JAGANNA HOUSES : అలాంటిలాంటోడు కాదు!
ABN, Publish Date - Jun 30 , 2024 | 12:50 AM
హౌసింగ్‌లో అనకొండ వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. కొన్నేళ్ల నుంచి ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆయన తీరు మారలేదని స్పష్టమౌతోంది. వైఎస్సార్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మొదలు.. జగన నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం వరకూ ఆయన అక్రమాల పరంపర కొనసాగిందని ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి. పార్టీలతో నిమిత్తం లేకుండా.. ప్రజా ప్రతినిధులను బుట్టలో వేసుకోవడం, అడ్డులేకుండా అక్రమాలకు పాల్పడటం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అని అంటున్నారు. వైసీపీ ఓటమి తరువాత తొలిసారిగా ...
ఇందిరమ్మ కాలం నుంచే అక్రమాలు
ప్రభుత్వం ఏదైనా.. అవినీతి పండిస్తాడు
ముగ్గురు శిశ్యులతో సామగ్రిని మింగేశాడు
మడకశిరలో ఉన్నప్పుడే రాటుదేలి పోయాడు
జగన హయాంలో అక్రమాలు పరాకాష్టకు..
హౌసింగ్ అనకొండలో ఇప్పుడిప్పుడే గుబులు
హౌసింగ్‌లో అనకొండ వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. కొన్నేళ్ల నుంచి ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆయన తీరు మారలేదని స్పష్టమౌతోంది. వైఎస్సార్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మొదలు.. జగన నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం వరకూ ఆయన అక్రమాల పరంపర కొనసాగిందని ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి. పార్టీలతో నిమిత్తం లేకుండా.. ప్రజా ప్రతినిధులను బుట్టలో వేసుకోవడం, అడ్డులేకుండా అక్రమాలకు పాల్పడటం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అని అంటున్నారు. వైసీపీ ఓటమి తరువాత తొలిసారిగా
ఆయనకు గుబులు పట్టుకుందని సమాచారం. రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ రెడ్డి అండతో ఆయన భారీగా అక్రమాలకు పాల్పడటమే దీనికి కారణమని అంటున్నారు. శాఖపరంగా తనకు సహకరించే ఉన్నతాధికారి సెలవులో వెళ్లడంతో తన పరిస్థితి ఏమిటోనని ఆయన వణికిపోతున్నట్లు సమాచారం. గృహ నిర్మాణశాఖ ఇనచార్జి పీడీగా శైలజను కలెక్టర్ నియమించడంలో అనకొండ ఇంజనీరు దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారని సమాచారం.
- అనంతపురం సిటీ
శిష్యులతో కలిసి దోపిడీ
ఉమ్మడి జిల్లా విడిపోయిన సమయంలో రాప్తాడు నియోజకవర్గ పరిధిలో ఉద్యోగుల సర్దుబాటు జరిగింది. రాప్తాడు నియోజకవర్గ పరిధిలోని సీకే పల్లి, కనగానపల్లి, రామగిరి మండలాలకు సంబంధించిన ముగ్గురు ఏఈఈలను అప్పటి ఎమ్మెల్యే అండతో అనకొండ ఇంజనీరు బదిలీ చేయించుకున్నారు. గురు శిష్యులు కలిసి జగనన్న ఇళ్ల నిర్మాణంలో ఎక్కడ సందు దొరికితే అక్కడ దోచుకున్నారు. ఆ ప్రాంతాల డీఈఈ కూడా వీరితో కొంత వరకూ చేతులు కలిపినట్లు ఆరోపణలు ఉన్నాయి. అనకొండ శిష్యులైన ముగ్గురు ఏఈలు సైతం సిమెంటు, స్టీలు, ఇసుక తదితర సామగ్రిని పెద్దఎత్తున పక్కదారి పట్టించారు. స్టేజ్‌లతో సంబంధం లేకుండా అడ్డదిడ్డంగా బిల్లులు చేశారు. ఒక్కొక్కరు రూ.50 లక్షలకు పైగా సొమ్ము చేసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఒక ఏఈ ఏకంగా
తమ పరిధిలోని ఓ వైసీపీ నాయకుడి ఇంటికి 70 శాతం జగనన్న ఇళ్ల సామగ్రి తరలించడంలో కీలక పాత్ర పోషించారని తెలిసింది. ఈ ముగ్గురు ఏఈల పరిధిలోని ఇళ్ల నిర్మాణాలు, లబ్ధిదారులకు సరఫరా చేసిన సామగ్రి, చేసిన బిల్లులు తదితరాలపై లోతుగా విచారిస్తే అక్రమాలు వెలుగులోకి వస్తాయని అంటున్నారు. అనకొండ శిష్యులు ముగ్గురు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కావడంతో ఏమాత్రం సంకోచం లేకుండా ఆక్రమాలకు పాల్పడ్డారని సమాచారం.
సామగ్రి పక్కదారి..
జగనన్న ఇళ్ల నిర్మాణాల కోసం ప్రభుత్వం అందించే సిమెంట్, స్టీల్‌ను నగర శివారులోని గోడౌనలో నిల్వ చేసి.. సరఫరా చేసేవారు. ఇక్కడే అసలు కథ మొదలైనట్లు సమాచారం. అనకొండ డీఈఈతో పాటు మరికొందరు ఉద్యోగులు కలిసి టన్నులకొద్దీ స్టీల్‌ను, వేల సంఖ్యలో సిమెంట్ బస్తాలను పక్కదారి పట్టించారని సమాచారం. అక్కడి వాచమన, సిమెంట్ ఇనచార్జిని అడ్డుగా పెట్టుకుని కథ నడిపించారని సమాచారం. ఇందుకు అప్పటి ఎమ్మెల్యే సహకారం కూడా ఉందని, సిమెంట్ విషయంలో భారీగా అక్రమాలు జరిగాయని ఆ శాఖ వర్గాల్లో చర్చ సాగుతోంది. విచారణలోనూ అక్రమాలు తేలినట్లు తెలిసింది. ఆక్రమాలు బయటపడకుండా నాటి ఎమ్మెల్యే, అనకొండ జాగ్రత్త పడ్డారని సమాచారం. జిల్లా ఉన్నతాధికారి సమీప బంధువుకు వందల సంఖ్యలో సిమెంట్ బస్తాలను గుట్టుగా తరలించి, తమ వ్యవహారాలకు అడ్డు రాకుండా చూసుకున్నారని సమాచారం. బినామీ కాంట్రాక్టర్లను ఏర్పాటు చేసుకుని, జగనన్న ఇళ్ల సామగ్రిని పీఆర్ శాఖ సిమెంట్ రోడ్లకు తరలించి.. అప్పటి ఎమ్మెల్యే తోపు అక్రమాలకు పాల్పడ్డారని రోపణలు ఉన్నాయి. రాప్తాడు మాజీ ఎమ్మెల్యేకి అనుకూలంగా ఉండే వైస్ ఎంపీపీ స్థాయి నాయకుడు కురుగుంట జగనన్న ఇళ్ల నిర్మాణంలో ఏమాత్రం నాణ్యత పాటించకుండా సొమ్ము చేసుకున్నారు. ఇసుక, సిమెంట్, కంకర, స్టీల్‌ను పక్కదారి పట్టించారు. అనకొండ డీఈఈ క్రీడా వికాస కేంద్రాల నిర్మాణాల్లోను భారీగా ఆక్రమాలకు పాల్పడినట్లు సమాచారం.
కాంగ్రెస్ హయాం నుంచే..
వైఎస్సార్ సీఎంగా ఉన్న సమయంలో అనకొండ ఇంజనీరు మడకశిరలో పనిచేసేవారు. పెనుకొండ డీఈఈగా మరొక అధికారి ఉండేవారు. ఆ సమయంలో ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల కోసం సిమెంట్, సిమెంట్ తీర్లును గోడన్లలో ఉంచి.. లబ్ధిదారులకు సరఫరా చేసింది. అప్పటి మంత్రిని మాయమాటలతో ప్రసన్నం చేసుకుని.. ఇద్దరూ భారీ ఎత్తున ఆక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. రూ.కోట్లలో దోచుకున్నట్లు పత్రికల్లో కథనాలు వచ్చాయి. ఈ అవినీతి, ఆక్రమాలపై అప్పటి ప్రభుత్వం విచారణకు అదేశించింది. కానీ విచారణ బుట్టదాఖలైంది. ఆ తరువాత కూడా అనకొండకు పెద్ద పీట వేస్తూనే ఉన్నారు. అక్రమ సంపాదనకు పనికొచ్చే అధికారి కావడంతో కొందరు ప్రజా ప్రతినిధులు కూడా ఆయనను ప్రోత్సహించారన్న ఆరోపణలు ఉన్నాయి.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - Jun 30 , 2024 | 12:50 AM