Mla Amilineni డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం
ABN, Publish Date - Nov 09 , 2024 | 12:54 AM
పట్టణంలో 25 ఏళ్లుగా డ్రైనేజీ సమస్య నెలకొని ఉందని, మురుగుకాల్వలు సరిగా లేకపోవడం వల్ల ఇళ్ల నుంచి వచ్చే మురుగునీరు, వర్షాల సమయంలో వరదనీరు రోడ్లపై పారుతూ తీవ్ర అపరిశుభ్రత నెలకొని ఉండేదని, దీంతో ప్రజలు ఇబ్బంది పడుతుండేవారని, ఇప్పుడు ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం చేయనున్నామని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పేర్కొన్నారు.
-ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు
-అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనుల పరిశీలన
కళ్యాణదుర్గం, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి) : పట్టణంలో 25 ఏళ్లుగా డ్రైనేజీ సమస్య నెలకొని ఉందని, మురుగుకాల్వలు సరిగా లేకపోవడం వల్ల ఇళ్ల నుంచి వచ్చే మురుగునీరు, వర్షాల సమయంలో వరదనీరు రోడ్లపై పారుతూ తీవ్ర అపరిశుభ్రత నెలకొని ఉండేదని, దీంతో ప్రజలు ఇబ్బంది పడుతుండేవారని, ఇప్పుడు ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం చేయనున్నామని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పేర్కొన్నారు.
స్థానిక పాతబస్టాండ్ వద్ద జరుగుతున్న అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులను ఎమ్మెల్యే శుక్రవారం మున్సిపాలిటీ, ఆర్‌అండ్‌బీ శా ఖల అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పనులు నాణ్యతగా చేయాలని అధికారులను ఆదేశించారు. నిర్మాణాన్ని కూడా త్వరగా పూర్తి చేసి అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ ద్వారా మురుగునీరు, వరద నీరు వెళ్లేలా చేయాలని సూచించారు. కొన్నేళ్ల నుంచి పట్టి పీడిస్తున్న డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతున్నట్లు పేర్కొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం..
Updated Date - Nov 09 , 2024 | 12:54 AM