ఇంక రెడీ..!
ABN , Publish Date - Mar 30 , 2024 | 01:02 AM
జిల్లాలో అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలకు కూటమి అభ్యర్థులను ఖరారు చేశారు. తొలివిడత ఆరు నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. తాజాగా పెండింగ్‌లో ఉన్న అనంతపురం పార్లమెంటు, అనంతపురం అర్బన, గుంతకల్లు అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను టీడీపీ అధినాయకత్వం శుక్రవారం ప్రకటించింది. దీంతో ఉత్కంఠకు తెరపడింది.

ఆ రెండింటి ఉత్కంఠకు తెర
గుంతకల్లు అభ్యర్థి గుమ్మనూరు జయరాం
అనంత అర్బన అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్
పార్లమెంటు స్థానానికి అంబికా లక్ష్మీనారాయణ ఖరారు
జిల్లాలో టీడీపీ కూటమి అభ్యర్థుల ఎంపిక పూర్తి
జిల్లాలో అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలకు కూటమి అభ్యర్థులను ఖరారు చేశారు. తొలివిడత ఆరు నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. తాజాగా పెండింగ్‌లో ఉన్న అనంతపురం పార్లమెంటు, అనంతపురం అర్బన, గుంతకల్లు అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను టీడీపీ అధినాయకత్వం శుక్రవారం ప్రకటించింది. దీంతో ఉత్కంఠకు తెరపడింది. అనంతపురం అర్బన నియోజకవర్గానికి రాప్తాడు మాజీ ఎంపీపీ దగ్గుబాటి వెంకటేశ్వరప్రసాద్, గుంతకల్లు నియోజకవర్గానికి మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం అభ్యర్థిత్వాలను టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఖరారు చేశారు. అనంతపురం లోక్‌సభ నియోజకవర్గానికి శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి అంబికా లక్ష్మీనారాయణ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. దీంతో జిల్లాలోని 8 అసెంబ్లీ, ఒక పార్లమెంటు నియోజకవర్గానికి కూటమి అభ్యర్థుల ఎంపిక పూర్తయింది.
-ఆంధ్రజ్యోతి, అనంతపురం
అభ్యర్థులు వీరే...
జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థుల ఎంపిక పూర్తి అయ్యింది. రాప్తాడు నుంచి మాజీ మంత్రి పరిటాల సునీత, రాయదుర్గం నుంచి మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు, ఉరవకొండ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, గుంతకల్లు నుంచి మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం, ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గం శింగనమల నుంచి బండారు శ్రావణిశ్రీ, తాడిపత్రి నుంచి జేసీ అశ్మితరెడ్డి, కళ్యాణదుర్గం నుంచి అమిలినేని సురేంద్రబాబు, అనంతపురం అర్బన నుంచి దగ్గుబాటి వెంకటేశ్వరప్రసాద్‌ను అభ్యర్థులుగా ప్రకటించారు. అనంతపురం ఎంపీ అభ్యర్థిగా అంబికా లక్ష్మీనారాయణను ప్రకటించారు.
దగ్గుబాటి నేపథ్యం..
పేరు: దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్
తండ్రి: దగ్గుబాటి చిన్నారప్ప
తల్లి: దగ్గుబాటి ప్రమీలమ్మ
భార్య: శ్రీలక్ష్మి
కుమారుడు: మణిహాస్
కుమార్తె: అశ్రిత
పుట్టిన తేదీ: 10-8-1975
ఊరు: ఎం. బండమీదపల్లి, రాప్తాడు మండలం
విద్యార్హత : బీటెక్
రాజకీయ నేపథ్యం: 2014లో రాప్తాడు మండలం బండమీదపల్లి నుంచి టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేసి 535 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. రాప్తాడు ఎంపీపీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఎంపీపీల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎంపికయ్యారు. రాప్తాడు మండలంలోని పలు గ్రామాల్లో ఉచిత తాగునీటి ప్లాంట్లను ఏర్పాటు చేశారు. గ్రామాల్లో సీఎ్‌సఏఆర్ స్కీం కింద పలు అభివృద్ధి పనులు చేపట్టారు. పోలీసు సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బండమీదపల్లి గ్రామంలో దళిత కుటుంబాలకు ఇళ్ల పట్టాలను అందజేశారు. గ్రామాల్లో ఉచిత వైద్యశిబిరాలు నిర్వహించారు. ప్రస్తుతం అనంతపురం అర్బన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంపికయ్యారు.
గుమ్మనూరు నేపథ్యం
పేరు : గుమ్మనూరు
పి.జయరాం
తల్లిదండ్రులు: పెంచలపాడు పార్వతమ్మ, పెంచలపాడు బసప్ప
భార్య: పి.రేణుక
పిల్లలు: మాధవి, ఈశ్వర్
పుట్టిన తేదీ : 16-010-1967
విద్యార్హత: ఎస్‌ఎ్‌సఎల్‌సీ
స్వస్థలం: గుమ్మనూరు, చిప్పగిరి మండలం, కర్నూలు జిల్లా
రాజకీయ నేపథ్యం: టీడీపీ తరఫున 2001లో ఏరూరు (చిప్పగిరి మం.) ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. 2005లో చిప్పగిరి మండలం జడ్పీటీసీ సభ్యుడిగా గెలుపొందారు. 2009లో ప్రజారాజ్యం నుంచి ఆలూరు ఎమ్మెల్యే స్థానానికి పోటీచేసి ఓటమి చెందారు. 2011లో వైసీపీలో చేరారు. 2014లో వైసీపీ తరఫున ఆలూరు నుంచి పోటీచేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019లోనూ రెండోసారి వైసీపీ నుంచి పోటీచేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. సీఎం వైఎస్ జగన మంత్రివర్గంలో కార్మిక, ఉపాధి, శిక్షణ మంత్రిగా పనిచేశారు. మంత్రివర్గ పునర్వ్యవవస్థీకరణలో భాగంగా పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేశారు. ఈ ఎన్నికల్లో వైసీపీ ఆలూరు ఎమ్మెల్యే టిక్కెట్ దక్కకపోవడంతో ఈ నెల 5న జయహో బీసీ సభలో చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరారు. ప్రస్తుతం టీడీపీ తరుఫున గుంతకల్లు నియోజకవర్గ అభ్యర్థిగా ఎంపికయ్యారు.
అనంతపురం ఎంపీ అభ్యర్థి అంబికా..
పేరు: అంబికా లక్ష్మీనారాయణ
తండ్రి పేరు: జీవీ చలపతి(లేట్)
తల్లి పేరు: లక్ష్మికాంతమ్మ(లేట్)
భార్య పేరు : జి.శ్యామలా దేవి
కూమార్తె: జీఎల్ పావని
్ఞఅల్లుడు: ఆర్.విశ్వకాంత
కుమారుడు : డాక్టర్ జీవీ వీక్షిత
పుట్టిన తేదీ: 19-12-1965
ఊరు: హిందూపురం
విద్యార్హత: బీఎస్సీ
వృత్తి: మేనేజింగ్ పార్ట్‌నర్, అంబికా గ్రూప్ ఆఫ్ ఫర్మ్స్
రాజకీయ నేపథ్యం: కాంగ్రెస్ అభ్యర్థిగా 2009 అసెంబ్లీ ఎన్నికల్లో హిందూపురం నుంచి పోటీ చేశారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్‌ను వీడి 2013లో టీడీపీలో చేరారు. 2014, 2019 ఎన్నికలలో పార్టీ అభ్యర్థుల విజయంలో కీలకపాత్ర వహించారు. అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికలలో చురుగ్గా పనిచేశారు. 2019లో అహుడా చైర్మనగా నియమితులై.. సేవలు అందించారు. టీడీపీ హిందూపురం పార్లమెంటు నియోజకవర్గ ప్రధాన కార్యదర్శిగా సేవలు అందిస్తున్నారు. హిందూపురం నియోజకవర్గంలో ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ తనవంతు సాయం చేశారు. మైనార్టీల అభ్యున్నతికి కృషి చేశారు. ఉచిత వైద్య శిబిరాలు, ఉచిత అంబులెన్సు సర్వీసులు, జాబ్ మేళాలు, గ్రామీణ క్రీడా పోటీలు నిర్వహించారు. పేద విద్యార్థలకు అంబికా ఫౌండేషన ద్వారా సహాయ సహకారాలు అందించారు.