ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

PINCHAN : పింఛన్ల పందేరం..!

ABN, Publish Date - Jul 21 , 2024 | 12:39 AM

వృద్ధులు, దివ్యాంగులు, విభిన్న ప్రతిభావంతులు, ఒంటరి మహిళలు, వితంతువులు, అంతరించిపోతున్న వృత్తులవారి జీవనానికి భరోసా కల్పించేందుకు ప్రభుత్వాలు సామాజిక భద్రత పింఛన్లను అందిస్తున్నాయి. నెల నెలా వచ్చే సొమ్ము ఆ వర్గాలవారు ఆత్మగౌరవంతో జీవించేందుకు కొంత ఆసరా అవుతున్నాయి. కానీ వైసీపీ హయాంలో వీటినికూడా పక్కదారి పట్టించారు. పింఛన్ల మంజూరు, పంపిణీలో కీలకంగా వ్యవహరించిన వలంటీర్లు కొందరు ప్రభుత్వం అందించే పింఛన్లను...

MPDO to complain People who came to the office

వైకల్యం లేకున్నా సదరం సర్టిఫికెట్‌

చెవుడు, మూగవారిగా చూపించారు..

భర్తతో ఉంటూ.. ఒంటరి మహిళగా..

వైసీపీ హయాంలో భారీగా అక్రమాలు

వలంటీర్ల ఇళ్లలో ఇద్దరు ముగ్గురికి పింఛన

కూడేరు/శింగనమల, జూలై 20: వృద్ధులు, దివ్యాంగులు, విభిన్న ప్రతిభావంతులు, ఒంటరి మహిళలు, వితంతువులు, అంతరించిపోతున్న వృత్తులవారి జీవనానికి భరోసా కల్పించేందుకు ప్రభుత్వాలు సామాజిక భద్రత పింఛన్లను అందిస్తున్నాయి. నెల నెలా వచ్చే సొమ్ము ఆ వర్గాలవారు ఆత్మగౌరవంతో జీవించేందుకు కొంత ఆసరా అవుతున్నాయి. కానీ వైసీపీ హయాంలో వీటినికూడా పక్కదారి పట్టించారు. పింఛన్ల మంజూరు, పంపిణీలో కీలకంగా వ్యవహరించిన వలంటీర్లు కొందరు ప్రభుత్వం అందించే పింఛన్లను అనర్హులకు దక్కేలా చేశారు. తమ కుటుంబ సభ్యులు, సన్నిహితులు, ముడుపులు ఇచ్చినవారికి పింఛన్లను దొడ్డిదారిలో మంజూరు చేయించారు. ప్రభుత్వం మారడంతో ఈ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.

దొడ్డిదారిలో పింఛన్లు

కూడేరు మండలంలో 5,700 మందికి పింఛన్లు వస్తున్నాయి. వైసీపీ అధికారంలోకి రాగానే టీడీపీ సానుభూతిపరుల పింఛన్లను పెద్ద ఎత్తున్న తొలగించారు. కొందరు అధికారులు వైసీపీ కార్యకర్తల తరహాలో వ్యవహరించారు. అనర్హులకు పింఛన్లు మంజూరు చేశారు. పది ఎకరాలు, అంతకన్నా ఎక్కువ భూమి ఉన్న రైతులకు గత ప్రభుత్వంలో పింఛన్లు నిలిపివేశారు. అలా పింఛన్లు కోల్పోయినవారికి


కొందరు అధికారులు అడ్డదారుల్లో మళ్లీ పింఛన్లు మంజూరు చేశారు. వైకల్యం లేకపోయినా.. అక్రమంగా సదరం సర్టిఫికెట్లు పొందిన వారు, భర్త ఉన్నా ఒంటరి మహిళ అని చూపించినవారు, వయసు తక్కువగా ఉన్నా... వృద్ధాప్యంలో ఉన్నట్లు చూపించినవారు పింఛన్ల జాబితాలో వందల్లో ఉన్నారు. ఆధార్‌ కార్డుల్లో వయసును మార్చడం, వైద్యులకు ముడుపులు ఇచ్చి వైకల్యం ఉన్నట్లు సరిఫికెట్లు పొందడం ద్వారా అక్రమంగా పింఛన్లు అందుకుంటున్నారు.

అధికారం మారడంతో..

వైసీపీ పాలనలో వలంటీర్లు ద్వారా ఇంటింటికీ పింఛన్లు అందజేశారు. దీంతో అక్రమాల గుట్టు బయట పడలేదు. టీడీపీ కూటమి అధికారం చేపట్టగానే సచివాలయ ఉద్యోగుల చేత పింఛన్లను పంపిణీ చేయిస్తున్నారు. వారి వెంట తెలుగు తమ్ముళ్లు వెళ్లి పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో అక్రమాలు బయట పడుతున్నాయి. అనర్హులకు పింఛన్లు మంజూరు చేసిన అధికారులపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందుకు టీడీపీ నాయకులు సిద్ధమవుతున్నారు. చోళసముద్రం, ఉదిరిపికొండ తండా, జయపురం తదితర గ్రామాలలో అనర్హులను గుర్తించారు. వారి పింఛన్లను తొలగించాలని కోరుతూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశామని తెలిపారు.

ఇదిగో.. అక్రమ పింఛన్లు

- ఉదిరిపికొండ తండాలో మోతి బాయి (ఐడీ నంబర్‌ 112967407), తిప్పేనాయక్‌ (ఐడీ నంబర్‌ 112868190) దంపతులు కలిసే ఉన్నారు. కానీ వేర్వేరుగా రేషనకార్డులు పొంది.. ఇద్దరూ వృద్ధాప్య పింఛన్లు పొందుతున్నారు.

- ఇదే తండాలో మూడ్‌ దుర్డమ్మ (ఐడీ నంబర్‌ 11200116792), శంకర్‌నాయక్‌ (ఐడీ నంబర్‌ 1129 66584) దంపతులు, షేక్‌ హుస్సేన బీ (ఐడీ నంబర్‌ 112900558), షేక్‌ పెద్ద హుసేన సాబ్‌ (ఐడీ నంబర్‌ 112906091) దంపతులు వేర్వేరు రేషనకార్డులతో పింఛన్లు పొందుతున్నారు.

- ఫాతిమా అనే మహిళ తన భర్తతో కాపురం చేస్తూనే.. ఒంటరి మహిళ కోటాలో (ఐడీ నంబర్‌ 112965146) పింఛన పొందుతున్నారు.

- చోళసముద్రంలో వైకల్యం లేకపోయినా పలువురు దివ్యాంగుల కోటా పింఛన్లు తీసుకుంటున్నారు. అడ్డదారిలో సదరం సర్టిఫికెట్లు తెచుకుని.. అక్రమంగా పింఛన అందుకుంటున్నారు. సావిత్రి (ఐడీ నంబర్‌ 11200 196922), నాగేంద్ర (ఐడీ నంబర్‌ 11200174864) ఇందుకు ఉదాహరణ. ఇదే గ్రామంలో చర్మకారుల కింద వన్నూరప్ప (11200182639), శ్రీనివాసులు (11200170997), ఎర్రిస్వామి (11200171002) తదితరులు అర్హత లేకున్నా పింఛన్లు పొందుతున్నారని ఉత్నతాధికారులకు టీడీపీ నాయకులు ఫిర్యాదు చేశారు.

- జయపురంలో దాదాపు 16 మంది అనర్హులు పింఛన్లు పొందుతున్నారని టీడీపీ నాయకులు గుర్తించారు. వీరి జాబితాతో ఉన్నాధికారులకు ఫిర్యాదు చేశారు. చోళసముద్రం గ్రామంలో అనర్హులకు అందిన పింఛన్లపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారని ఇనచార్జి ఎంపీడీఓ విజయలలిత తెలిపారు.

మీరైనా తొలగించండి..

‘మా ప్రభుత్వంలో అధికారులు, ప్రజాప్రతినిధుల అండతో చాలామంది అక్రమంగా పింఛన్లు తీసుకున్నారు. ప్రతి వలంటీర్లు ఇంట్లో, వైసీపీ నాయకుల ఇంట్లో అక్రమంగా పింఛన్లు పొందుతున్నవారు ఉన్నారు. వైకల్యం లేకపోయినా.. నకిలీ సదరం సర్టిఫికెట్లతో పింఛన తీసుకున్నాం..’ అని శింగనమల మండలం చిన్న జలాలపురం గ్రామానికి చెందిన వైసీపీ రాష్ట్ర మహిళ విభాగం కార్యదర్శి బండి లలితమ్మ స్వయంగా పేర్కొన్నారు. తమ పంచాయతీలోని ఓ టీడీపీ నాయకుడితో ఆమె ఫోనలో మాట్లాడిన సంభాషణలు.. వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలకు నిదర్శనం. ‘చిన్న జలాలపురంలో 30 నుంచి 40 మంది చెవిటి, మూగ కింద అక్రమంగా పింఛన్లు పొందుతున్నారు. వారికి ఎలాంటి వైకల్యం లేదు. వలంటీరు ధనుంజయ నకిలీ సర్టిఫికెట్లతో తమ కుటుంబాల్లోని పది మందికి పింఛన్లు ఇప్పించారు. వెరిఫికేషన చేసి.. అలాంటివి తొలగించండి..’ అని ఆమె టీడీపీ నాయకుడిని కోరడం గమనార్హం.

ఇంటింటా అక్రమార్కులు

చిన్న జలాలపురం వలంటీరు ధనుంజయ తల్లి అలివేలమ్మ (ఐడీ నంబర్‌ 11200156825), పెద్దమ్మ చౌడమ్మ (11200132644) జేన్నె ఆదినారాయణ (11290 427002) అక్రమంగా పింఛన్లు పొందుతున్నారు. వలంటీరు సింధు తల్లి కళావతి (11200161131), ఎద్దుల ఆదిలక్ష్మి (11200140119) వెంకటలక్ష్మి (112001 90030) నాగరత్మమ్మ (1120067006) బండి వెంకటరాముడు (11200084091) జెన్నే వెంకటలక్ష్మి (112001 90900) పింఛన్లు అందుకుంటున్నారు. అంగ వైకల్యం, చెవుడు, మూగ పేరిట వీరు నకిలీ సదరం సర్టిఫికెట్లు సమర్పించారని సమాచారం. గుంతకల్లు, కదిరి, అనంతపురం ప్రాంతాలకు చెందిన వైద్యుల నుంచి వీరు దొడ్డిదారిలో సదరం సర్టిఫికెట్లు పొందినట్లు తెలిసింది.


మరిన్ని అనంతపురం వార్తల కోసం..

Updated Date - Jul 21 , 2024 | 12:39 AM

Advertising
Advertising
<