ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Met after 36 years.. 36 ఏళ్ల తర్వాత కలుసుకున్నారు..

ABN, Publish Date - Sep 16 , 2024 | 12:17 AM

వారంతా 36 ఏళ్ల క్రితం యాడికి ప్రభుత్వ ఉన్నతపాఠశాలలో 10వ తరగతిని చదివారు. తర్వాత అదే పాఠశాలలో ఆదివారం వారు గెట్‌ టు గెదర్‌ నిర్వహించి మళ్లీ ఇన్నేళ్లకు ఒక్కటిగా కలిశారు.

యాడికి హైస్కూల్లో నాటి గురువులతో పూర్వవిద్యార్థులు

-యాడికి హైస్కూల్లో పూర్వవిద్యార్థుల సమ్మేళనం

యాడికి, సెప్టెంబరు 15: వారంతా 36 ఏళ్ల క్రితం యాడికి ప్రభుత్వ ఉన్నతపాఠశాలలో 10వ తరగతిని చదివారు. తర్వాత అదే పాఠశాలలో ఆదివారం వారు గెట్‌ టు గెదర్‌ నిర్వహించి మళ్లీ ఇన్నేళ్లకు ఒక్కటిగా కలిశారు.


1988-89వ విద్యా సంవత్సరంలో 10వ తరగతి చదివిన సుమారు 84మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమకు విద్యాబుద్ధులు నేర్పిన నాటి ఉపాధ్యాయులు భాస్కర్‌రెడ్డి, అశ్వర్థరెడ్డి, నారాయణస్వామి, నారాయణరెడ్డి, జనార్దనను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. అలాగే మృతి చెందిన ఉపాధ్యాయులకు నివాళులర్పించారు. అంతేకాకుండా తమతోపాటు విద్యాభ్యాసం చేసి మృతిచెందిన 12మంది సహచర విద్యార్థులకూ నివాళులర్పించారు. తర్వాత ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుని నాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. సాయంత్రం దాకా అందరూ సంతోషంగా గడిపారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం..

Updated Date - Sep 16 , 2024 | 12:17 AM

Advertising
Advertising