ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

MEDICOS AGGITATION: మహిళా డాక్టర్‌ హత్యాచారంపై మెడికోల ఆందోళన

ABN, Publish Date - Aug 13 , 2024 | 12:13 AM

కోల్‌కతా మెడికల్‌ కళాశాలలో మహిళా డాక్టర్‌ను అత్యాచారంచేసి హత్య చేసిన నరరూపరాక్షసుడిని కఠినంగా శిక్షించాలని డాక్టర్లు, మెడికోలు డిమాండ్‌ చేశారు. ఈ సంఘటనపై నగరంలో డాక్టర్లు, మెడికోలు సోమవారం రోడ్డెక్కి నిరసన చేపట్టారు.

Doctors and medics who are worried about the incident of killing a doctor

అనంతపురం టౌన, ఆగస్టు 12: కోల్‌కతా మెడికల్‌ కళాశాలలో మహిళా డాక్టర్‌ను అత్యాచారంచేసి హత్య చేసిన నరరూపరాక్షసుడిని కఠినంగా శిక్షించాలని డాక్టర్లు, మెడికోలు డిమాండ్‌ చేశారు. ఈ సంఘటనపై నగరంలో డాక్టర్లు, మెడికోలు సోమవారం రోడ్డెక్కి నిరసన చేపట్టారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని, డాక్టర్లకు రక్షణ కల్పించాలని డిమాండ్‌ చేస్తూ ర్యాలీ చేశారు. ప్రభుత్వ డాక్టర్ల సంఘం అధ్యక్షుడు రామస్వామి నాయక్‌, ఐఎంఏ రాష్ట్ర జాయింట్‌ కార్యదర్శి ఆర్‌ఎంఓ హేమలత మాట్లాడుతూ కోల్‌కతా ఘటన అమానుషమైన చర్య అన్నారు. ఇలాంటి దుర్మార్గుడిని కఠినంగాశిక్షించాలని, డాక్టర్లకు భద్రతకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. డాక్టర్లు శివశంకరనాయక్‌, విజయకుమారి, పరదేశీనాయుడు పాల్గొన్నారు.

పీజీ హాస్టల్స్‌ వద్ద భద్రత కల్పించండి

అనంతపురం టౌన: కలకత్తా మెడికల్‌ కళాశాలలో పీజీచేస్తున్న మహిళా డాక్టర్‌ను అత్యాచారం చేసి హత్యచేశారని, అదిచూస్తే భయమేస్తోంది, అనంత వైద్యకళాశాల పీజీ హాస్టల్స్‌ వద్ద భద్రత కల్పించాలని పీజీ వైద్యవిద్యార్థులు కలెక్టర్‌ను కోరారు. సోమవారం గ్రీవెన్సలో కలెక్టర్‌ వినోద్‌ కుమార్‌ను కలిసి వినతిపత్రం అందించారు. వారు మాట్లాడుతూ పీజీ కాలేజీ హాస్టల్స్‌లో ఇప్పటికే రెండుసార్లు గుర్తుతెలియని వ్యక్తులు చొరబడ్డారన్నారు.

Updated Date - Aug 13 , 2024 | 12:13 AM

Advertising
Advertising
<