ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP ELECTIONS : ప్రశాంతంగా ముగిద్దాం..!

ABN, Publish Date - Jun 04 , 2024 | 12:27 AM

కౌంటింగ్‌ ప్రశాంతంగా ముగించేందుకు పక్కాగా బందోబస్తు చేపట్టాలని ఎస్పీ గౌతమిశాలి ఆదేశించారు. ఎక్కడా చిన్న అవాంఛనీయ సంఘటన జరగకూడదని అన్నారు. కౌంటింగు బందోబస్తు విధుల్లో పాల్గొంటున్న పోలీసు అధికారులతో సోమవారం జేఎన్టీయూలో ప్రత్యేకంగా ఆమె సమావేశమయ్యారు. బందోబస్తు విధుల్లో ఏమి చేయాలో, ఏమి చేయకూడదో దిశా నిర్దేశం చేశారు. కౌంటింగ్‌ రోజు విధుల్లో ఉండే టూవీలర్‌ మొబైల్‌ పార్టీలు, స్ర్టాంగ్‌ రూంల వద్ద బందోబస్తు, జేఎన్టీయూ చుట్టూ పహారా కాస్తున్న పెట్రోలింగ్‌ పార్టీలు, ..

కౌంటింగ్‌ కేంద్రం వద్ద ఏర్పాట్లను పరిశీలిస్తున్న ఎస్పీ

గొడవలకు దిగితే కఠిన చర్యలు తీసుకోండి

పోలీసులకు ఎస్పీ గౌతమి శాలి ఆదేశం

అనంతపురం క్రైం, జూన 3: కౌంటింగ్‌ ప్రశాంతంగా ముగించేందుకు పక్కాగా బందోబస్తు చేపట్టాలని ఎస్పీ గౌతమిశాలి ఆదేశించారు. ఎక్కడా చిన్న అవాంఛనీయ సంఘటన జరగకూడదని అన్నారు. కౌంటింగు బందోబస్తు విధుల్లో పాల్గొంటున్న పోలీసు అధికారులతో సోమవారం జేఎన్టీయూలో ప్రత్యేకంగా ఆమె సమావేశమయ్యారు. బందోబస్తు విధుల్లో ఏమి చేయాలో, ఏమి చేయకూడదో దిశా నిర్దేశం చేశారు. కౌంటింగ్‌ రోజు విధుల్లో ఉండే టూవీలర్‌ మొబైల్‌ పార్టీలు, స్ర్టాంగ్‌ రూంల వద్ద బందోబస్తు, జేఎన్టీయూ చుట్టూ పహారా కాస్తున్న పెట్రోలింగ్‌ పార్టీలు, బైలేన పికెట్లు, జేఎన్టీయూ వైపు ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులు, వర్సిటీ ఎంట్రీ,


ఎగ్జిట్‌ పాయుంట్ల వద్ద తనిఖీలు నిర్వహించే సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కౌంటింగ్‌ కేంద్రాలు, పరిసరాల్లోకి రిటర్నింగుల అధికారుల అనుమతి పత్రం లేనిదే ఎవరినీ అనుమతించవద్దని సూచించారు. కౌంటింగ్‌ ఏజెంట్లు, అభ్యర్థులు, చీఫ్‌ ఏజెంట్లు, ఆర్వో, ఏఆర్వో, ఇతర అధికారులు, మీడియా ప్రతినిధులు నిర్దేశిత మార్గాల ద్వారానే కౌంటింగ్‌ కేంద్రాల్లోకి వెళ్లేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, బాల్‌ పెన/పెన్సిల్‌, ప్లెయిన పేపర్‌ మినహా ఏవీ అనుమతించవద్దని సూచించారు. కౌంటింగ్‌ కేంద్రాలు, పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన, 30 పోలీస్‌ యాక్ట్‌ అమలులో ఉంటాయని అన్నారు. జిల్లా కేంద్రంలో మొబైల్‌ పార్టీలు, స్ర్టైకింగ్‌ బృందాలు, స్పెషల్‌ స్ర్టైకింగ్‌ బృందాలు అప్రమత్తంగా తిరగాలని సూచించారు. జేఎన్టీయూ పరిసరాల్లో ర్యాలీలు, ఊరేగింపులు నిషిద్ధమని తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే గట్టి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో డీఎస్పీలు, సీఐలు, ఆర్‌ఐలు, ఎస్‌ఐలు, ఆర్‌ఎ్‌సఐలు, సిబ్బంది పాల్గొన్నారు.

విధులపై రిహార్సల్స్‌

కౌంటింగ్‌ రోజున బందోబస్తు ఎలా నిర్వహిస్తారో తెలుసుకుని, లోటుపాట్లను సరిదిద్దుకునేందుకు సోమవారం రిహార్సల్స్‌ నిర్వహించారు. కౌంటింగ్‌ ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించేందుకు అవసరమైన సిబ్బందిని విధుల్లో ఉంచారు. కౌంటింగ్‌ ముగిసేవారకూ జేఎన్టీయూతోపాటు పరిసర ప్రాంతాలు పోలీసుల ఆధీనంలో ఉండేలా వివిధ రకాల విధుల్లో సిబ్బందిని పురమాయించారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Jun 04 , 2024 | 12:27 AM

Advertising
Advertising