PINCHAN : ఒకటో తేదీన ఇంటివద్దకే పింఛన
ABN, Publish Date - Jun 28 , 2024 | 11:35 PM
జిల్లావ్యాప్తంగా 12 వేల క్లస్టర్లలో పింఛన పంపిణీ మ్యాపింగ్ పూర్తి చేశామని, ఒకటో తేదీన ఇంటి వద్దనే లబ్ధిదారులకు సొమ్ము అందజేసేలా చర్యలు తీసుకుంటున్నామని డీఆర్‌డీఏ-వైకేపీ పీడీ ఈశ్వరయ్య తెలిపారు. తన చాంబర్‌లో ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు పింఛన పెంచారని, పెంచిన పింఛనతో పాటు మూడు నెలల (ఏప్రిల్, మే, జూన) బాకియి మొత్తాన్ని ఒకటో తేదీన ఇంటివద్దనే అందజేస్తామని తెలిపారు. జూలై నెలకు 2,89,508 మంది లబ్ధిదారులకు రూ.197.44 కోట్లు మొత్తాన్ని జిల్లాకు ...
లబ్ధిదారుల మ్యాపింగ్ పూర్తి
డీఆర్‌డీఏ-వైకేపీ పీడీ ఈశ్వరయ్య
అనంతపురం క్లాక్‌టవర్, జూన 28: జిల్లావ్యాప్తంగా 12 వేల క్లస్టర్లలో పింఛన పంపిణీ మ్యాపింగ్ పూర్తి చేశామని, ఒకటో తేదీన ఇంటి వద్దనే లబ్ధిదారులకు సొమ్ము అందజేసేలా చర్యలు తీసుకుంటున్నామని డీఆర్‌డీఏ-వైకేపీ పీడీ ఈశ్వరయ్య తెలిపారు. తన చాంబర్‌లో ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు పింఛన పెంచారని, పెంచిన పింఛనతో పాటు మూడు నెలల (ఏప్రిల్, మే, జూన) బాకియి మొత్తాన్ని ఒకటో తేదీన ఇంటివద్దనే అందజేస్తామని తెలిపారు. జూలై నెలకు 2,89,508 మంది లబ్ధిదారులకు రూ.197.44 కోట్లు మొత్తాన్ని జిల్లాకు విడుదల చేశారని అన్నారు. ఇందులో మూడు నెలల పెంచిన మొత్తం రూ.70.62 కోట్లు, జూలై నెలకు సంబంధించి రూ.126.81 కోట్లు ఉన్నాయని తెలిపారు. పదకొండరు కేటగిరీలకు సంబంధించి 2,35,514 మందికి పింఛను రూ.3 వేల నుంచి రూ.4 వేలకు, రెండు కేటగిరీల్లోని 46,742 మందికి రూ.3 వేల నుంచి రూ.6 వేలకు,
ఇంకో రెండు కేటగిరిల్లోని 2,535 మందికి రూ.5 వేల నుంచి రూ.15 వేలకు, ఐదు కేటగిరీల్లోని 859 మందికి రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచారని ఆయన వివరించారు. ఇప్పటికే చేసిన మ్యాపింగ్ ప్రకారం గ్రామ-వార్డు సచివాలయాల ఉద్యోగుల ద్వారా ఇంటి వద్దకే పింఛన అందజేస్తామని, ఏ ఒక్క లబ్ధిదారుడు సచివాలయాలు, బ్యాంకులు, ఇతర కార్యాలయాల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదని అన్నారు. ప్రతి 50 మంది పింఛనదారులకు ఒక ఉద్యోగి పింఛన అందజేసేలా ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. ఇప్పటికే మండల సమాఖ్యల సమావేశాలు నిర్వహించి, పింఛన పంపిణీపై అవగాహన కల్పించామని అన్నారు.
మరిన్ని ఆనంతపురం వార్తల కోసం...
Updated Date - Jun 28 , 2024 | 11:35 PM