ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

MEGA LOKADALAT: మెగా లోక్‌అదాలతను విజయవంతం చేద్దాం

ABN, Publish Date - Jun 22 , 2024 | 12:01 AM

కోర్టు, పోలీసుల సమన్వయంతో 29వ తేదీన నిర్వహించే మెగా లోక్‌అదాలతను విజయవంతం చేద్దామని హిందూపురం అదనపు జిల్లా న్యాయాధికారి కంపల్లె శైలజ అన్నారు. శుక్రవారం పోలీసులతో మెగా లోక్‌ అదాలతపై సమీక్ష జరిపారు.

Additional District Magistrate Sailaja talking to the police

హిందూపురం, జూన 21: కోర్టు, పోలీసుల సమన్వయంతో 29వ తేదీన నిర్వహించే మెగా లోక్‌అదాలతను విజయవంతం చేద్దామని హిందూపురం అదనపు జిల్లా న్యాయాధికారి కంపల్లె శైలజ అన్నారు. శుక్రవారం పోలీసులతో మెగా లోక్‌ అదాలతపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా న్యాయాధికారి స్టేషనలవారీగా ఉన్న పెండింగ్‌ కేసులపై ఆరాతీశారు. వీటిలో రాజీకి వచ్చే కేసులన్నీ లోక్‌అదాలతలో పరిష్కరించాలన్నారు. దీర్ఘకాలంగా కోర్టుల చుట్టూ తిరుగుతూ ఆర్థికంగా చితికిపోయిన ఇరువర్గాల కక్షిదారులను పిలిపించి వారితో మాట్లాడి పరిష్కారానికి మార్గం చూపాలన్నారు. చిన్నపాటి తగాదాలు, ఆర్థిక లావాదేవీలు, భార్యాభర్తల మధ్య మనస్పర్థలు, భూతగాదాల కేసులను పరిష్కారమయ్యేలా చూడాలన్నారు. సీనియర్‌ సివిల్‌ న్యాయాధికారి శ్రీధర్‌, సెకెండ్‌క్లాస్‌ మెజిస్ర్టేట్‌ సుకుమార్‌, బార్‌ అసోసియేషన అధ్యక్షుడు రాజశేఖర్‌, వివిధ పోలీ్‌సస్టేషన్ల సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jun 22 , 2024 | 12:01 AM

Advertising
Advertising