదర్శనలో ఉంచారు. సుశిక్షితులైన సిబ్బందిచే సందర్శనకు విచ్చేసిన ప్రజలు, విద్యార్థులకు ఆయుధాల గురించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాసరావు, త్రీటౌన సీఐ శాంతిలాల్, ఆర్‌ఐలు రెడ్డప్పరెడ్డి, రాముడు తదితరులు పాల్గొన్నారు.
ప్రదర్శనలో ఉంచిన ఆయుధాలివే: 22 రైఫిల్, 410 మస్కట్, 303 రైఫిల్, 762 ఎం.ఎం ఎస్‌ఎల్‌ఆర్, ఏకే 47, 5.56 ఎం.ఎం(ఇన్సాస్), 9 ఎంఎం, కార్బన, 38 రివాల్వర్, 9ఎంఎం పిస్టోల్, 9ఎంఎం గ్లాక్, విఎల్ పిస్టోల్, ప్రొజెక్టర్ ఫైరోటెక్, 12బోర్ పంప్ యాక్సనగన, ఎల్‌ఎంజి 51 ఎం.ఎం మోటారు, హెచఇ 36 గ్రనేడ్, యాంటీ రైట్‌గన్స, గ్యాస్‌గన, రోబోటెక్(బాడీ ప్రోటెక్టర్), సేవాదళ్ డ్రస్, ఫైబర్ లాఠీ, బాడీ ప్రొటెక్టర్, స్టోన గార్డు, హెల్మెట్ , కేన లాఠీ, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ హెవీ, మీడియం లైట్ డే, నైట్ విజన బైనాక్యులర్లు, జీపీఎస్, మెగాఫోన, లెటర్ బాంబు డిటెక్టర్, డిఎ్‌సఎండి, హెచహెచఎండీ, ఎనఎల్‌జేడీ, నార్కో డిటెకన కిట్, పాలిరే యువి లైట్, క్లూస్‌టీం, డస్ట్ ఫుట్ ప్రింట్ లిఫ్టర్, ఎల్‌హెచఎంఎస్, బాడీవోస్ కెమెరాలు, ఫిన్స(ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన నెట్ వ ర్కింగ్ సిస్టం), డ్రోన కెమెరాలు, డీఎ ఫ్‌ఐడీ బాంబు రింగ్, వాటర్ కేనన, వజ్ర వాహనాలు, డాగ్ బృందాలను ప్రదర్శనలో ఉంచారు.
Updated Date - Oct 25 , 2024 | 11:57 PM