ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

JANASENA : జనసేన సిద్ధాంతాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్దాం

ABN, Publish Date - Jul 18 , 2024 | 11:55 PM

జనసేన పార్టీ సిద్ధాంతాలను క్షేత్రస్థాయిలో తీసుకెళ్లేందుకు ప్రతి నాయకుడు, కార్యకర్త కృషి చేయాలని జిల్లా అధ్యక్షుడు టీసీ వరుణ్‌ పిలుపునిచ్చారు. గురువారం ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించన కార్యక్రమానికి ఆ పార్టీ కార్యక్రమాల నిర్వహణ రాష్ట్రప్రధానకార్యదర్శి భవానీ రవికుమార్‌, రాయలసీమ మహిళా విభాగం కో-ఆర్డినేటర్‌ పెండ్యాల శ్రీలత హాజరై సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు.

Janasena leaders showing membership registration process through cellphone

అనంతపురం ప్రెస్‌క్లబ్‌, జూలై18: జనసేన పార్టీ సిద్ధాంతాలను క్షేత్రస్థాయిలో తీసుకెళ్లేందుకు ప్రతి నాయకుడు, కార్యకర్త కృషి చేయాలని జిల్లా అధ్యక్షుడు టీసీ వరుణ్‌ పిలుపునిచ్చారు. గురువారం ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించన కార్యక్రమానికి ఆ పార్టీ కార్యక్రమాల నిర్వహణ రాష్ట్రప్రధానకార్యదర్శి భవానీ రవికుమార్‌, రాయలసీమ మహిళా విభాగం కో-ఆర్డినేటర్‌ పెండ్యాల శ్రీలత హాజరై సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. వరుణ్‌ మాట్లాడుతూ... జనసేన పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా పదిరోజుల పాటు నిర్వహించే సభ్యత్వ నమోదు డ్రైవ్‌లో చురుగ్గా పాల్గొనాలన్నారు. 28వతేదీ వరకూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సభ్యత్వ నమోదు డ్రైవ్‌ నిర్వహించాలన్నారు. నగర అధ్యక్షుడు పొదిలి బాబురావు, జిల్లా ఉపాధ్యక్షులు జయరామిరెడ్డి, అంకె ఈశ్వరయ్య, లీగల్‌ సెల్‌ మురళీకృష్ణ, కాయగూరల లక్ష్మీపతి, జిల్లా ప్రధాన కార్యదర్శి కుమ్మర నాగేంద్ర, జిల్లా కార్యదర్శులు రాపా ధనుంజయ, సంజీవరాయుడు, కిరణ్‌కుమార్‌, జిల్లా సహాయ కార్యదర్శులు జయమ్మ, అవుకు విజయ్‌కుమార్‌, ముప్పూరి కృష్ణ, గ్రంధి దివాకర్‌, మేదర వెంకటేష్‌, రొళ్ల భాస్కర్‌ పాల్గొన్నారు.


జనసేనలోకి వైసీపీ నేతల చేరిక: వైసీపీకి చెందిన పలువురు నాయకులు జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం జిల్లా అధ్యక్షుడు టీసీ వరుణ్‌ ఆధ్వర్యంలో వారు పార్టీలోకి చేరారు. కళ్యాణదుర్గం, కంబదూరు మండలానికి చెందిన వైసీపీ నాయకులు, మద్ధతుదారులు 30 మందికిపైగా జనసేనలోకి చేరారు. వీరందరికి జిల్లా అధ్యక్షుడు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.

శింగనమల: జనసేన పార్టీ సభ్యత్య నమోదును జయప్రదం చేయాలని ఆ పార్టీ మండల అధ్యక్షుడు తోట ఓబిలేసు, జిల్లా కార్యదర్శి బొమ్మన పురుషోత్తంరెడ్డి పిలుపునిచ్చారు. గురువారం మండల కేంద్రంలోని రామస్వామి దేవాలయంలో సభ్యత్య నమోదు కార్యాక్రమాన్ని నిర్వహించారు. సాయిశంకర్‌, తోట ప్రవీణ్‌కూమార్‌, గజేంద్ర, శ్రీకాంత, రామాంజి పాల్గొన్నారు.

Updated Date - Jul 18 , 2024 | 11:55 PM

Advertising
Advertising
<