ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CROP: చేనుకు చేటు..!

ABN, Publish Date - Oct 26 , 2024 | 12:09 AM

జిల్లావ్యాప్తంగా రసాయన, పురుగుమందుల దుకాణాలు ప్రమాదకర, నిషేధిత గడ్డిమందు విచ్చలవిడిగా విక్రయిస్తున్నాయి. ఈ గడ్డిమందు వాడితే నేల స్వభావం కోల్పోవడం, ప్రజల ఆరోగ్యంపై దుష్పరిణామాలు చూపుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.

నిస్సారమవుతున్న భూములు

ప్రజల్లో సైతం ఆరోగ్య సమస్యలు

అయినా.. యథేచ్ఛగా విక్రయాలు

రైతుల్లో కొరవడిన అవగాహన

పంటల్లో కలుపు నివారణ తలకు మించిన భారమవుతోంది. కూలీల కొరత వేధిస్తోంది. ఒకవేళ కూలీలు దొరికినా వారికి డబ్బు ఎక్కువగా ఇవ్వాల్సి వస్తుండడంతో రైతులు ఎక్కువగా కలుపును నివారించేందుకు గడ్డి మందుల వైపు మొగ్గు చూపుతున్నారు. దీనిని ఆసరాగా చేసుకుని పురుగమందు దుకాణదారులు నిషేధిత గడ్డి మందు గ్లైఫోసేట్‌ను విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ గడ్డి మందు వాడడం ద్వారా నేల స్వభావం కోల్పోవడంతోపాటు అనేక దుష్పరిణామాలు తలెత్తుతాయని వ్యవసాయ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. దీనిపై పూర్తిగా అవగాహనలేని రైతులు విచ్చలవిడిగా వాడుతున్నారు.

కదిరి అర్బన, అక్టోబరు 25(ఆంధ్రజ్యోతి): జిల్లావ్యాప్తంగా రసాయన, పురుగుమందుల దుకాణాలు ప్రమాదకర, నిషేధిత గడ్డిమందు విచ్చలవిడిగా విక్రయిస్తున్నాయి. ఈ గడ్డిమందు వాడితే నేల స్వభావం కోల్పోవడం, ప్రజల ఆరోగ్యంపై దుష్పరిణామాలు చూపుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. కాసులకు కక్కుర్తిపడి పురుగుమందుల దుకాణల్లో నిషేధిత గడ్డిమందులు విక్రయిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్లైఫోసేట్‌ మందును నిషేదించారు. తేయాకు తోటలు సాగుచేసే రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఈ గడ్డి మందును నిషేధించలేదు. దీంతో జిల్లాకు పక్కనే ఉన్న కర్ణాటక నుంచి అక్కమంగా గడ్డిమందు దిగుమతి అవుతున్నట్లు తెలుస్తోంది.


క్యాన్సర్‌ కారకాలు

పంటల మధ్యలో పెరిగిన గడ్డి, ఇతర ఆకుల్లాంటి కలుపు నివారణకు అనుమతి పొందిన మందులు పిచికారీ చేయాలి. ఆ తర్వాత కలుపు ఎండిపోవడానికి ఐదారు రోజులుపైగా పడుతుంది. నిషేధిత గ్లైఫోసేట్‌ను వాడితే గంటల వ్యవధిలో ఎండిపోతోంది. దీని దుష్ఫరిణామాలపై అవగాహన లేకపోవడంతో రైతులు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు వస్తాయని కలుపు మందును వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మందును అధికంగా వినియోగంచడంతో క్యాన్సర్‌తోపాటు చర్మ సంబంధిత వ్యాధుల బారినపడే అవకాశం అధికంగా ఉందని పరిశోధనల్లో వెల్లడైంది.

నష్టాలివీ..

పొలంలో కలుపు నివారణ మందు పిచికారీ చేస్తే సాధారణంగా వారంరోజుల్లో ఆ మందు శక్తిని కోల్పోతుంది. నిషేధిత గ్లైఫోసేట్‌ 30 నుంచి 45 రోజులపైగా భూమిలో అలాగే ఉంటుంది. దీంతో భూమి నిస్సారమవుతోంది. అది పంట దిగుబడిపై ప్రభావం చూపుతోంది. భూమి సారాన్ని పెంచేందుకు ఎరువుల రూపంలో అదనపు ఖర్చు భరించాల్సి వస్తోంది. భూమిలో పంటకు మేలుచేసే జీవరాశులు, సూక్ష్మజీవులు, పోషకాలుంటాయి. ఎక్కువకాలం భూమి పొరల్లో కలుపుమందు ఆవశేషాలుండడంతో పైరుకు మేలు చేసేవన్నీ నశించిపోతాయి. వాతావరణం కలుషితమై, ఆగాలి పీల్చిన రైతులు, ప్రజలు అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉంది.


నిషేఽధిత కలుపుమందు వాడవద్దు

రాష్ట్రంలో గ్లైఫోసేట్‌ కలుపు నివారణ మందును ప్రభుత్వం నిషేధించింది. విక్రయించడం చట్టరీత్యా నేరం. నిషేఽఽఽఽధిత మందు పిచికారీ చేస్తే పంట, ప్రజలు, భూమిపై చెడు ఫలిలుంటాయి. ఇది పరిశోధనల్లో వెల్లడైన నిజం. అనుమంతి పొందిన కలుపు నివారణ మందులు మాత్రమే ఉపయోగించాలి. గ్లైఫోసెట్‌ను విక్రయించినా, పిచికారీ చేసినా కఠిన చర్యలు తప్పవు. దీనిపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం.

- సుబ్బారావు, జిల్లా వ్యవసాయాధికారి

Updated Date - Oct 26 , 2024 | 12:10 AM