WHIP Kalava సభ్యత్వ నమోదులో వేగం పెంచాలి: విప్ కాలవ
ABN, Publish Date - Dec 06 , 2024 | 01:06 AM
టీడీపీ నాయకులు పార్టీ సభ్యత నమోదును మరింత వేగవంతం చేయాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు సూచించారు. బొమ్మనహాళ్ మండలం ఎల్‌బీనగర్ గ్రామంలో గురువారం టీడీపీ మండల కన్వీనర్ బలరాంరెడ్డి అధ్యక్షతన కార్యకర్తల సమావేశం జరిగింది. కాలవ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
బొమ్మనహాళ్/ కణేకల్లు డిసెంబరు 5(ఆంధ్రజ్యోతి): టీడీపీ నాయకులు పార్టీ సభ్యత నమోదును మరింత వేగవంతం చేయాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు సూచించారు. బొమ్మనహాళ్ మండలం ఎల్‌బీనగర్ గ్రామంలో గురువారం టీడీపీ మండల కన్వీనర్ బలరాంరెడ్డి అధ్యక్షతన కార్యకర్తల సమావేశం జరిగింది. కాలవ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
పార్టీ సభత్వ నమోదు చేసుకుంటే పార్టీ అధిష్టానం రూ. 5లక్షల ప్రమాద బీమాను చెల్లిస్తుందని, అలాగే బాధిత కుటుంబానికి అండగా ఉంటుందని తెలిపారు. కనుక ప్రతి కార్యకర్త సభ్యత్వ నమోదు చేసుకోవాలన్నారు. యూనిట్ ఇనచార్జులు, క్లస్టర్ కన్వీనర్లు సభ్యత్వ నమోదులో వేగం పెంచాలని సూచించారు. కార్యక్రమంలో క్లస్టర్ కన్వీనర్లు కేశవరెడ్డి, ధనుంజయ, నాయకులు కొత్తపల్లి తిమ్మరాజు, నారాయణస్వామి, అప్పారావు, గోరంట్ల వెంకటేఽశులు, మోహన, యూనిట్ ఇనచార్జిలు గోవిం దు, సోమనాథ్‌గౌడ్, కావలి ప్రభు తదితరులు పాల్గొన్నారు. అలాగే కణేకల్లు మండలకేంద్రంలోని చంద్ర రైస్‌మిల్‌లో కాలవ శ్రీనివాసులు టీడీపీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమై మాట్లాడారు. మండలానికి 15 వేల సభ్యత్వాలు లక్ష్యంగా పెట్టామని, ఇప్పటివరకు కేవలం ఎనిమిది వేలు పూర్తి చేశారని అన్నారు. ఈ నెలాఖరుకల్లా మిగతా సభ్యత్వ నమోదును పూర్తి చేయాలని సూచించారు. మండల కన్వీనర్ లాలెప్ప, నాయకులు ఆనంద్‌రాజ్, వేలూరు మరియప్ప, ఆది, కళేకుర్తి సుదర్శన, బీటీ రమేష్, ఎస్ కే మల్లికార్జున, బసవరాజు, చంద్రశేఖర్‌గుప్తా కార్యకర్తలు హాజరయ్యారు.
మరిన్ని అనంతపురం వార్తలు..
Updated Date - Dec 06 , 2024 | 01:06 AM