ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పాడి ఆవుకు ప్రసవ వేదన

ABN, Publish Date - Aug 04 , 2024 | 11:48 PM

ప్రసవ వేదన ఏ జీవికైనా తప్పదు. ఇక మూగజీవాల బాధ చెప్పనలవి కానిది. గోమాత బిడ్డకు జన్మనిచ్చేకి విలవిలలాడింది. కానీ లేగ దూడ మృతి చెందడంతో రైతుకు కన్నీరే మిగిలింది. పశు వైద్యులు అందుబాటులో లేకపోవడంతో పాడిరైతు ప్రైవైట్‌ వైద్యులను ఆశ్రయించాడు. కానీ ఫలితం లేకుండా పోయింది. పరిగి మండలం ఎస్‌. ముద్దిరెడ్డిపల్లికి పాడిరైతుకు చెందిన పాడిఆవు శనివారం ప్రసవ వేదనతో ఇబ్బంది పడుతోంది. ప్రభుత్వ వెటర్నరీ వైద్యుడిని సంప్రదించ

ఫ గోమాతకు ప్రైవేట్‌ వైద్యం ఫ లేగదూడ మృత్యువాత

హిందూపురం, ఆగస్టు 4 : ప్రసవ వేదన ఏ జీవికైనా తప్పదు. ఇక మూగజీవాల బాధ చెప్పనలవి కానిది. గోమాత బిడ్డకు జన్మనిచ్చేకి విలవిలలాడింది. కానీ లేగ దూడ మృతి చెందడంతో రైతుకు కన్నీరే మిగిలింది. పశు వైద్యులు అందుబాటులో లేకపోవడంతో పాడిరైతు ప్రైవైట్‌ వైద్యులను ఆశ్రయించాడు. కానీ ఫలితం లేకుండా పోయింది. పరిగి మండలం ఎస్‌. ముద్దిరెడ్డిపల్లికి పాడిరైతుకు చెందిన పాడిఆవు శనివారం ప్రసవ వేదనతో ఇబ్బంది పడుతోంది. ప్రభుత్వ వెటర్నరీ వైద్యుడిని సంప్రదించగా రాకపోవడంతో, తప్పని పరిస్థితిలో ప్రైవేట్‌ వైద్యుడిని పిలిపించారు. ఆయన శనివారం రాత్రి గర్భంతో ఉన్న ఆవు ప్రసవం చేసేందుకు ప్రయత్నించాడు. సాధ్యం కాకపోగా రక్తస్ర్తావం ఎక్కువైంది. దీంతో చేసేదిలేక ఆయన వెనుదిరిగిపోయారు. పాడి రైతు ఆదివారం హిందూపురం ప్రభుత్వ పశువైద్యశాలకు తీసుకొచ్చాడు. అయితే అప్పటికే తీవ్ర రక్తస్ర్తావం కావడం.. వాహనంలో తరలించి ఆసుపత్రిలో ప్రసవం చేయగా అప్పటికే దూడ మృతిచెందింది. దీంతో పాడి రైతు ఓవైపు గాయాలతో ఉన్న పాడి ఆవు, మరోవైపు దూడ మృతిని చూసి బోరున విలపించాడు. కష్టపడ్డా ఫలితం లేకుండా పోయిందన్నారు. పశువులకు ప్రైవేట్‌ వ్యక్తులతో కాకుండా, ప్రభుత్వ వైద్యం అందు బాటులో ఉండాలని రైతులు కోరుతున్నారు.

Updated Date - Aug 04 , 2024 | 11:48 PM

Advertising
Advertising
<