ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

COLLECTOR: వైద్యసేవకే తొలి ప్రాధాన్యం

ABN, Publish Date - Nov 09 , 2024 | 12:08 AM

‘నేను తొలుత డాక్టర్‌. ఇపుడు ఐఏఎస్‌ అధికారిని. అయినా నా తొలి ప్రాధాన్యం వైద్యానికే. నేను ఏస్థాయిలో ఉన్నా వైద్యసేవలు అందించడానికే ప్రాదాన్యం ఇస్తా’ అని జిల్లా కలెక్టరు డాక్టరు వినోద్‌కుమార్‌ పేర్కొన్నారు.

Collector Vinod Kumar speaking at the workshop

వృత్తిని బాధ్యతగా నిర్వర్తించండి

వర్క్‌షాపులను సద్వినియోగం చేసుకోవాలి

అనంతపురం టౌన, నవంబరు 8(ఆంధ్రజ్యోతి): ‘నేను తొలుత డాక్టర్‌. ఇపుడు ఐఏఎస్‌ అధికారిని. అయినా నా తొలి ప్రాధాన్యం వైద్యానికే. నేను ఏస్థాయిలో ఉన్నా వైద్యసేవలు అందించడానికే ప్రాదాన్యం ఇస్తా’ అని జిల్లా కలెక్టరు డాక్టరు వినోద్‌కుమార్‌ పేర్కొన్నారు. ఐఎంఏహాల్‌లో ఇండియన అకాడమీ ఆఫ్‌ పీడియాట్రిక్స్‌ ఆధ్వర్యంలో చిన్నపిల్లలడాక్టర్ల వర్క్‌షాపు శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమానికి కలెక్టరు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ ఇలాంటి రాష్ట్రస్థాయి వర్క్‌షా్‌పలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. వైద్య వృత్తికి, డాక్టర్‌కు సమాజంలో ఎంతో గౌరవం, గుర్తింపు ఉన్నాయన్నారు. అలాంటి డాక్టరు వృత్తిలో ఉన్న ప్రతిఒక్కరు బాధ్యతగా పని చేయాలని సూచించారు. ప్రైవేటు డాక్టర్లు నిబంధనలు పాటించి సేవలు అందించాలన్నారు. డాక్టర్‌ నిత్య విద్యార్థిగా ఉంటూ అధునాతన వైద్య విధానాలను అందిపుచ్చుకోవాలన్నారు. ఇలాంటి వర్క్‌షా్‌పలు జూనియర్‌ డాక్టర్లకు ఎంతో ప్రయోజనమన్నారు. వైద్యవృత్తిని సేవాభావంతో నిర్వహిస్తూ పేదప్రజలకు వైద్యసేవలు అందించినపుడే డాక్టర్లకు ఆత్మసంతృప్తితోపాటు కీర్తిప్రతిష్టలు వస్తాయని పేర్కొన్నారు. వైద్య కళాశాల, కిమ్స్‌సవీరా, కేర్‌అండ్‌క్యూర్‌, జిల్లాఆస్పత్రులలోను ఈవర్క్‌షా్‌పలు నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వెంకటేశ్వరరావు, వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ మాణిక్యాలరావు, ఆర్‌ఎంఓ డాక్టర్‌ హేమలత, ఐఎంఏరాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ అనిల్‌కుమార్‌, రాష్ట్రకార్యదర్శి డాక్టర్‌ ఏఎ్‌సకిరీటీ, జీజీహెచ పీడియాట్రిక్‌ హెచఓడీ డాక్టర్‌ రవికుమార్‌, ఆర్గనైజింగ్‌ చైర్‌పర్సన డాక్టర్‌ శ్రీకాంత, బెంగళూరు డాక్టర్‌ ప్రతా్‌పచంద్ర, డీసీహెచఎ్‌స డాక్టర్‌ రవికుమార్‌, అడిషనల్‌ డీఎంహెచఓ డాక్టర్‌ సజాత పలువురు పీడియాట్రిక్స్‌ డాక్టర్లు పాల్గొన్నారు.

Updated Date - Nov 09 , 2024 | 12:08 AM