ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఎస్‌ఎల్‌ఏపీలో భారీ అగ్ని ప్రమాదం

ABN, Publish Date - May 15 , 2024 | 11:38 PM

సోమందేపల్లి మండలం గుడిపల్లి పంచాయతీ పరిధిలో ఇండసి్ట్రయల్‌ ఏరియాలో ఉన్న ఎస్‌ఎల్‌ఏపీ పరిశ్రమలో బుధవారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కియ కార్లకు విడిభాగాలు అందించే అనుబంధ పరిశ్రమలో ఎస్‌ఎల్‌ఏపీ ఒకటి. ఇక్కడ కార్లకు సంబంధించి ఏసీ, గ్లాసులు తయారు చేస్తారు.

పరిశ్రమలో ఎగసి పడుతున్న మంటలు

పెద్దఎత్తున ఆస్తి నష్టం.. పలువురికి అస్వస్థత

పెనుకొండ టౌన, మే 15: సోమందేపల్లి మండలం గుడిపల్లి పంచాయతీ పరిధిలో ఇండసి్ట్రయల్‌ ఏరియాలో ఉన్న ఎస్‌ఎల్‌ఏపీ పరిశ్రమలో బుధవారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కియ కార్లకు విడిభాగాలు అందించే అనుబంధ పరిశ్రమలో ఎస్‌ఎల్‌ఏపీ ఒకటి. ఇక్కడ కార్లకు సంబంధించి ఏసీ, గ్లాసులు తయారు చేస్తారు. పరిశ్రమను మరింత అభివృద్ధి చేసేందుకు నిర్మాణ పనులు చేపట్టారు. దుమ్ము దూళి రాకుండా పట్టలు కప్పారు. సిబ్బంది వెల్డింగ్‌ పనులు చేస్తుండగా షార్ట్‌సర్క్యూట్‌ జరిగి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఫైర్‌ సేఫ్టీ పరికరాలతో ప్రయత్నించినా మంటలు అదుపులోకి రాలేదు. పెనుకొండ, హిందూపురం నుంచి ఫైర్‌ సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. అప్పటికే భారీగా నష్టం జరిగింది. ముడిసరుకులు దగ్ధం కావడంతో రూ.కోట్లలో నష్టం జరిగిందని సమాచారం. పలువురు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. సోమందేపల్లి ఎస్‌ఐ విజయ్‌కుమార్‌, ఫైర్‌ సిబ్బంది ఈ ప్రమాద వివరాలను సేకరిస్తున్నారు. పెద్దఎత్తున మంటలు ఎగిసిపడటంతో చుట్టుపక్కల ఉన్న పరిశ్రమలవారు భయాందోళనకు గురయ్యారు.

Updated Date - May 15 , 2024 | 11:38 PM

Advertising
Advertising