Minister Satya Kumar అమ్మపేరుతో మొక్క నాటాలి
ABN, Publish Date - Oct 20 , 2024 | 12:06 AM
ప్రకృతి ప్రసాదించిన పర్యవరణాన్ని పరిరక్షించుకునేందుకు ప్రతి ఒక్కరూ వారి అమ్మ పేరుతో ఒక మొక్కను నాటి పెంచాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పిలుపునిచ్చారు.
రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్
అనంతపురం సెంట్రల్, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): ప్రకృతి ప్రసాదించిన పర్యవరణాన్ని పరిరక్షించుకునేందుకు ప్రతి ఒక్కరూ వారి అమ్మ పేరుతో ఒక మొక్కను నాటి పెంచాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పిలుపునిచ్చారు. శనివారం కేఎ్‌సఎన ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ‘అమ్మ పేరుతో ఒక మొక్క’ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి మందల శాంతకుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాసులు, మంత్రి సత్యకుమార్ యాదవ్‌తోపాటు జాతీయ దళిత మోర్చా అధ్యక్షుడు లాల్‌సింగ్ ఆర్య, రాష్ట్ర అధ్యక్షుడు గుడిసె దేవానంద్, జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్ ముఖ్య అతిథులుగా హాజరై మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ పెరుగుతున్న కాలుష్యం, వాతావరణ మార్పులు, అకాల వర్షాలు తదితర వాటిని నియంత్రించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. స్ఫూర్తిదాయకంగా ప్రధాని మోదీ మొక్కనాటి తన తల్లి హీరాబెన పేరును నామకరణం చేశారని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు సాకేశివశంకర్, జిల్లా అధ్యక్షుడు ప్రభుకుమార్, బీజేపీ నాయకులు లలితకుమార్, సూర్య, నాగేంద్ర, జయలక్ష్మి, రామ్‌దాస్, కళాశాల ప్రిన్సిపాల్ సత్యలత, వైస్ ప్రిన్సిపాల్ లక్ష్మీరంగయ్య, అధ్యాపకులు పాల్గొన్నారు.
Updated Date - Oct 20 , 2024 | 12:06 AM