VEGITABLES: కొండెక్కిన కూరగాయల ధరలు
ABN, Publish Date - Jun 10 , 2024 | 11:43 PM
ఆహారం రుచిగా ఉండాలంటే అందులో మంచికూరలు ఉండాల్సిందే. మనిషికి ప్రతినిత్యం కూరగాయలు తప్పనిసరి. కోటీశ్వరులైనా కూలోడైనా ఇంత ముద్ద దిగాలంటే కూరలు అవసరం. ఇటీవల కాలంలో కూరగాయల ధరలు అమాంతం పెరిగిపోయాయి.
రూ.500 తీసుకెళ్లినా.. సంచినిండా రావడం లేదు
మధ్య తరగతి ప్రజలు కొనలేని పరిస్థితి
పుట్టపర్తి, జూన 10: ఆహారం రుచిగా ఉండాలంటే అందులో మంచికూరలు ఉండాల్సిందే. మనిషికి ప్రతినిత్యం కూరగాయలు తప్పనిసరి. కోటీశ్వరులైనా కూలోడైనా ఇంత ముద్ద దిగాలంటే కూరలు అవసరం. ఇటీవల కాలంలో కూరగాయల ధరలు అమాంతం పెరిగిపోయాయి. ధరలు పెరిగిపోవడంతో సామాన్యులకు భారంగా మారింది. వీటిని కొనలేం తినలేం అన్న పరిస్థితి నెలకొంది. పంటల దిగుబడి తక్కువగా ఉండటం, సుదూరప్రాంతాలనుంచి రవాణాగా తీసుకరావడం అందుకు ఖర్చులతో మరీ ధరలు పెరిగిపోయాయి. వారానికి సరిపడ కూరగాయలు కోసం వందలకు వందలు ఖర్ఛుపెట్టాల్సి వస్తోంది.
కొనలేం... తినలేం..
దిగువ మధ్యతరగతికి చెందిన మాలాంటి వారికి కూరగాయలు కొనడం భారంగా మారింది. రూ. 200 తీసుకెల్తే సంచినిండా కూరగాయలు వచ్చేవి. ఇప్పుడు ప్రతీది 50 నుంచి 100 రూపాయలకుపైగా పెరగడంతో కొని తినలేకపోతున్నాం.
- చిన్నాగమ్మ కొత్తచెరువు
ఐదు వందలైనా కూరగాయలు రావడంలే
వారం వారం కూరగాయలకు ఐద వందలు తీసుకెళ్లినా సంచిలోకి సరిపడా రావడంలేదు. నెల రోజులకుపైగా కూరగాయల ధరలు పెరిగిపోయాయి. సంపాదనలో ఎక్కువ భాగం కూరగాయలకే పెట్టాల్సి వస్తోంది. ఎప్పుడు ధరలు తగ్గుతాయో? - చిట్టెమ్మ గోకులం పుట్టపర్తి
రైతు బజార్ల ద్వారా కూరగాయలు ఇవ్వాలి
కూరగాయలు అందుబాటులో తీసుకరావడానికి రైతుబజార్లను ఏర్పాటు చేయాలి. జిల్లాకేంద్రంతో పాటు మున్సిపాలిటీల్లో రైతుబజార్లు ఏర్పాటుచేసి కూరగాయలను సరసమైన ధరలకు అందించాలి. టీడీపీ ప్రభుత్వంలో రైతుబజార్లలో కూరగాయలు చౌకగా దొరికేవి. కొత్తప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకోవాలి.
- షంషాద్ ముదిగుబ్బ
Updated Date - Jun 10 , 2024 | 11:43 PM