ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

JEEP JATHA: మెస్‌ బిల్లులు, కాస్మెటిక్‌ చార్జీలు చెల్లించాలి

ABN, Publish Date - Aug 01 , 2024 | 11:59 PM

ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లకు పెండింగ్‌ ఉంచి మెస్‌, కాస్మెట్‌ చార్జీలు ప్రభుత్వం చెల్లించాలని ఏఐఎ్‌సఎఫ్‌, సీపీఐ నాయకులు డిమాండ్‌ చేశారు. ఏఐఎ్‌సఎఫ్‌ నిర్వహిస్తున్న జీపుజాతా ప్రారంభ కార్యక్రమాన్ని గురువారం కేఎ్‌సఆర్‌ కళాశాలలో నిర్వహించారు.

Narayanaswamy starting the jeep jatha by waving the flag

అనంతపురం విద్య, ఆగస్టు 1: ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లకు పెండింగ్‌ ఉంచి మెస్‌, కాస్మెట్‌ చార్జీలు ప్రభుత్వం చెల్లించాలని ఏఐఎ్‌సఎఫ్‌, సీపీఐ నాయకులు డిమాండ్‌ చేశారు. ఏఐఎ్‌సఎఫ్‌ నిర్వహిస్తున్న జీపుజాతా ప్రారంభ కార్యక్రమాన్ని గురువారం కేఎ్‌సఆర్‌ కళాశాలలో నిర్వహించారు. ఆ సంఘం మాజీ రాష్ట్ట్ర నాయకులు నారాయణస్వామి జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమానికి ఏఐఎ్‌సఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు జాన్సనబాబు, మాజీ యువజన నాయకులు శ్రీరాములు, మాజీ విద్యార్థి నాయకులు రమణయ్య హాజరయ్యారు. వారు మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా అనేక విద్యారంగ సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయన్నారు. హాస్టళ్లకు మెస్‌, కాస్మెటింగ్‌ చార్జీలు పెండింగ్‌లో ఉన్నాయని, వెంటనే చెల్లించాలన్నారు. పలు ప్రాంతాల్లో హాస్టల్‌ భవనాలు పాడుబడ్డాయని, మరికొన్ని చోట్ల అద్దె భవనాల్లో నడుస్తున్నాయన్నారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం పునఃప్రారంభించాలన్నారు. ఉన్నత చదువులకు శాపంగా మారిన జీవో 77ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఏఐఎ్‌సఎఫ్‌ జిల్లా అధ్యక్షులు రమణయ్య, కుళ్లాయిస్వామి, ఆంజనేయులు, వెంకట్‌ నాయక్‌, మంజునాథ్‌ పాల్గొన్నారు.


నార్పల: విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏఐఎ్‌సఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు వీ జాన్సనబాబు డిమాండ్‌ చేశారు. ఏఐఎ్‌సఎఫ్‌ ఆధ్వర్యంలో చేపట్టిన జీపుజాతా గురువారం నార్పలకు చేరుకుంది. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయాలి, ప్రభుత్వ హాస్టల్‌ విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో సాయిస్వరూప, రాధాజ్యోతి, హనమంతు, వంశీ, నవీనసాయి, జైచంద్ర, కార్తిక్‌, ఉమేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Aug 01 , 2024 | 11:59 PM

Advertising
Advertising
<