irrigation societies సాగునీటి సంఘాల ఎన్నికలకు చర్యలు
ABN, Publish Date - Nov 05 , 2024 | 12:40 AM
మండలంలోని మూడు చెరువుల సాగునీటి సంఘాలకు సంబంధించి ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకుంటున్నట్లు తహసీల్దారు షర్మిల సోమవారం తెలిపారు.
బెళుగుప్ప, నవంబరు 4(ఆంధ్రజ్యోతి): మండలంలోని మూడు చెరువుల సాగునీటి సంఘాలకు సంబంధించి ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకుంటున్నట్లు తహసీల్దారు షర్మిల సోమవారం తెలిపారు.
ఆమె ఇరిగేషన శాఖ ఎన్నికల అధికారి సుధాకర్‌తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మండలంలో శ్రీరంగాపురం, గంగవరం, శీర్పి చెరువుల ఆయకట్టుదారుల సంఘాల ఎన్నికలు జరుగతాయన్నారు. ఇరిగేషన ఎన్నికల అధికారి మాట్లాడుతూ ఈ నెల 10వ తేదీ ఆయకట్టుదారుల ఓటర్ల జాబితా గ్రామ సచివాలయాల్లో ఉంచుతామని, 12వ తేదీలోపు ఏవైనా అభ్యంతరాలు ఉంటే తెలుపుకోవచ్చని సూచించారు. 13వ తేదీ తుది జాబితా ప్రకటిస్తామన్నారు. ప్రభుత్వం ఈ నెల 21 నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభిస్తుందని పేర్కొన్నారు.
ANDHRA PRADESH, latest news
andhrapradesh latest news, ananthapuramu
Updated Date - Nov 05 , 2024 | 12:40 AM