ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

PINCHEN : పింఛన మేసిన వలంటీర్లు

ABN, Publish Date - Jul 12 , 2024 | 12:13 AM

ప్రజలకు.. ప్రభుత్వానికి వారధిలా వలంటీర్లు సేవలు అందిస్తున్నారని వైసీపీ హయాంలో ఆ పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు ఊదరగొట్టారు. కానీ అడ్డదారిలో ప్రభుత్వ పథకాలను అందుకున్నారని నెమ్మదిగా బయట పడుతోంది. అర్హత లేకున్నా సదరం సర్టిఫికెట్లు తెచ్చుకుని పలువురు అక్రమంగా పింఛన్లు పొందారు. తమ పేరిట, తమ కుటుంబ సభ్యుల పేరిట వలంటీర్లు అక్రమాలకు పాల్పడ్డారు. వీరితోపాటు పలువురు వైసీపీ నాయకులు అర్హత లేకున్నా పింఛన్లు అందుకున్నారు. అధికారులపై ...

దొడ్డిదారిలో సదరం సర్టిఫికెట్లు

నెల నెలా పింఛన్లు తీసుకున్నారు

అదే దారిలో వైసీపీ నాయకులు

ప్రభుత్వం మారడంతో వెలుగులోకి..

ప్రజలకు.. ప్రభుత్వానికి వారధిలా వలంటీర్లు సేవలు అందిస్తున్నారని వైసీపీ హయాంలో ఆ పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు ఊదరగొట్టారు. కానీ అడ్డదారిలో ప్రభుత్వ పథకాలను అందుకున్నారని నెమ్మదిగా బయట పడుతోంది. అర్హత లేకున్నా సదరం సర్టిఫికెట్లు తెచ్చుకుని పలువురు అక్రమంగా పింఛన్లు పొందారు. తమ పేరిట, తమ కుటుంబ సభ్యుల పేరిట వలంటీర్లు అక్రమాలకు పాల్పడ్డారు. వీరితోపాటు పలువురు వైసీపీ నాయకులు అర్హత లేకున్నా పింఛన్లు అందుకున్నారు. అధికారులపై ఓత్తిడి తెచ్చి మరీ దోపిడీకి పాల్పడ్డారు. ప్రభుత్వం మారడంతో వీరి బాగోతాలు బయట పడుతున్నాయి. రాప్తాడు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో పింఛన్ల అక్రమాలు కొనసాగాయి. అధికారం ఉందికదా.. ఎవరేం చేస్తారు అన్నట్లుగా అప్పనంగా ప్రజా ధనాన్ని కాజేశారు.

- రాప్తాడు


వడ్డించేవారే భోంచేశారు..

వైసీపీ హయాంలో ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించే బాధ్యతను వలంటీర్లకే అప్పగించారు. ప్రతి 50 కుటుంబాలకు ఒక వలంటీర్‌ను నియమించారు. పథకాలకు అర్హులను గుర్తించడం, వారిచేత దరఖాస్తు చేయించడం, మంజూరైన పథకాలను లబ్ధిదారులకు చేర్చడంతో వలంటీర్లు కీలకంగా పనిచేశారు. ఇదే అదనుగా వడ్డించే సొమ్ములో కొంత అక్రమంగా భోంచేశారు. దివ్యాంగులకు ప్రభుత్వం అందించే సదరం సర్టిపికెట్లను కొందరు వలంటీర్లు అకమ్రంగా పొందారు. తమ పేరిట, తమ కుటుంబ సభ్యుల పేరిట సర్టిఫికెట్లు తీసుకుని.. పింఛన్లను మంజూరు చేయించుకున్నారు. ప్రతి నెలా పింఛన సొమ్ము పంపిణీ చేసేది వలంటీర్లే కావడంతో ఈ అక్రమాలు బయట పడలేదు. పైగా అందరూ వైసీపీ వర్గీయులే కావడంతో గుట్టుగా వ్యవహరించారు. ఇదే తరహాలో వైసీపీ నాయకులు కూడా అక్రమంగా సదరం సర్టిఫికెట్లు సంపాయించి.. అప్పనంగా పింఛన్లు అందుకున్నారు.

వైకల్యం లేకపోయినా..

రాప్తాడు పరిధిలో పలువురు వలంటీర్లు, వారి కుటుంబ సభ్యులు వైకల్యం లేకపోయినా సదరం సర్టిఫికెట్లు తెచ్చుకున్నారు. వాటి ఆధారంగా అక్రమంగా పింఛన్లు పొందుతున్నారు. వలంటీరు సుగాలి లక్ష్మిదేవి తన భర్త దాసరి శబరికి వైకల్యం లేదు. అయినా ఆయన పేరిట సదరం సర్టిఫికెట్‌ తెచ్చుకున్నారు. ఐడీ నంబర్‌ 11200155753 ద్వారా పింఛన పొందారు. వలంటీరు మారుతి భర్త శివ పింఛన పొందేందుకు అనర్హుడు. వైకల్యం లేకపోయినా.. సదరం సర్టిఫికెట్‌తో ఐడీ నంబర్‌ 11200099942 ద్వారా పింఛన పొందుతున్నాడు. వలంటీర్‌ ఘని తల్లి ఆదినారాయణమ్మ కూడా ఐడీ నంబర్‌ 1121128048 ద్వారా పింఛన తీసుకుంటున్నారు. వలంటీర్‌ చాకలి లక్ష్మిదేవి, తన తల్లి నాగలక్ష్మి పేరిట అక్రమంగా పింఛన పొందుతున్నారు. వలంటీర్‌ ఆవ తన తల్లి పేరిట పింఛన పొందుతున్నారు.


ఆదర్శ దంపతులు..!

కనగానపల్లి మండలం కోనాపురం గ్రామానికి బండి సరస్వతి వలంటీరుగా పనిచేస్తూనే పింఛన తీసుకుంది. ప్రభుత్వం నుంచి పారితోషికం తీసుకునేవారు పింఛనకు అనర్హులు. కానీ, పింఛన్లు పంపిణీ చేసేదే ఆమె కాబట్టి.. ఈ వ్యవహారం బయట పడలేదు. వైసీపీ అధికారంలోకి రాగానే వలంటీరు అయిన సరస్వతి.. తొలుత ఏడాదిన్నరపాటు తానొక్కటే పింఛన తీసుకుంది. ఇందుకోసం అడ్డదారిలో సదరం సర్టిఫికెట్‌ తీసుకుంది. ఐడీ నంబర్‌ 12500031123 కింద పింఛన మంజూరు చేయించుకుంది. ప్రతి నెలా పింఛన పొందింది. ఆ తరువాత తన భర్త బండి రవి పేరిట కూడా సదరం సర్టిఫికెట్‌ తెప్పించి.. పింఛనకు దరఖాస్తు చేయించింది. ఆయన పింఛన ఐడీ నంబర్‌ 12500015878. వైసీపీ హయాంలో ప్రతి నెలా పింఛన పొందాడు. ఇలా దంపతులిద్దరూ అక్రమంగా సదరం సర్టిఫికెట్లను సంపాదించి పింఛన తీసుకుంటూ.. ఆదర్శ దంపతులయ్యారు. ఇక్కడ ఇంకో విశేషం ఉంది. రాప్తాడులో నిర్వహించిన ‘సిద్ధం’ సభలో ఆంధ్రజ్యోతి స్టాఫ్‌ ఫొటోగ్రాఫర్‌ శ్రీకృష్ణపై ఆంబోతులా దాడి చేసింది ఈ బండి రవినే..! ఈ కేసులో ‘ఎంత వెతికినా’ తమకు బండి రవి దొరకడం లేదని


డీఎస్పీ దొరవారు సెలవిచ్చారు. కానీ, ఎన్నికల సమయంలో స్వగ్రామంలో దర్జాగా టీడీపీ వర్గీయులపై దాడి చేశాడు. అప్పుడు కూడా నామమాత్రపు కేసుతో సరిపెట్టారు. వైసీపీ హయాంలో ఇలా దాడులు చేసేవారికి చేయూతనిచ్చేందుకు పింఛన్లు మంజూరు చేయించినట్లు కనిపిస్తోంది. టీడీపీ కూటమి

ప్రభుత్వమైనా చొరవ చూపి.. అక్రమంగా తీసుకున్న పింఛన్లను కక్కించాలి. సదరం సర్టిఫికెట్లను గుడ్డిగా మంజూరు చేసిన వైద్యులను గుర్తించి.. కఠిన చర్యలు తీసుకోవాలి.

- కనగానపల్లి మండలం కోనాపురం గ్రామానికి చెందిన వలంటీరు గవ్వల మల్లప్ప దివ్యాంగుడు కాదు. అయినా సదరం సర్టిఫికెట్‌ తెచ్చుకుని.. ప్రతి నెలా పింఛన తీసుకుంటున్నాడు. ఇదే గ్రామానికి చెందిన వలంటీరు సుధీర్‌.. తన తండ్రికి అక్రమంగా పింఛన ఇప్పించాడు. మత్స్యకారుడని చూపించి.. దొడ్డిదారిలో సర్టిఫికెట్‌ పొంది, పింఛన ఇప్పించాడు.

- రాప్తాడు మండలం రామినేపల్లికి చెందిన వైస్‌ ఎంపీపీ వరలక్ష్మి భర్త మన్నల రవి కుమార్‌ పింఛనకు అర్హుడు కాదు. అయినా దొడ్డిదారిన సదరం సర్టిఫికెట్‌ తెప్పించుకుని.. ఐడీ నంబర్‌ 11200198868 ద్వారా పింఛన తీసుకుంటున్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Jul 12 , 2024 | 12:13 AM

Advertising
Advertising
<