ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

LAWYERS : ‘ల్యాండ్‌ టైటిలింగ్‌’ రద్దుపై న్యాయవాదుల హర్షం

ABN, Publish Date - Jun 14 , 2024 | 11:57 PM

రైతులను నట్టేట ముంచేందుకు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ దుర్మార్గమైందని, దానిని ముఖ్య మంత్రి చంద్రబాబు రద్దుచేయడం ఎంతో అభినం దనీయమని న్యాయవాదులు పేర్కొన్నారు. దాన్ని ర ద్దు చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు సంతకం చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. టీడీపీ లీగల్‌సెల్‌ జిల్లా అధ్యక్షుడు శివశంకర్‌ ఆధ్వర్యంలో శుక్రవారం కోర్టువద్ద న్యాయవాదులు మిఠా యిలు పంచుకు న్నారు. అక్కడి నుంచి అంబేడ్కర్‌ సర్కిల్‌ వరకు ర్యా లీ నిర్వహించారు.

Jubilant lawyers in Hindupuram

హిందూపురం, జూన 14: రైతులను నట్టేట ముంచేందుకు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ దుర్మార్గమైందని, దానిని ముఖ్య మంత్రి చంద్రబాబు రద్దుచేయడం ఎంతో అభినం దనీయమని న్యాయవాదులు పేర్కొన్నారు. దాన్ని ర ద్దు చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు సంతకం చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. టీడీపీ లీగల్‌సెల్‌ జిల్లా అధ్యక్షుడు శివశంకర్‌ ఆధ్వర్యంలో శుక్రవారం కోర్టువద్ద న్యాయవాదులు మిఠా యిలు పంచుకు న్నారు. అక్కడి నుంచి అంబేడ్కర్‌ సర్కిల్‌ వరకు ర్యా లీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ... దుర్మార్గమైన ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ యా క్ట్‌ అమలై ఉంటే పేదలెవరికి ఆస్తు లుఉండేవికా వన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా పెత్తందారుల కోసం వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టమన్నారు. కానీ చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు బాధ్యతలు తీసుకున్న మొదటిరోజే ఈ చట్టం రద్దుపై సంతకం చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. కొన్ని నెలల క్రితం ఈ యాక్ట్‌పై పార్టీలకతీతంగా ఉ ద్యమించిందే న్యాయవాదులు కానీ అప్పట్లో దీనిపై ఎ వరికీ ఏమీ తెలియదన్నారు. ఆ తరువాత అందరూ గమనించి జగన ప్రభుత్వానికి తగిన శాస్తి చేశార న్నారు. ఈ కార్యక్ర మంలో న్యాయవాదులు సుదర్శన, రాజశేఖర్‌, సిద్దు, రామచంద్రారెడ్డి, రామచంద్ర, రవి, తదితరులు పాల్గొన్నారు.


మడకశిరటౌన: ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్టును రద్దు చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు సంతకం చే యడం అభనందనీయమని మడకశిర బార్‌ అసోసి యేషన ఆధ్వర్యంలో హర్షం వ్యక్తం చేశారు. న్యాయ వాదులు శుక్రవారం బార్‌ అసోసియేషన కార్యాల యంలో వారు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ము ఖ్యమంత్రి పవనకల్యాణ్‌లకు ధన్యవాదాలు తెలిపారు. ఈసందర్భంగా బార్‌ అసోసియేషన అధ్యక్షుడు గోవిందరాజులు, సీనియర్‌ న్యాయవాదులు నారాయణగౌడ్‌, గుండుమల రాధాకృష్ణ తదితరులు మాట్లాడుతూ... ప్రజల ఆస్తులకు భద్రత లేని ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్టును గత ప్రభుత్వం తీ సుకొచ్చిందని, దానిని రద్దు చేయాలంటూ ఆ సమయంలో దాదాపు రెండు నెలలపాటు తాము నిరసన కార్యక్రమాలు చేపట్టినా స్పందించలేదన్నారు. అప్పటి ప్రతిపక్షనేత చంద్రబాబును కలిసి ఈ చట్టం వల్ల ప్రజలకు జరిగే నష్టాన్ని వివరించడంతో ఆయన సానుకూలంగా స్పందించి ఎన్నికల్లో హామీ ఇచ్చారని, అందుకు అను గుణంగా రెండో సంతకంతోనే ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్టును రద్దు చేయడం సంతోషించదగ్గ విషయం అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ఉప ముఖ్య మంత్రి పవనకల్యాణ్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ లేఖను పంపనున్నట్లు తెలిపారు. ఈసందర్భంగా న్యా యవాదులు లోకేష్‌, త్రిలోక్‌, హనుమంతరాయుడు, రఘునాథశాసి్త్ర, కిష్టప్ప, గోపీనాథ్‌, విజయభాస్కర్‌, కృష్ణమూర్తి, నాగభూషణ, తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Jun 14 , 2024 | 11:57 PM

Advertising
Advertising