POLL : రాత్రి వరకు కొనసాగిన పోలింగ్
ABN, Publish Date - May 14 , 2024 | 01:23 AM
పెనుకొండ నియోజకవర్గంలో సాయంత్రం 6గంటలకు 78.77శాతం ఓట్లు పోలైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా 23,5986మంది ఓటర్లు ఉండగా ఇందులో 117952 పురుషులు, 118030మహిళలు, నలుగురు ఇతరులు ఉన్నారు. సమయం 9గంటలు కావస్తున్నా ఓటర్లు బారులు తీరడంతో పోలింగ్‌శాతాన్ని ఎన్నికల అధికారులు ఇవ్వలేకపోయారు. డీఎస్పీ బాబాజానసైద ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పర్యవేక్షించారు.
పెనుకొండలో సాయంత్రం 6కు 78.77శాతం పోలింగ్
పెనుకొండ టౌన, మే 13 : పెనుకొండ నియోజకవర్గంలో సాయంత్రం 6గంటలకు 78.77శాతం ఓట్లు పోలైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా 23,5986మంది ఓటర్లు ఉండగా ఇందులో 117952 పురుషులు, 118030మహిళలు, నలుగురు ఇతరులు ఉన్నారు. సమయం 9గంటలు కావస్తున్నా ఓటర్లు బారులు తీరడంతో పోలింగ్‌శాతాన్ని ఎన్నికల అధికారులు ఇవ్వలేకపోయారు. డీఎస్పీ బాబాజానసైద ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పర్యవేక్షించారు. సోమందేపల్లి మండలం బ్రాహ్మణపల్లిలో ఉన్నపళంగా భారీ వర్షం రావడంతో షామియానా కింద ఉన్న ఓటర్లు తడిసి ముద్దయ్యారు. కొందరు ఓటర్లు మరోచోటికి పరుగులు తీశారు.
పెనుకొండ రూరల్ : సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి మండలంలో వెంకటరెడ్డిపల్లి 171, 172 పోలింగ్ కేంద్రాలు, మరువపల్లి పోలింగ్ కేంద్రాలు రాత్రి 9వరకు పోలింగ్ జరిగింది. వెంకటరెడ్డిపల్లిలో 171, 172కేంద్రాల్లో ఉదయం 7గంటలకు ప్రారంభం కావాల్సిన ఓటింగ్ ప్రక్రియ 8.30కు ప్రారంభ మైంది. దీంతో సాయంత్రం 6గంటలు దాటినా రోడ్డువరకు ఓటర్లు క్యూలో నిలబడ్డారు. ఎన్నికల అధికారులు క్యూలో ఉన్న వారికిఓటరు స్లిప్పులు పంపిణీ చేసి రాత్రి 9గంటలైనా ఓటింగ్ ప్రక్రియ చేపడతామన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు మహిళలు, వృద్ధులు, యువత బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
అగళి : మండలంలోని పలు కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించ డంతో రాత్రి వరకు ఓటింగ్ రాత్రి వరకు కొనసాగింది. దాసేగౌడనహళ్లిలో మూడుసార్లు ఈవీఎంలు మోరాయించాయని ఓటర్లు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు మరమ్మతులు చేయించి ఓటింగ్‌ను కొనసాగించారు. అదేవిధంగా హెచడిహళ్లి, ఆర్‌జీపల్లి, కోడిపల్లి, అగళి, నరసాంబుది తదితర గ్రామాల్లో రాత్రైనా ఓటింగ్ కొనసాగుతూనే ఉంది. ఓటువేసేందుకు ప్రజలు బారులు తీరారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - May 14 , 2024 | 01:23 AM