Land: స్థల ఆక్రమణలను అడ్డుకోండి: టీడీపీ
ABN, Publish Date - Jun 28 , 2024 | 12:34 AM
నివాస స్థలాలను కొందరు ఆక్రమించుకున్నా రని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ టీడీపీ నాయకులు గుంతక ల్లు ఆర్డీవో, తహసీల్దారు, కమిషనరుకు వినతిపత్రాన్ని అందజేశారు. గురు వారం మధ్యాహ్నం ఆర్డీవో, తహసీల్దారు, మునిసిపల్ కార్యాలయాలకు వెళ్లిన టీడీపీ నాయకులు ఆక్రమణలను ఆడ్డుకోవాలని విన్నవించారు.
గుంతకల్లు, జూన27: నివాస స్థలాలను కొందరు ఆక్రమించుకున్నా రని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ టీడీపీ నాయకులు గుంతక ల్లు ఆర్డీవో, తహసీల్దారు, కమిషనరుకు వినతిపత్రాన్ని అందజేశారు. గురు వారం మధ్యాహ్నం ఆర్డీవో, తహసీల్దారు, మునిసిపల్ కార్యాలయాలకు వెళ్లిన టీడీపీ నాయకులు ఆక్రమణలను ఆడ్డుకోవాలని విన్నవించారు. పట్టణంలోని దోనిముక్కల రోడ్డులోనూ, కసాపురం శివారులోనూ ఆక్రమ ణలు కొనసాగుతున్నాయని, పట్టాలలో పేర్లు మార్చి ఆక్రమిస్తున్నారని తెలిపారు. ఈ రెండు ప్రాంతాల్లో నివాస స్థలాల విషయంగా విచారణ జరిపి, ఖాళీ స్థలాలను గుర్తించాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు బండారు ఆనంద్, లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి బీఎస్ కృష్ణారెడ్డి, వాల్మీకి సాధికార సమితి జిల్లా కార్యదర్శి తలారి మస్తానప్ప, తెలుగు మహిళా నాయకురాలు లక్ష్మిదేవి, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jun 28 , 2024 | 12:34 AM