ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

mother: పాప కోసం..అమ్మ వచ్చేసింది..!

ABN, Publish Date - Oct 07 , 2024 | 11:26 PM

కడసారి నిన్ను కళ్లారా చూసుకుని ఎవరి చేతుల్లోనే పెట్టేసి వెళ్లిపోయాను.. ఇంక తిరిగిరాని తీరాలకు తరలిపోవాలనే అనుకున్నాను.. విధి పగబట్టి వెంటాడుతుంటే.. భరించలేకపోయానే తల్లీ..! కోడలిలో కూతుర్ని చూశారు..! రాలిపోయిన పసుపు కుంకుమలను ఇంకెక్కడో వెతుక్కోమన్నారు.. వెళ్లిపోయాను..! ఎవడినో నమ్మి.. నిన్ను కన్నానే తల్లీ..! వాడు బతుకునివ్వలేదు.. బతకనివ్వనూ లేదు..! ‘వెళ్లిపోదామనుకున్నా’నే తల్లీ..! నువ్వు గొర్తొచ్చి ఆగిపోయాను..!

The police are counseling the child's mother, Jyoti

కడసారి నిన్ను కళ్లారా చూసుకుని ఎవరి చేతుల్లోనే పెట్టేసి వెళ్లిపోయాను.. ఇంక తిరిగిరాని తీరాలకు తరలిపోవాలనే అనుకున్నాను.. విధి పగబట్టి వెంటాడుతుంటే.. భరించలేకపోయానే తల్లీ..! కోడలిలో కూతుర్ని చూశారు..! రాలిపోయిన పసుపు కుంకుమలను ఇంకెక్కడో వెతుక్కోమన్నారు.. వెళ్లిపోయాను..! ఎవడినో నమ్మి.. నిన్ను కన్నానే తల్లీ..! వాడు బతుకునివ్వలేదు.. బతకనివ్వనూ లేదు..! ‘వెళ్లిపోదామనుకున్నా’నే తల్లీ..! నువ్వు గొర్తొచ్చి ఆగిపోయాను..!

కదిరి, అక్టోబరు 7: పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో ఆదివారం చిన్నారిని వదిలి వెళ్లిన తల్లి బిడ్డను వెదుక్కుంటూ వచ్చింది. సీఐ నారాయణరెడ్డి తెలిపిన మేరకు గుమ్మఘట్ట మండలం గలగల గ్రామానికి చెందిన జ్యోతి అనే మహిళకు ఇదివరకే వివాహమైంది. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.

అయితే భర్త చనిపోవడంతో ఆ పిల్లలను ఆమె అత్తమామలు తీసుకెళ్లి, పోషిస్తున్నారు. దీంతో ఇటీవల కర్ణాటక రాష్ట్రంలోని దొడ్డబళ్లాపూర్‌ దగ్గర గల ఏతం గ్రామానికి చెందిన కుమార్‌ అనే వ్యక్తిని రెండో వివాహం చేసుకుంది. వీరికి ఓ పాప జన్మించింది. భర్త వేధింపులు ఎక్కువ కావడంతో తట్టుకోలేక ఎవరికీ తెలియని చోటుకు వెళ్లాలని చంటిబిడ్డతో కదిరికి వచ్చింది. అక్కడే పని చేసుకుని బతకాలని నిర్ణయించుకుంది. అయితే వెంటాడే బాధలు భరించలేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. దీంతో బస్టాండ్‌లో ఉన్న ఓ యువతికి ఇప్పుడే వస్తానంటూ పాపను అప్పగించి బయటకెళ్లిపోయింది. ఆమె ఎంతసేపటికి రాకపోవడంతో ఆయువతి పాప విషయం పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు అక్కడికి చేరుకుని చిన్నారిని ఐసీడీఎస్‌ వారికి అప్పగించారు. అయితే పాపా మీద బెంగతో ఆమె తిరిగి బస్టాండుకు వచ్చి వెదకసాగింది. ఆమెను గుర్తించిన పోలీసులు స్టేషనకు తీసుకెళ్లి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. అనంతరం ఆమె బంధువులకు సమాచారం అందించారు. కాగా చిన్నారిని అనంతపురంలోని చైల్డు వైల్ఫేర్‌కు తరలించారు. వారు సంరక్షణ కోసం పాపను పుట్టపర్తిలోని శిశువిహార్‌కు పంపినట్లు చెప్పారు.

Updated Date - Oct 08 , 2024 | 10:03 AM