SUPERINTENDENT: జ్వర పీడితుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపండి
ABN, Publish Date - Sep 06 , 2024 | 12:03 AM
చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చిన జ్వర పీడితుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపి వైద్యసేవలు అందించాలని డాక్టర్లకు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్‌వెంకటేశ్వరరావు సూచించారు.
అనంతపురం టౌన, సెప్టెంబరు 5: చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చిన జ్వర పీడితుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపి వైద్యసేవలు అందించాలని డాక్టర్లకు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్‌వెంకటేశ్వరరావు సూచించారు. గురువారం చాంబర్‌లో ఆర్‌ఎంఓలు, ఎమర్జెన్సీ విభాగం హెచఓడీ, డాక్టర్లతో సూపరింటెండెంట్ సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం జిల్లా ఆస్పత్రిలో ఎంతమంది జ్వరబాధితులు అడ్మిషనలో ఉన్నారు, వారి ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. ఆర్‌ఎంఓ డాక్టర్ పద్మజ, ఎమర్జెన్సీ విభాగం హెచఓడీ డాక్టర్ శ్రీనివాసులు స్పందిస్తూ ఆస్పత్రిలో ప్రస్తుతం 80 మంది జ్వరబాధితులు చికిత్సపొందుతున్నారని ఇందులో 44 మంది చిన్నపిల్లల వార్డులో ఉండగా మిగిలినవారు పెద్దల వార్డులో ఉన్నారని వివరించారు. వీరిలోకూడా 5 డెంగీ కేసులు ఉన్నట్లు తెలిపారు. దీనిపై సూపరింటెండెంట్ మాట్లాడుతూ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వైరల్ ఫీవర్స్ కేసులు మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వం ఈ వ్యాధుల నియంత్రణ విషయంలో సీరియ్‌సగా ఉందన్నారు. ఆస్పత్రిలో అవసరమైన మందులు ఉన్నాయని, అలాంటపుడు జ్వర బాధితుల విషయంలో ఎక్కడా నిర్లక్ష్యం వహించకుండా వైద్యం అందించాలన్నారు.
Updated Date - Sep 06 , 2024 | 12:03 AM