NARASIMHA SWAMY : నారసింహుడి రథోత్సవం
ABN, Publish Date - May 28 , 2024 | 11:53 PM
పెన్నహోబిలంలో లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మ రథోత్సవం మంగళవారం కన్నుల పండువగా సాగింది. అశేష భక్తజనం ‘నమో నారసింహా’ అని నినదిస్తుండగా.. స్వామివారి రథం ముందుకు సాగింది. బ్రహ్మోత్సవాలలో ప్రధానఘట్టమైన రథోత్సవాన్ని తిలకించేందుకు జిల్లా నలుమూలలు, కర్ణాటక నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆలయంలో స్వామి వారికి ఉదయం ...
పులకించిన పెన్నహోబిలం
పెన్నహోబిలంలో లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మ రథోత్సవం మంగళవారం కన్నుల పండువగా సాగింది. అశేష భక్తజనం ‘నమో నారసింహా’ అని నినదిస్తుండగా.. స్వామివారి రథం ముందుకు సాగింది. బ్రహ్మోత్సవాలలో ప్రధానఘట్టమైన రథోత్సవాన్ని తిలకించేందుకు జిల్లా నలుమూలలు, కర్ణాటక నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆలయంలో స్వామి వారికి ఉదయం సుప్రభాత సేవ, అర్చన, అలంకరణ, ఉత్సవ నిత్యహోమాలను నిర్వహించారు. ఉత్సవమూర్తులను పట్టువసా్త్రలతో అలంకరించి, మేళతాళాల మధ్య ఊరేగింపుగా తీసుకువచ్చి రథంలో
అధిష్టింపచేశారు. ఉదయం 10 గంటలకు మడుగుతేరు నిర్వహించారు. సాయంత్రం బ్రహ్మ రథోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు అరటిపండ్లు, జామపండ్లు విసిరి మొక్కు తీర్చుకున్నారు. గుంతకల్లు డీఎస్పీ శివభాస్కర్‌రెడ్డి, సీఐలు సురేష్, ప్రవీణ్ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. ఈవోలు విజయ్‌కుమార్, అక్కిరెడ్డి, ప్రధాన అర్చకులు ద్వారకనాథాచార్యులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. స్వామివారికి బుధవారం అశ్వవాహనోత్సవాన్ని నిర్వహిస్తారు. ఆలయంలో సుప్రభాతసేవ, అలంకరణ, నిత్యహోమాలు కొనసాగుతాయి. - ఉరవకొండ
మరిన్ని అనంతపురం వార్తల కోసం...
Updated Date - May 28 , 2024 | 11:53 PM