ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

చెరువంత నిర్లక్ష్యం..!

ABN, Publish Date - Sep 12 , 2024 | 12:06 AM

మండలంలో మొత్తం 56 చెరువులుండగా అన్నీ ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకున్నాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చెరువుల నిర్వహణ గాలికి వదిలేయడంతో ఈ దుస్థితికి చేరుకున్నాయి.

నల్లచెరువు సమీపంలో ఉన్న కొత్తచెరువు కట్టపై పెరిగిన ముళ్ల కంపలు

నల్లచెరువు, సెప్టెంబరు 11: మండలంలో మొత్తం 56 చెరువులుండగా అన్నీ ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకున్నాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చెరువుల నిర్వహణ గాలికి వదిలేయడంతో ఈ దుస్థితికి చేరుకున్నాయి. చెరువులో.. చెరువు కట్టపై... చెరువు కాలువల్లో కంపచెట్లు, పిచ్చిమొక్కలు భారీగా పెరిగాయి. పూడిక తీయకపోవడంతో కాలువులు పూడిపోయే దశలో ఉన్నాయి. చెరువు కట్టలకు మరమ్మతులు చేపట్టక పోవడంతో ప్రస్తుతం నీరొస్తే... గండ్లు పడటం.. తెగిపోయే ప్రమాద ముందని ఆయకట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలువలో ముళ్ల పొదలు, పూడిక పేరుకుపోవడంతో వర్షపునీరు చెరువు చేరే అవకాశం లేకుండా పోతోందని వాపోతున్నారు.


దేవరింటిపల్లి కొత్తచెరువు, కాయలవాండ్లపల్లి చెరువు, పోలేవాండ్లపల్లి ఆవుల చెరువు, పట్రవాండ్లపల్లి చెరువు, పంతులచెరువు, కే.పూల కుంటచెరువు, ఉబ్బిచెర్ల చెరువు, పి.కొత్తపల్లి చెరువు తదితర చెరువు కట్టలు బలహీన పడ్డాయి. కె పూలకుంట చెరువు కట్ట కింద వంద ఎకరాలు, పంతులచెరువు కింద 120 ఎకరాలు సాగు చేస్తున్నారు. చెరువులో ముళ్ల కంపలు భారీగా పెరగడంతో.. నీటిసామర్థ్యం 30 శాతం తగ్గిందంటున్నారు. చెరువులో ముళ్లపొదలు తొలగిస్తే నీటి సామర్థ్యం పెరగడంతోపాటు చెరువులో చేపలు పెంచడానికి అనువుగా ఉంటుందని, దీని వలన పంచాయతీకీ అదనంగా ఆదాయం చేరుకుతుందని రైతులు అంటున్నారు.

Updated Date - Sep 12 , 2024 | 12:06 AM

Advertising
Advertising