Ram Bhupal : వేరుశనగ విత్తనాన్ని 90 శాతం సబ్సిడీతో ఇవ్వండి
ABN, Publish Date - May 23 , 2024 | 12:07 AM
ఖరీఫ్ సాగుకోసం రాష్ట్ర ప్రభుత్వం 90శాతం సబ్సిడీతో రైతులకు వేరుశనగ విత్తనాలు పంపిణీ చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు రాంభూపాల్ డిమాండ్ చేశారు. పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు నల్లప్ప అధ్యక్షతన బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఏడాది తీవ్రమైన వర్షాభావం కారణంగా జిల్లాలో 29 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రభుత్వం ప్రకటించిందని ...
సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు రాంభూపాల్
అనంతపురం కల్చరల్, మే 22: ఖరీఫ్ సాగుకోసం రాష్ట్ర ప్రభుత్వం 90శాతం సబ్సిడీతో రైతులకు వేరుశనగ విత్తనాలు పంపిణీ చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు రాంభూపాల్ డిమాండ్ చేశారు. పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు నల్లప్ప అధ్యక్షతన బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఏడాది తీవ్రమైన వర్షాభావం కారణంగా జిల్లాలో 29 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రభుత్వం ప్రకటించిందని అన్నారు. ఈ పరిస్థితుల్లో రైతులకు పంట సాగు కష్టసాధ్యంగా మారిందని అన్నారు. కాబట్టి ప్రభుత్వం 90శాతం సబ్సిడీతో వేరుశనగ విత్తనాలు పంపిణీ చేయాలని
కోరారు. ఈ విషయంపై జిల్లా వ్యాప్తంగా అన్ని తహసీల్దారు కార్యాలయాల్లో శుక్రవారం వినతిపత్రాలు ఇస్తామని తెలిపారు. కార్యక్రమంలో రైతులు విరివిగా పాల్గొనాలని కోరారు. గత ఏడాది అనుభవాలను దృష్టిలో ఉంచుకుని నాణ్యమైన విత్తనాలు పంపిణీ చేసేందుకు జిల్లా వ్యవసాయశాఖ అధికారులు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని కోరారు. రైతుభరోసా కేంద్రాలకు చేరుతున్న విత్తనాల నాణ్యతను పరిశీలించాలని కోరారు. పత్తి విత్తనాల నాణ్యతాలోపం వల్ల గత ఏడాది జిల్లాలో రైతులు పెద్ద ఎత్తున నష్టపోయారని, ఈ ఏడాది ఆ పరిస్థితులు పునరావృతమవకుండా చూడాలని కోరారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - May 23 , 2024 | 12:07 AM