Robbery : హైవేపై దోపిడీ
ABN, Publish Date - Jun 21 , 2024 | 11:55 PM
మండల పరిధిలోని ఎనఎ్‌స గేటు వద్ద జాతీయ రహదారిపై దోపిడీ దొంగల ముఠా బీభత్సం సృష్టించింది. వాహన డ్రైవర్లపై రాళ్లు, బీరు బాటిళ్లతో దాడిచేసి తీవ్రంగా గాయపరిచింది. వారి వద్ద ఉన్న రూ.20 వేల నగదును దోచుకువెళ్లింది. ఈ ఘటన శుక్రవారం తెల్లవారుజామున చోటు చేసుకుందని రామగిరి సీఐ శివాంజ నేయులు తెలిపారు. కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గాకు చెందిన డ్రైవర్లు మహేశ, శ్రీనివాస్, హైదరాబాద్‌కు చెందిన రవి.. హైదరాబాద్‌లోని ఓ షోరూం నుంచి ప్రైవేటు బస్సులను కేరళకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో గురువారం రాత్రి ఎనఎ్‌స గేటు సమీపంలోని అమర నారాయణస్వామి ఆలయం వద్ద జాతీయ రహదారి పక్కన వాహనాలను ఆపి నిద్రపోయారు...
తీవ్రంగా గాయపరిచి.. నగదు దోచుకుని పరారీ
చెన్నేకొత్తపల్లి, జూన 21: మండల పరిధిలోని ఎనఎ్‌స గేటు వద్ద జాతీయ రహదారిపై దోపిడీ దొంగల ముఠా బీభత్సం సృష్టించింది. వాహన డ్రైవర్లపై రాళ్లు, బీరు బాటిళ్లతో దాడిచేసి తీవ్రంగా గాయపరిచింది. వారి వద్ద ఉన్న రూ.20 వేల నగదును దోచుకువెళ్లింది. ఈ ఘటన శుక్రవారం తెల్లవారుజామున చోటు చేసుకుందని రామగిరి సీఐ శివాంజ నేయులు తెలిపారు. కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గాకు చెందిన డ్రైవర్లు మహేశ, శ్రీనివాస్, హైదరాబాద్‌కు చెందిన రవి.. హైదరాబాద్‌లోని ఓ షోరూం నుంచి ప్రైవేటు బస్సులను కేరళకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో గురువారం రాత్రి ఎనఎ్‌స గేటు సమీపంలోని అమర నారాయణస్వామి ఆలయం వద్ద జాతీయ రహదారి పక్కన వాహనాలను ఆపి నిద్రపోయారు. కర్ణాటకలోని పేరేచంద్రకు చెందిన 407 వ్యాన డ్రైవర్లు హెచఆర్ శ్రీనివాస్, మనోహర్
హైదరాబాద్‌లో మామిడికాయలను అనలోడ్ చేసి తిరిగి వస్తూ.. అదే ప్రాంతంలో తమ వ్యానను ఆపి నిద్రకు ఉపక్రమించారు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో 25 నుంచి 30 ఏళ్ల వయసున్న ముగ్గురు దొంగలు వారిపై రాళ్లు, బీరు బాటిళ్ల వర్షం కురిపించారు. డ్రైవర్లు నిద్ర నుంచి తేరుకునేలోగా తీవ్రంగా గాయపరిచారు. వారి వద్ద ఉన్న రూ.20 వేల నగదు దోచుకుని పారిపోయారు. దొంగల దాడిలో బస్సుల డ్రైవర్లు మహేశ, శ్రీనివాస్, రవి తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం అనంతపురం తర లించారు. వ్యాన డ్రైవర్లు స్వల్పంగా గాయపడ్డారు. దాడికి పాల్పడిన ముగ్గురు యువకులు ముసుగులు ధరించి ఉన్నారని, హిందీలో మాట్లాడారని బాధితులు తెలిపారు. దాడి చేయవద్దని వేడుకున్నా వినిపించుకోలేదని, తీవ్రంగా కొట్టారని తెలిపారు. వ్యాన డ్రైవర్ హెచఆర్ శ్రీనివాస్ నుంచి పోలీసులు ఫిర్యాదు స్వీకరించి కేసు నమోదు చేసుకున్నారు. దొంగల ముఠా కోసం గాలిస్తున్నామని తెలిపారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - Jun 21 , 2024 | 11:55 PM