SP JAGADEESH: పిల్లల అభివృద్ధిలో తల్లిదండ్రులదే కీలక పాత్ర
ABN, Publish Date - Nov 14 , 2024 | 11:47 PM
పిల్లల అభివృద్ధిలో తల్లిదండ్రులదే కీలక పాత్ర అని ఎస్పీ జగదీష్ దంపతులు అన్నారు. జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లోని పోలీస్ కాన్ఫరెన్స రక్షక్ ప్రీ ప్రైమరీ స్కూలు పిల్లల మధ్య ఘనంగా బాలల దినోత్సవం నిర్వహించారు.
అనంతపురం క్రైం, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): పిల్లల అభివృద్ధిలో తల్లిదండ్రులదే కీలక పాత్ర అని ఎస్పీ జగదీష్ దంపతులు అన్నారు. జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లోని పోలీస్ కాన్ఫరెన్స రక్షక్ ప్రీ ప్రైమరీ స్కూలు పిల్లల మధ్య ఘనంగా బాలల దినోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఎస్పీ దంపతులు హాజరై మాట్లాడారు. పిల్లల భవిష్యత్తు నిర్దేశంలో తల్లిదండ్రుల పాత్ర చాలా ఉందన్నారు. వచ్చే విద్యాసంవత్సరంలో పోలీసు పిల్లలు ఫస్ట్‌క్లాస్ చదువుకునేలా అనుమతుల కోసం దరఖాస్తు చేశామన్నారు. స్పానిష్ టీచర్ కోసం ఆర్డీటీ వారికి లేఖ రాశామని, పిల్లలకు చదువుతో పాటు ఆటలు, డ్యాన్స, ఇతర అభివృద్ధికి కృషి చేస్తామని పిలుపునిచ్చారు. అనంతరం పిల్లలకు బిస్కెట్స్, పెన్నులు తదితర సామగ్రిని అందజేశారు. పిల్లలు బృందంగా ఏర్పడి రోడ్డు ప్రమాదాల నియంత్రణ, రోడ్డు భద్రతా నియమాల పాటింపుపై చేసిన ప్రదర్శన ఆకట్టుకుంది. హెడ్ క్వార్టర్స్‌లో నిర్వహిస్తున్న రక్షక్ ప్రీ ప్రైమరీ స్కూలు పిల్లల కోసం సిద్ధం చేసిన గదిని ఎస్పీ సతీమణి హేమ ప్రారంభించారు. అదనపు ఎస్పీలు రమణమూర్తి, ఇలియాజ్‌బాషా, సీఐలు ధరణికిషోర్, క్రాంతికుమార్, దేవానంద్, ఆర్‌ఐలు రెడ్డప్పరెడ్డి, మధు పాల్గొన్నారు.
Updated Date - Nov 14 , 2024 | 11:47 PM