ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

APTF: నెలవారీ ఉద్యోగోన్నతులు ఇవ్వాలి

ABN, Publish Date - Sep 16 , 2024 | 11:56 PM

ఉపాధ్యాయులకు నెలవారీ ఉద్యోగోన్నతులు ఇవ్వాలని ఏపీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు రాయల్‌ వెంకటేశ్వర్లు, ప్రధానకార్యదర్శి సిరాజుద్దీన డిమాండ్‌ చేశారు. సోమవారం ఆ సంఘం జోనల్‌ కార్యదర్శి సతీ్‌షకుమార్‌ అధ్యక్షతన ఉపాధ్యాయభవనలో సమావేశం నిర్వహించారు.

Sirajuddin speaking

అనంతపురం విద్య, సెప్టెంబరు 16: ఉపాధ్యాయులకు నెలవారీ ఉద్యోగోన్నతులు ఇవ్వాలని ఏపీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు రాయల్‌ వెంకటేశ్వర్లు, ప్రధానకార్యదర్శి సిరాజుద్దీన డిమాండ్‌ చేశారు. సోమవారం ఆ సంఘం జోనల్‌ కార్యదర్శి సతీ్‌షకుమార్‌ అధ్యక్షతన ఉపాధ్యాయభవనలో సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ రెండేళ్లుగా నెలవారీ ఉద్యోగోన్నతులు ఇవ్వకపోవడంతో వేలాది ఖాళీలు అలాగే ఉన్నాయన్నారు. మండల స్థాయిలో జరగాల్సిన పని సర్దుబాటు ప్రక్రియను రాష్ట్రస్థాయి అధికారులు ఆధ్వర్యంలో చేయడం వల్ల చాలా మంది ఉపాధ్యాయులు ఆందోళన పడ్డారన్నారు. ఈ ప్రక్రియ పూ ర్తిగా అసంబద్ధమైందన్నారు. సర్దుబాటు 8 కిలోమీటర్ల లోపు ఉండాలన్న నిబంధనలను పక్కనబెట్టేసి డివిజన పేరుతో సుదూర ప్రాంతాలకు టీచర్లను సర్దుబాటు చేయడంతో అవస్థలు పడుతున్నారని తెలిపారు. జిల్లా గౌరవ సలహాదారులు వెంకటేశులు, ఉపాధ్యక్షులు బొమ్మయ్య, సతీష్‌, సర్దార్‌వలి పాల్గొన్నారు.

Updated Date - Sep 16 , 2024 | 11:56 PM

Advertising
Advertising