ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Central budget: అభివృద్ధి, సంక్షేమం, ఉపాధికి బాటలు

ABN, Publish Date - Jul 23 , 2024 | 11:38 PM

కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ కీలక భాగస్వామి కావడంతో కొత్త ప్రభుత్వం తొలి వార్షిక బడ్జెట్‌ ఉత్కంఠ రేపింది. సీఎం చంద్రబాబు ఏ మేరకు రాష్ట్ర ప్రయోజనాలకు నిధులు తెస్తారోనన్న ఆసక్తి సర్వత్రా కనిపించింది. జనం పెట్టుకున్న ఆశలకు ఏమాత్రం తీసిపోకుండా.. ఆయన నిధులను సాధించారన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమౌతోంది. కరువు జిల్లా అభివృద్ధి, సంక్షేమం, ఉపాధికి బాటలు వేసేలా కేంద్ర బడ్జెట్‌లో నిధులు కేటాయించారని అన్ని వర్గాలు అంటున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా ...

వెనుకబడిన జిల్లాకు ప్రత్యేక నిధులు

పారిశ్రామిక కారిడార్‌తో కొత్త పరిశ్రమలు

యువతకు పెరగనున్న ఉద్యోగ, ఉపాధి అవకాశాలు

ప్రధాన మంత్రి అన్నయోజన పొడిగింపు.. రైతులకు మేలు

కేంద్ర బడ్జెట్‌పై అన్ని వర్గాల హర్షం

అనంతపురం, జూలై 23(ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ కీలక భాగస్వామి కావడంతో కొత్త ప్రభుత్వం తొలి వార్షిక బడ్జెట్‌ ఉత్కంఠ రేపింది. సీఎం చంద్రబాబు ఏ మేరకు రాష్ట్ర ప్రయోజనాలకు నిధులు తెస్తారోనన్న ఆసక్తి సర్వత్రా కనిపించింది. జనం పెట్టుకున్న ఆశలకు ఏమాత్రం తీసిపోకుండా.. ఆయన నిధులను సాధించారన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమౌతోంది. కరువు జిల్లా అభివృద్ధి, సంక్షేమం, ఉపాధికి బాటలు వేసేలా కేంద్ర బడ్జెట్‌లో నిధులు కేటాయించారని అన్ని వర్గాలు అంటున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన పార్లమెంటులో మంగళవారం బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. అందులో రాష్ర్టానికే కాకుండా జిల్లా అభివృద్ధికి ఊతమిచ్చేలా నిధులు కేటాయించారు. విభజన హామీల మేరకు వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక నిధులు ఇస్తామని ప్రకటించారు. ప్రధానమంత్రి అన్న యోజన పథకాన్ని మరో ఐదేళ్లు పొడిగించారు. తద్వారా వ్యవసాయ, అనుబంధ రంగాలకు మరింత ప్రయోజనం చేకూరనుంది. పంట దిగుబడులకు మద్దతు ధర లభించనుంది. నూనె గింజలు, పప్పు ధాన్యాల ఉత్పత్తి పెంచేందుకు కృషి చేస్తామని చెప్పడం రైతులకు కలిసొచ్చే అంశం. యువతకు ఉద్యోగాల కల్పన, విద్య, ఉపాధి నైపుణ్యానికి బడ్జెట్‌లో పెద్ద పీట


వేశారు. వేతన జీవులకు కొత్త పన్ను విధానం స్వల్ప ఊరటనిచ్చింది. ఉన్నత విద్యకు గతంలో రూ.10 లక్షల రుణం మంజూరు చేసేవారు. ఈ బడ్జెట్‌లో రూ.20 లక్షలకు రుణం పెంచారు. హైదరాబాదు-బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌గా ఏర్పాటు కరువు జిల్లాకు కలిసొచ్చే అంశం. జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటవుతాయి. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. బడ్జెట్‌పై వివిధ పార్టీల నాయకులు సానుకూలంగా స్పందించారు. ఇది మెరుగైన బడ్జెట్‌ అని, జిల్లా అభివృద్ధికి ఉపయుక్తమని అన్నారు. అయితే, నిధులపై స్పష్టత కొరవడిందని వామపక్షాలు అన్నాయి.

అభివృద్ధికి చేయూత..

ేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రంతో పాటు జిల్లా అభివృద్ధికి ఆర్థిక చేయూత లభించింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చొరవతో రాజధాని నిర్మాణం ఇక నుంచి పరుగులు పెట్టనుంది. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు బడ్జెట్‌లో స్పష్టమైన హామీ లభించింది. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి బుందేల్‌ఖండ్‌ తరహా ప్యాకేజీ నిధులు మంజూరు చేస్తామని బడ్జెట్‌లో స్పష్టమైన హామీ ఇచ్చారు. కరువు జిల్లా అనంత అభివృద్ధికి ఆ నిధులు దోహదపడతాయి. పారిశ్రామిక కారిడార్‌తో కరువు జిల్లాకు పరిశ్రమలు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. పరిశ్రమల ఏర్పాటుతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. తొలి బడ్జెట్‌లోనే రాష్ట్రంతో పాటు వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి కేంద్రం పెద్దపీట వేసినందుకుగానూ ప్రజల పక్షాన ప్రధాని మోదీకి, ఆ మేరకు చొరవ చూపిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు.

- అంబికా లక్ష్మీనారాయణ, ఎంపీ

చంద్రబాబు కృషితో మంచి రోజులు

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కృషితో ఏపీకి మంచి రోజులు వస్తున్నాయి. కేంద్ర బడ్జెట్‌లో కేటాయింపులే ఇందుకు నిదర్శనం. గత ప్రభుత్వం రాష్ర్టానికి రాజధాని లేకుండా చేసింది. చంద్రబాబు సీఎం అయిన తర్వాత అమరావతి నిర్మాణానికి రూ.15 వేల కోట్లు ఇస్తామని కేంద్రం చెప్పడం హర్షణీయం. పోలవరం ప్రాజెక్టును 200 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో నిర్మించేందుకు పూర్తి ఖర్చు కేంద్రం భరిస్తుందని బడ్జెట్‌లో చెప్పారు. ఇది పూర్తైతే రాయలసీమకు నీటి కష్టాలు తీరే అవకాశం ఉంది. ఇండసి్ట్రయల్‌ కారిడార్‌ ద్వారా వేల కోట్ల పెట్టుబడులు వస్తాయి. ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. వెనుకబడిన ప్రాంతాలకు నిధుల కేటాయింపుతో కరువు జిల్లా అనంతకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది. ఒక మంచి నాయకుడు సీఎం అయితే రాషా్ట్రనికి ఇలా మంచి జరుగుతుంది.

- పరిటాల సునీత, రాప్తాడు ఎమ్మెల్యే

అభివృద్ధి పరుగులు..

ఏపీలో పారిశ్రామిక అభివృద్ధి పరుగులు పెట్టడం ఖాయం. కేంద్ర బడ్జెట్‌లో ఈ సారి రాష్ర్టానికి న్యాయం జరిగింది. విజన కలిగిన సీఎం చంద్రబాబునాయుడు కృషితోనే రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందనుంది. రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టుకు నిధులు ప్రకటించడం హర్షణీయం. రాయలసీమ, ప్రకాశం, కోస్తాలో వెనుకబడిన జిల్లాలకు ఆర్థిక సాయం చేస్తామని చెప్పడంతో ఉమ్మడి జిల్లాకు మేలు చేకూరనుంది. సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచే రాష్ర్టానికి మంచి రోజులు వచ్చాయి.

- వెంకటశివుడు యాదవ్‌, టీడీపీ జిల్లా అధ్యక్షుడు

తొలిసారి న్యాయం..

రాష్ట్ర విభజన తర్వాత కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి తొలిసారిగా న్యాయం జరిగింది. అమరావతికి రూ.15 వేల కోట్లు ఇవ్వడం ద్వారా కలల రాజధాని నిర్మాణానికి వేగంగా అడుగులు పడతాయి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై కేంద్రంగా స్పష్టంగా హామీ ఇచ్చింది. వీలైనంత త్వరగా నిధులు కేటాయిస్తే ప్రజలు సంతోషిస్తారు. రాయలసీమకు ఈ సారి న్యాయం చేశారు. ఆగిపోయిన వెనుకబడిన ప్రాంతాల నిధులు ఇస్తామని చెప్పడంతో ప్రజలు సంతోషిస్తున్నారు. పారిశ్రామిక మౌళిక సదుపాయాల కల్పనకు నిధులు ఇవ్వడం ద్వారా పారిశ్రామికాభివృద్ధి పరుగులు పెట్టే అవకాశం ఉంది.

- దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్‌, అనంతపురం అర్బన ఎమ్మెల్యే

నిధులపై స్పష్టత ఇచ్చుంటే బాగుండేది...

కేంద్ర బడ్జెట్‌లో నిధుల కేటాయింపులపై స్పష్టత ఇచ్చుంటే బాగుండేది. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి సంబంధించి బుందేల్‌ఖండ్‌ తరహా ప్యాకేజీ విషయంలో బడ్జెట్‌లో మాటలు చెప్పారు. కానీ ఎప్పటి నుంచి నిధులు మంజూరు చేస్తారు..? జిల్లాకు రూ.50 కోట్లు ఇస్తారా..? ఇంకా ఎక్కువ ఇస్తారా..? అనే విషయంలో స్పష్టత లేదు. విభజన హామీల అమలు ఊసెత్తకపోవడం బాధాకరం. హైదరాబాదు నుంచి బెంగళూరు దాకా పారిశ్రామిక కారిడార్‌ అభివృద్ధి చేస్తామని చెప్పారేగాని... ఎక్కడ పరిశ్రమలు పెడుతున్నారు..? ఏ ఏ పరిశ్రమలు తీసుకురానున్నారో బడ్జెట్‌లో స్పష్టంగా చెప్పలేదు. రాజధాని నిర్మాణ విషయంలోనూ నిధుల కేటాయింపులో కప్పదాట్లే ప్రదర్శించింది. కేంద్ర ప్రభుత్వం నేరుగా గ్రాంటు రూపంలో రాజధాని నిర్మాణానికి నిధులివ్వకుండా బహుళసంస్థల ద్వారా అప్పు ఇప్పిస్తామని చెప్పినట్లుగా ఉండటం విచారకరం. తద్వారా రాష్ర్టానికి అప్పు ఇప్పిస్తున్నామని కేంద్రం చెప్పకనే చెబుతోంది. నిధులు రాబట్టుకునేందుకు కూటమి ప్రభుత్వం మరింత చొరవ చూపాల్సిన అవసరం ఉంది.

- జాఫర్‌, సీపీఐ జిల్లా కార్యదర్శి

రాషా్ట్రనికి పెద్దపీట...

ఎనడీఏ ప్రభుత్వం ఏర్పడితే ఏపీని అభివృద్ధి బాటలో నడిపిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. ఆ మేరకు బడ్జెట్‌లో పెద్దపీట వేశారు. వ్యవసాయం, ఉద్యోగ కల్పన, నైపుణ్యాల పెంపు, పట్టణాభివృద్ధి.. ఇలా అన్ని రంగాలకు నిధులు కేటాయించారు. వైసీపీ ప్రభుత్వం కేంద్రాన్ని ప్రజల్లో దోషిగా చూపేందుకు నిధులను దుర్వినియోగం చేసింది.

- సందిరెడ్డి శ్రీనివాసులు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు

చేతల్లో చూపింటే బాగుండేది..

వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి బుందేల్‌ఖండ్‌ తరహాలో ప్యాకేజీ ఇస్తామని రాష్ట్ర విభజన సందర్భంలో కేంద్రం చెప్పింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఆ మేరకు నిధులు కేటాయించకుండా.. కేవలం మాటలు చెప్పారు. అలా కాకుండా చేతల్లో చూపించి ఉంటే బాగుండేది. అలా చేయకపోవడంతో కరువు జిల్లా అనంత ప్రజానీకం నిరాశకు లోనయ్యారు. రాజధాని అమరావతి నిర్మాణానికి బహుళ సంస్థల ద్వారా కాకుండా నేరుగా ప్రభుత్వమే గ్రాంటు రూపంలో రూ.15 వేల కోట్లు కేటాయించాల్సింది. ఆ విధంగా చేయకపోవడం రాషా్ట్రన్ని అప్పుల్లోకి నెట్టడమే. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కేంద్రానికి అవగాహన ఉన్నా.. బడ్జెట్‌లో నిధులు కేటాయించకపోవడం అన్యాయం. విభజన హామీల అమలుకు కట్టుబడి ఉంటామని చెప్పారే తప్ప.. వాటికి నిధుల ప్రస్తావన లేదు. బడ్జెట్‌లో ఆశించిన స్థాయిలో నిధులు కేటాయించని నేపథ్యంలో... రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని మరిన్ని నిధుల కోసం కూటమి ప్రభుత్వం ఒత్తిడి చేయాల్సిన అవసరం ఉంది.

- రాంభూపాల్‌, సీపీఎం జిల్లా కార్యదర్శి

విద్యార్థులకు మంచి రోజులు..

కేంద్ర బడ్జెట్‌లో విద్యారంగానికి పెద్దపీట వేశారు. విద్యార్థులకు మంచిరోజులు వచ్చాయి. విద్యార్థుల నైపుణ్య శిక్షణకు రూ.2 వేల కోట్లు ఖర్చు చేయనున్నారు. పారిశ్రామికరంగ విస్తరణకు బాటలు వేశారు. ఈ అంశాలు యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంచుతాయి.

- ప్రొఫెసర్‌ సుదర్శనరావు, జేఎనటీయూ ఇనచార్జ్‌ వీసీ

అంకుర పరిశ్రమలకు తోడ్పాటు..

అంకుర పరిశ్రమలకు (స్టార్టప్‌) బడ్జెట్‌తో తోడ్పాటు కల్పించారు. పెట్టుబడికి పన్ను మినహాయించి.. స్టార్టప్‌లను ప్రోత్సహించారు. పారిశ్రామిక కారిడార్‌లను అనుసంధానం చేస్తూ.. మౌళిక వసతుల కల్పనకు నిధులు కేటాయించి బడ్జెట్‌కు వన్నె తీసుకువచ్చారు. ఈ బడ్జెట్‌ను పరిశ్రమలు అభివృద్ధికి సూచికగా భావించవచ్చు.

- ప్రొఫెసర్‌ నాగభూషణరాజు, ఎస్కేయూ


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Jul 23 , 2024 | 11:38 PM

Advertising
Advertising
<