ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

KDR COURT: కార్యాలయాన్ని ఆలయంలా భావించాలి

ABN, Publish Date - Oct 19 , 2024 | 11:39 PM

ప్రతి ఉద్యోగి తాము పని చేసే కార్యాలయాన్ని దేవాలయంలా భావించాలని మండల న్యాయసేవాధికార సంస్థ చైర్‌పర్సన, న్యాయాధికారి ఎస్‌.జయలక్ష్మి అన్నారు.

Kadiri is a corrupt magistrate in the court

కదిరిలీగల్‌, అక్టోబరు 19(ఆంధ్రజ్యోతి): ప్రతి ఉద్యోగి తాము పని చేసే కార్యాలయాన్ని దేవాలయంలా భావించాలని మండల న్యాయసేవాధికార సంస్థ చైర్‌పర్సన, న్యాయాధికారి ఎస్‌.జయలక్ష్మి అన్నారు. స్వచ్ఛభారత కార్యక్రమంలో భాగంగా శనివారం స్థానిక కోర్టులో క్లీన అండ్‌ గ్రీన కార్యక్రమాన్ని నిర్వహించారు. సబ్‌కోర్టు పర్యవేక్షణాధికారి ప్రకా్‌షబాబుతో పాటు ఆమె కోర్టులోని అన్ని విభాగాలను సందర్శించారు. పరక చేతపట్టి కనిపించిన బూజును తొలగించారు. సిబ్బంది చేత కూడా పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహింపజేశారు. జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహాన్ని శుభ్రం చేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ నెలలో ప్రతి మూడో శనివారం కార్యక్రమాన్ని నిర్వహించాలన్న హైకోర్టు ఆదేశాల మేరకు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. తాను ప్రతిసారి అన్ని విభాగాలను పరిశీలిస్తానని శుభ్రతలేకపోతే కఠినంగా వ్యవహరిస్తానని హెచ్చరించారు. కోర్టులోని కొన్ని భవనాలు వర్షానికి కారుతుండటం పట్ల ఆమె అసహనం వ్యక్తం చేశారు. దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని పర్యవేక్షణాధికారిని ఆదేశించారు.

పరిసరాల పరిశుభ్రత కోసం స్వచ్ఛతాహీ సేవ

పుట్టపర్తి రూరల్‌: కోర్టు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం కోసమే స్వచ్ఛతాహీ సేవ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పుట్టపర్తి జూనియర్‌ సివిల్‌ న్యాయాధికారి రాకేష్‌ అన్నారు. శనివారం కోర్టు పరిసరాలను సిబ్బందితో కలిసి శుభ్రం చేశారు. రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు ప్రతినెలా మూడో శనివారం ఈ కార్యక్రమాన్ని చేపడతామన్నారు. ఇందులో భా గంగా కోర్టు పరిసరాలు పరిశుభ్రం చేయడం చేశామన్నారు. ప్రతిఒక్కరూ పరిసరాల పరిశుభ్రత పాటిస్తే ఆరోగ్యకర సమాజం నెలకొంటుందన్నారు. బార్‌ఆసోసియేషన అధ్యక్షుడు కత్తిగంగిరెడ్డి, న్యాయవాదులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Oct 19 , 2024 | 11:39 PM