AMILINENI: కళ్యాణదుర్గాన్ని అగ్రస్థానంలో నిలుపుతాం
ABN, Publish Date - May 04 , 2024 | 10:50 PM
కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని అభివృద్ధిలో మొదటిస్థానంలో నిలుపుతామని ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్ర బాబు అన్నారు. శనివారం మండలంలోని గూబనపల్లి, దొడఘట్ట, కురాకుల పల్లి, ఒంటిమిద్ది, ముదిగల్లు గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఆయా గ్రామాలలో అమిలినేనికి పూలవర్షం కురిపించి గజమాలతో ఘన స్వాగతం పలికారు. ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీలో అవసరమైన మౌలిక వసతులు పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసి ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దే బాధ్యత తీసుకుంటానని భరోసా ఇచ్చారు.
కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని
కళ్యాణదుర్గం, మే 4: కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని అభివృద్ధిలో మొదటిస్థానంలో నిలుపుతామని ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్ర బాబు అన్నారు. శనివారం మండలంలోని గూబనపల్లి, దొడఘట్ట, కురాకుల పల్లి, ఒంటిమిద్ది, ముదిగల్లు గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఆయా గ్రామాలలో అమిలినేనికి పూలవర్షం కురిపించి గజమాలతో ఘన స్వాగతం పలికారు. ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీలో అవసరమైన మౌలిక వసతులు పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసి ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దే బాధ్యత తీసుకుంటానని భరోసా ఇచ్చారు. గ్రామాల్లో చాలా మందికి ఇళ్లు, ఇంటి స్థలాలు లేవని, టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వారందరికీ మంజూరు చేయించి పక్కా గృహాలు నిర్మిస్తామన్నారు. ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని సూచించారు. నేడు ఏ గ్రామంలో చూసినా టీడీపీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. ఈ ప్రజాబలంతోనే కళ్యాణదుర్గంలో అఖండ మెజార్టీతో గెలుపొందడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ పాలనపై ప్రజలు విసుగు చెందారని, ప్రతి గ్రామంలో చంద్రబాబునాయుడి పాలనను కోరుకుంటున్నారన్నారు. సూపర్‌సిక్స్ పథకాలు అన్ని వర్గాల ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయన్నారు. అందరూ ఒక్కటిగా వుంటూ వైసీపీకి వ్యతిరేకంగా పోరాటం చేసేందుకు సిద్ధంగా వుండాలన్నారు. సొంత వైసీపీ నాయకులే ఆ పార్టీని చీదరించుకునే స్థాయికి వెళ్లిందంటే ఆ పార్టీ ఏ స్థాయిలో వుందో అర్థం చేసుకోవచ్చునన్నారు.
పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడే చంద్రబాబు నాయుడును గెలిపించే దిశగా అడుగులు ముందుకు వేయాలని పిలుపునిచ్చారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలోనే బీటీపీ ప్రాజెక్టును పూర్తి చేసి కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని 114 చెరువులకు సాగు, తాగునీరు ఇవ్వడమే ప్రధాన లక్ష్యమన్నారు. నియోజక వర్గంలో పరిశ్రమలు స్థాపించి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ నియోజకవర్గం వెనుకబడిన ప్రాంతమని, ఉపాధి అవకాశాలు లేక బెంగళూరుకు వలసలు వెళుతున్నారన్నారు. వలసలను పూర్తిగా అడ్డుకట్ట వేసి స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. కుటుంబానికి ఆర్థిక భద్రత, భావి తరాల భవిష్యత్తు బాగుపడాలంటే ఒక్క చంద్రబాబునాయుడుతోనే సాధ్యమవుతుందన్నారు. ప్రతి చోటా రోడ్‌షోకు ప్రజలు అశేషంగా తరలివస్తున్నారంటే టీడీపీపై ఎంతటి ఆదరాభిమానాలు ఉన్నాయో స్పష్టంగా అర్థమవుతుందన్నారు. 13వ తేదీన టీడీపీకి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను ఆయన అభ్యర్థించారు. నాయకులు, కార్యకర్తలు, మహిళలు అభిమానులు పాల్గొన్నారు.
టీడీపీతోనే ఉద్యోగావకాశాలు
కుందుర్పి: టీడీపీతోనే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు టీవీ రామన్న అన్నారు. శనివారం కేంద్రంలోని రిషి డిగ్రీ కళాశాలలో ఆయన విలేకరులతో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులను గాలికి వదిలేసిందన్నారు. ప్రతి యేటా డీఎస్సీ నిర్వహిస్తామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో ఒక డీఎస్సీని కూడా నిర్వహించిన పాపాన పోలేదని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి సంతకం డీఎస్సీపై ఉంటుందన్నారు. 20లక్షలకు పైగా ఉద్యోగాల భర్తీ చేస్తున్నట్లు చంద్రబాబు హామీ ఇచ్చారన్నారు. నిరుద్యోగ వలసలు ఆగాలన్నా, పరిశ్రమలు రావాలన్నా అమిలినేని సురేంద్రబాబు ఎమ్మెల్యేగా గెలిపించాలని యువతకు పిలుపునిచ్చారు.
Updated Date - May 04 , 2024 | 10:50 PM