TEMPLE ROBBERY : కోటంక ఆలయంలో చోరీ కేసు ఛేదింపు
ABN, Publish Date - Jun 26 , 2024 | 11:45 PM
గార్లదిన్నె మండలం కోటంక గ్రామ సమీపంలోని గుంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో జరిగిన చోరీ కేసును సీఎస్, గార్లదిన్నె పోలీసులు ఛేదించారు. ఈనెల 20వ తేదీన ఆలయ తాళాలు పగలకొట్టి లోపలికి చొరబడిన దొంగలు స్వామి మూలవిరాట్‌కు ధరింపజేసే రూ.13లక్షల విలువైన 16కిలోల వెండి ఆభరణాలు, 8తులాల బంగారు ఆభరణాలు, రెండు హుండీలు పగలకొట్టి రూ.15వేల నగదు ఎత్తుకెళ్లారు. పోలీసులు ఈ ఘటనలో నలుగురు అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేశారు.
బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం
అనంతపురం క్రైం,జూన 26: గార్లదిన్నె మండలం కోటంక గ్రామ సమీపంలోని గుంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో జరిగిన చోరీ కేసును సీఎస్, గార్లదిన్నె పోలీసులు ఛేదించారు. ఈనెల 20వ తేదీన ఆలయ తాళాలు పగలకొట్టి లోపలికి చొరబడిన దొంగలు స్వామి మూలవిరాట్‌కు ధరింపజేసే రూ.13లక్షల విలువైన 16కిలోల వెండి ఆభరణాలు, 8తులాల బంగారు ఆభరణాలు, రెండు హుండీలు పగలకొట్టి రూ.15వేల నగదు ఎత్తుకెళ్లారు. పోలీసులు ఈ ఘటనలో నలుగురు అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేశారు. వారి నుంచి 16తులాల వెండి ఆభరణాలు, నాలుగు బంగారు తాళిబొట్లు, రెండు బైక్‌లు, రూ.2500 నగదు, ఐరనరాడ్, కట్టర్, కట్టింగ్‌ప్లేయర్, క్యాటర్ బాల్, సిసి కెమెరాల హార్డ్ డిస్క్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోలీస్ కాన్ఫరెన్స హాల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీసీఎస్ సీఐ ఇస్మాయిల్, శింగనమల సీఐ శ్రీధర్, ఎస్‌ఐలతో కలిసి అనంతపురం రూరల్ డీఎస్పీ వెంకటశివారెడ్డి వివరాలు వెల్లడించారు.
అరెస్టయిన నిందితులు వీరే...
శ్రీసత్యసాయి జిల్లా రొద్దం మండలం తురకలాపట్నం గ్రామానికి చెందిన పవనకుమార్, కడప జిల్లా సీకే దిన్నె మండలం ఎంఎంఎస్ మీదికి తండాకు చెందిన ఆవుల రాము, కడప జిల్లా ఒంటిమిట్ట మండలం మదరం గ్రామానికి చెందిన వెంకటరమణ, కడప జిల్లా కేంద్రం బాలకృష్ణ నగర్‌కు చెందిన శ్రీనివాసులును పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో పవనకుమార్ కర్ణాటక రాష్ట్రం కోలార్, కొరటగేరీ, పట్టణాయక్ హళ్లి, కడప జిల్లా లింగాల, సిద్దవటం పోలీ్‌సస్టేషన్లలోని దేవాలయాల దొంగతనాల కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. ఆవుల రాముపై ప్రకాశం జిల్లా మర్రిపాడు పోలీ్‌సస్టేషనలో గంజాయి కేసు ఉంది.
రెక్కీ నిర్వహించి.. జైలుకెళ్లి..
ఈ కేసులో పవనకుమార్ కీలకం. గత కొన్ని సంవత్సరాల నుంచి ఆలయాల్లో చోరీలకు పాల్పడుతున్నాడు. ప్రముఖ ఆలయాల్లో నిఘా పెట్టి దొంగతనాలు చేసేవాడు. ఈ క్రమంలో ఈ చోరీ ఘటనకు ముందు గుంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో రెక్కీ నిర్వహించాడు. అదే సమయంలో ఓ కేసులో కడప సెంట్రల్ జైలుకు వెళ్లాడు. అక్కడ గంజాయి కేసులో అరెస్టయిన ఆవుల రాము, వెంకటరమణ, శ్రీనివాసులతో పరిచయం కలిగింది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో బంగారు, వెండి ఆభరణాల గురించి చెప్పాడు. బెయిల్‌పై జైలు నుంచి విడుదలదయ్యారు. విడుదలైన 15రోజుల్లోనే ఆలయంలో చోరీకి పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. చోరీ ఘటన నేపథ్యంలో పాత నేరస్తులను విచారిస్తున్న క్రమంలోనే పవనకుమార్ గురించి బయటపడింది. సాంకేతిక పరిజ్ఞానంతో దొంగతనం చేసిన నిందితులను బుధవారం అరెస్ట్ చేశారు. కేసును ఛేదించి సొత్తు స్వాధీనం చేసుకున్న సీఐలు శ్రీధర్, ఇస్మాయిల్, ఎస్‌ఐ గౌస్. హెచసీలు ఫిరోజ్‌సాహెబ్, దివాకర్, ప్రసాద్, చంద్రశేఖర్, శ్రీధర్‌పాణి, మల్లికార్జున, శ్రీనివాసులు కానిస్టేబుళ్లు దేవ్లానాయక్, రంజితకుమార్, బాలకృష్ణను ఎస్పీ గౌతమిశాలి అభినందించారు.
Updated Date - Jun 26 , 2024 | 11:45 PM