MLA KANDIKUNTA: రాజకీయమంటే భూ ఆక్రమణలు కాదు
ABN, Publish Date - Dec 15 , 2024 | 12:29 AM
ప్రజలు అధికారమితిచ్చింది రాజకీయాలను అడ్డుపెట్టుకుని ప్రభుత్వ భూములను కబ్జా చేయడానికో, కొట్టేయడానికో కాదని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ అన్నారు. శనివారం ఆయన నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అక్రమ లేఅవుట్లను రెగ్యులరైజ్ చేయడానికి విధి విధానాలు తెలియచేడానికి ఆదివారం సమావేశం నిర్వహించాల్సి ఉందన్నారు.
కదిరి, డిసెంబరు14 (ఆంధ్రజ్యోతి): ప్రజలు అధికారమితిచ్చింది రాజకీయాలను అడ్డుపెట్టుకుని ప్రభుత్వ భూములను కబ్జా చేయడానికో, కొట్టేయడానికో కాదని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ అన్నారు. శనివారం ఆయన నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అక్రమ లేఅవుట్లను రెగ్యులరైజ్ చేయడానికి విధి విధానాలు తెలియచేడానికి ఆదివారం సమావేశం నిర్వహించాల్సి ఉందన్నారు. మున్సిపల్ కమిషనర్ కిరణ్‌కుమార్ సెలవులో ఉండడంతో ఆయన వచ్చిన తరువాత సమావేశం నిర్వహిస్తామన్నారు. అందులోనే రియల్టర్లకు, కొనుగోలుదారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా విధానాలు రూపొందించి తెలియచేస్తామన్నారు. ప్రభుత్వ, నిషేధిత భూములపై వచ్చిన ఎనఓసీలను విచారిస్తామన్నారు. ప్రభుత్వ భూముల జోలికి ఏపార్టీ వారొచ్చినా ఉపేక్షించేది లేదన్నారు. ఊరు బాగుకోసమే ఈచర్యలు చేస్తున్నాం తప్ప, ప్రజలను ఇబ్బంది పెట్టడానికి కాదన్నారు. డాక్యూమెంటు రైటర్లు ఉన్నవి లేనట్లుగా ప్రచారం చేస్తే సహించమన్నారు. సబ్ రిజిసా్ట్రర్ కార్యాలయంలో ప్రైవేటు వ్యక్తుల దందా ఎక్కువగా ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని, వాటిపై చర్యలు తీసుకుంటామన్నారు. మున్సిపాలిటీలో కూడా అవినీతి జరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు.
Updated Date - Dec 15 , 2024 | 12:29 AM