COLLECTOR: నాణ్యమైన భోజనం అందించండి
ABN, Publish Date - Aug 31 , 2024 | 12:00 AM
జిల్లాలోని ప్రభుత్వ పా ఠశాలలు, రెసిడెన్షియల్, గురుకల పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన భోజ నం అందించాలని ఉ పాధ్యాయులకు కలెక్టర్ వినోద్ కుమార్ సూచించారు.
బుక్కరాయసముద్రం, ఆగస్టు 30: జిల్లాలోని ప్రభుత్వ పా ఠశాలలు, రెసిడెన్షియల్, గురుకల పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన భోజ నం అందించాలని ఉ పాధ్యాయులకు కలెక్టర్ వినోద్ కుమార్ సూచించారు. శుక్రవారం మం డలంలోని రోటరీపురం జిల్లాపరిషత ఉన్నత పాఠశాలను ఆ యన ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాలలో డాక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు. భోజనం నాణ్యతగా ఉందా? లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి రోజు పిల్లలకు పెట్టే భోజనం మెనూను ఐఎంఎంఎస్ యాప్‌లో అప్‌లోడ్ చేస్తాన్నారా అని ప్రధానోపాధ్యాయరాలిని అడిగి తెలుసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా భోజన పథకాన్ని తనిఖీ చేయాలని చేయాలని జిల్లా డీఈఓ వరలక్ష్మిని ఆదేశించారు. అనంతరం ఎంత మంది విద్యార్థులు ఉన్నారని, ఎంత మంది హాజరయ్యారని అడిగి తెలుసుకున్నారు. డైనింగ్ హాల్ నిర్మాణానికి పతిపాదనలు పంపాలని కలెక్టర్ ఆదేశించారు. అనంతరం విద్యార్థులతో కలిసి కలెక్టర్ సహపంక్తి భోజనం చేశారు. ఏపీసీ నాగరాజు, ఎంఈఓ నవీదా, లింగానాయక్, ఎంపీడీఓ తేజ్యోత్స్న పాల్గొన్నారు.
Updated Date - Aug 31 , 2024 | 12:01 AM