ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AMILINENI: నయవంచకుడు సీఎం జగన

ABN, Publish Date - May 09 , 2024 | 11:38 PM

సీఉం జగన్మోహన రెడ్డి నయవంచకుడని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు మండిపడ్డారు. గురువారం ప్రజావేదిక వద్ద విప్‌ కాపు రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ మహమ్మద్‌ ఇక్బాల్‌, మున్సిపల్‌ మాజీ ఛైర్మన వైపి రమేష్‌, మార్కెట్‌ మాజీ యార్డు చైర్మన చౌళం మల్లికార్జున, మండల కన్వీనర్‌ పాలబండ్ల శ్రీరాములు, జనసేన నాయకులు బాల్యం రాజే్‌షతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు.

మాట్లాడుతున్న అమిలినేని సురేంద్రబాబు

కూటమి అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు

కళ్యాణదుర్గంరూరల్‌, మే 9: సీఉం జగన్మోహన రెడ్డి నయవంచకుడని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు మండిపడ్డారు. గురువారం ప్రజావేదిక వద్ద విప్‌ కాపు రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ మహమ్మద్‌ ఇక్బాల్‌, మున్సిపల్‌ మాజీ ఛైర్మన వైపి రమేష్‌, మార్కెట్‌ మాజీ యార్డు చైర్మన చౌళం మల్లికార్జున, మండల కన్వీనర్‌ పాలబండ్ల శ్రీరాములు, జనసేన నాయకులు బాల్యం రాజే్‌షతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ సీఎం జగన స్వార్థానికి ప్రాజెక్టులను నిర్వీర్యం చేశాడన్నారు. గతంలో ప్రతిపక్షంలో వున్నప్పుడు కూడా ఆయన బీటీపీ ప్రాజెక్టుపై ప్రగల్భాలు పలికారని ఎద్దేవా చేశారు. ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఇచ్చిన మాటకే విలువలు లేదన్నారు. కుందుర్పి బ్రాంచ కెనాల్‌ బీటీపీ ప్రాజెక్టుకు సంబంధించిన పనులన్నీ ఆరు వారాల్లోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చి రైతులకు మొండిచేయి చూపిన ఘనత ఆయనకే దక్కిందన్నారు.


ఇప్పుడు కూడా గతంలో రెండుసార్లు బీటీపీ ప్రాజెక్టుపై కల్లబొల్లి మాటలు చెప్పాడని ఇప్పుడు కూడా అవే మాటలు చెబితే ప్రజలు నమ్మరని భావించిన సీఎం కనీసం బీటీపీ ప్రాజెక్టుపై ఊసెత్తకుండా తప్పించుకుని వెళ్లి పోయాడన్నారు. ఇక్కడ పనిచేసిన మంత్రి ఉషశ్రీచరణ్‌, రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్పి ప్రకాష్‌ రెడ్డి ఇద్దరూ కళ్యాణదుర్గం, రాయదుర్గం నియోజకవర్గ రైతులకు తీరని అన్యాయం చేశారన్నారు. కాపు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ కళ్యాణదుర్గం నియోజకవర్గం అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలంటే కూటమి అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబును అత్యధిక మెజారిటీతో గెలిపించాలన్నారు.

Updated Date - May 09 , 2024 | 11:38 PM

Advertising
Advertising