ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Crime : ప్రేమించి.. పెళ్లాడి.. హత్య

ABN, Publish Date - Jul 16 , 2024 | 11:37 PM

డబ్బు, నగల మీద యావతో ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కిరాతకంగా చంపేశాడు ఓ వ్యక్తి. గుంతకల్లు పట్టణంలో సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. భార్యను చంపేసిన అనంతరం ఐదు నెలల పసికందుతో పారిపోతుండగా.. స్థానికులు అనుమానించి పట్టుకున్నారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ హత్య గురించి వెలుగులోకి వచ్చింది. పాత గుంతకల్లులోని కనకవీటి వీధికి చెందిన నారాయణస్వామి, రంగమ్మ దంపతులు పండ్ల వ్యాపారం చేస్తుంటారు. వీరికి ...

Pulikonda, Saiteja, Chinnari Mokshashree (File)

డబ్బు.. నగలు తేలేదని కిరాతకం

పాత గుంతకల్లులో అమానవీయ ఘటన

తల్లిని కోల్పోయిన ఐదు నెలల చిన్నారి

గుంతకల్లు టౌన, జూలై 16: డబ్బు, నగల మీద యావతో ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కిరాతకంగా చంపేశాడు ఓ వ్యక్తి. గుంతకల్లు పట్టణంలో సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. భార్యను చంపేసిన అనంతరం ఐదు నెలల పసికందుతో పారిపోతుండగా.. స్థానికులు అనుమానించి పట్టుకున్నారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ హత్య గురించి వెలుగులోకి వచ్చింది. పాత గుంతకల్లులోని కనకవీటి వీధికి చెందిన నారాయణస్వామి, రంగమ్మ దంపతులు పండ్ల వ్యాపారం చేస్తుంటారు. వీరికి ఐదుగురు కూతుళ్లు. చిన్న కూతురు సాయితేజ(26) నర్సింగ్‌ కోర్సు పూర్తి చేసి గుంతకల్లు పట్టణంలో ఓ నర్సింగ్‌ హోంలో పనిచేసేది. గుత్తి పట్టణంలో ఉన్న తమ బంధువుల ఇంటికి వెళ్లినప్పుడు ఆమెకు బేల్దారి పులికొండ పరిచయమయ్యాడు. క్రమంగా వారి మధ్య ప్రేమ బంధం ఏర్పడి.. రెండేళ్ల క్రితం


ఇంట్లోవారికి చెప్పకుండా గుత్తిలోని ఓ దేవాలయంలో పెళ్లిచేసుకున్నారు. ఆ తరువాత గుత్తిలోనే ఓ అద్దె ఇంట్లో నివాసం ఉండేవారు. సాయుతేజ ఏడు నెలల గర్భిణిగా ఉన్న సమయంలో ఆమె తల్లిదండ్రులు గుంతకల్లులోని పుట్టింటికి పిలుచుకువెళ్లారు. అది మొదలు డబ్బులు, నగల కోసం భార్యను పులికొండ వేధించడం మొదలు పెట్టాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్నందున.. బతుకుతెరువు కోసం డబ్బులు, నగలు కావాలని, గుత్తిలో సాయితేజ తండ్రి పేరిట ఉన్న ఇంటిని తన పేరిట రాయించాలని భార్యతో గొడవ పడేవాడు. ఈ వివాదం నేపథ్యలో గుంతకల్లు టూటౌన పోలీ్‌సస్టేషనలో గతంలో పంచాయితీ జరిగింది. కొన్నాళ్లకు సాయితేజకు కూతురు పుట్టింది. మోక్షశ్రీ అని పేరు పెట్టారు. ప్రస్తుతం పాపకు ఐదు నెలల వయసు. దంపతులిద్దరూ పాత గుంతకల్లు శివాలయం వెనుక ఓ ఇంటిని అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నారు. రెండు రోజుల క్రితం భర్త గుత్తికి వెళ్లడంతో సాయితేజ తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లింది. పులికొండ సోమవారం రాత్రి 9 గంటల సమయంలో తిరిగొచ్చి.. పుట్టింట్లో ఉన్న భార్య సాయితేజ, పాపను తీసుకుని తన ఇంటికి వెళ్లాడు. డబ్బులు, నగలు, ఇంటి విషయమై రాత్రి ఇద్దరి మధ్య గొడవ జరిగింది. విచక్షణ కోల్పోయిన పులికొండ.. సెల్‌ఫోన చార్జింగ్‌ వైరును సాయితేజ గొంతుకు బిగించి హత్య చేశాడు. అంతటితో ఆగకుండా కత్తితో ఆమె గొంతు కోశాడు. ఆ తరువాత ఇంటికి తాళం వేసుకుని.. అర్ధరాత్రి 2 గంటల సమయంలో పాపను తీసుకుని పారిపోవాలని చూశాడు. ఆ సమయంలో పసిబిడ్డతో ఉన్న పులికొండను చూసిన స్థానికులు.. పిల్లలను ఎత్తుకెళ్లే దొంగగా భావించారు. అతన్ని పట్టుకుని వివరాలు అడిగారు. సెల్‌ఫోనలో ఫొటో తీసి సాయితేజ తల్లిదండ్రులకు వాట్సప్‌ చేశారు. వారు వచ్చి ఇంట్లో చూసేసరికి రక్తపుమడుగులో ఉన్న సాయితేజ కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పులికొండను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

పాలు తాగని పసిపాప

తల్లి కనిపించకపోవడంతో ఐదు నెలల పసిపాప గుక్కపట్టి ఏడుస్తోంది. తన అవ్వాతాత బయటి పాలు పట్టించాలని చూసినా తాగడం లేదు. దీంతో బంధువులు, కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు. పులికొండను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. డీఎస్పీ శివభాస్కర్‌ రెడ్డి, తహసీల్దారు శేషఫణి ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని మృతురాలి బంధువుల నుంచి స్టేట్‌మెంట్‌ రికార్డు చేసుకున్నారు. మృతురాలి తల్లి రంగమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ గణేష్‌ తెలిపారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం..

Updated Date - Jul 16 , 2024 | 11:37 PM

Advertising
Advertising
<