POLICE: మీ సేవలను పోలీసు శాఖ మరువదు
ABN, Publish Date - Jun 11 , 2024 | 11:15 PM
సుదీర్ఘంగా పనిచేసి ప్రజలకు మీరందించిన సేవలు పోలీస్ శాఖ ఎన్నటికీ మరువదని జిల్లా ఎస్పీ గౌతమిశాలి అన్నారు. జిల్లాలో ఇటీవల 9 మంది పదవీ విరమణ పొందారు. మంగళవారం వారిలో ఏడుగురికి జిల్లా ఎస్పీ చేతులమీదుగా స్థానిక పోలీసు కాన్ఫరెన్స హాలులో సన్మానం చేశారు. పదవీ విరమణ పొందిన ఎస్‌ఐ వెంకటాచలపతి, ఏఎ్‌సఐలు నాగరాజు, సయ్యద్ ఇబ్రహీం, జనార్దన, ఏఆర్‌ఎ్‌సఐ ఖాదర్‌బాషా, శంకర్‌నాయక్, హెడ్‌కానిస్టేబుల్ గౌస్ పీరా దంపతులను ఎస్పీ పూలమాలలు, శాలువాలతో సత్కరించారు.
అనంతపురం క్రైం, జూన 11: సుదీర్ఘంగా పనిచేసి ప్రజలకు మీరందించిన సేవలు పోలీస్ శాఖ ఎన్నటికీ మరువదని జిల్లా ఎస్పీ గౌతమిశాలి అన్నారు. జిల్లాలో ఇటీవల 9 మంది పదవీ విరమణ పొందారు. మంగళవారం వారిలో ఏడుగురికి జిల్లా ఎస్పీ చేతులమీదుగా స్థానిక పోలీసు కాన్ఫరెన్స హాలులో సన్మానం చేశారు. పదవీ విరమణ పొందిన ఎస్‌ఐ వెంకటాచలపతి, ఏఎ్‌సఐలు నాగరాజు, సయ్యద్ ఇబ్రహీం, జనార్దన, ఏఆర్‌ఎ్‌సఐ ఖాదర్‌బాషా, శంకర్‌నాయక్, హెడ్‌కానిస్టేబుల్ గౌస్ పీరా దంపతులను ఎస్పీ పూలమాలలు, శాలువాలతో సత్కరించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ... పదవీ విరమణ అనేది అందరికీ తప్పదని, ఎలాంటి రిమార్క్స్ లేకుండా నాలుగు దశాబ్దాలు పనిచేయడం విశేషమన్నారు. శేష జీవితం సుఖసంతోషాలతో గడపాలని, ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అదనపు ఎస్పీ విజయభాస్కర్‌రెడ్డి, ఏఆర్ డీఎస్పీ మునిరాజ, ఆర్‌ఐలు రెడ్డప్పరెడ్డి, మధు, ఆర్‌ఎ్‌సఐ వెంకటేశ్వర్లు, జిల్లా పోలీసు అధికారుల సంఘం అడహక్ కమిటీ సభ్యులు త్రిలోక్‌నాథ్, జాఫర్, హరినాథ్, శ్రీనివాసులునాయుడు, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
సిబ్బంది సంక్షేమానికి సమష్టి కృషి
పోలీస్ సిబ్బంది సంక్షేమం కోసం సమష్టిగా కృషి చేద్దామని ఎస్పీ గౌతమిశాలి అన్నారు. స్థానిక పోలీసు కాన్ఫరెన్స హాలులో ఎస్పీ పోలీస్ అధికారులతో వెల్ఫేర్ కమిటీ మీటింగ్ నిర్వహించారు. ప్రస్తుతం జిల్లాలో పోలీస్ సిబ్బంది, వారి కుటుంబసభ్యుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న కార్యక్రమాల నిర్వహణపై సమీక్ష చేశారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న వివిధ సంక్షేమ కార్యక్రమాలను ఎస్పీ పరిశీలించారు. ఏఎస్పీ విజయభాస్కర్‌రెడ్డి, ఏఆర్ డీఎస్పీ మునిరాజు, ఆర్‌ఐలు రెడ్డప్పరెడ్డి, మధు, జిల్లా పోలీస్ కార్యాలయ పరిపాలనాధికారి శంకర్, సూపరింటెండెంట్ ప్రసాద్, ఎస్పీ సీసీ ఆంజనేయప్రసాద్, ఆర్‌ఎ్‌సఐ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
Updated Date - Jun 11 , 2024 | 11:15 PM