Share News

KALAVA CAMPAIN: తల్లికి వందనం పేరుతో పిల్లలకు రూ.15 వేలు

ABN , Publish Date - Apr 29 , 2024 | 12:06 AM

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే తల్లికి వందనం పేరుతో ఎంతమంది చదివే పిల్లలుంటే వారందరికి ఒక్కొక్కరికి రూ.15 వేలు ఇస్తామని కూటమి అభ్యర్థి కాలవ శ్రీనివాసులు తెలిపారు. ఆదివారం కురవళ్లి, చంద్రగిరి, సిద్ధరాంపురం, నేమకల్లు, హరేసముద్రం, ఉంతకల్లు గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్‌షో నిర్వహించారు.

KALAVA CAMPAIN: తల్లికి వందనం పేరుతో పిల్లలకు రూ.15 వేలు
నేమక ల్లులో రోడ్‌షో నిర్వహిస్తున్న కాలవ శ్రీనివాసులు

బొమ్మనహాళ్‌, ఏప్రిల్‌ 28: తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే తల్లికి వందనం పేరుతో ఎంతమంది చదివే పిల్లలుంటే వారందరికి ఒక్కొక్కరికి రూ.15 వేలు ఇస్తామని కూటమి అభ్యర్థి కాలవ శ్రీనివాసులు తెలిపారు. ఆదివారం కురవళ్లి, చంద్రగిరి, సిద్ధరాంపురం, నేమకల్లు, హరేసముద్రం, ఉంతకల్లు గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్‌షో నిర్వహించారు. ఎన్నికల్లో సైకిల్‌ గుర్తుకు ఓటు వేసి ఎనడీఏ కూటమి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. సూపర్‌సిక్స్‌ పథకాల గురించి వివరించారు. గ్రామాలలో కాలవ శ్రీనివాసులుకు అడుగడుగునా నీరాజనాలు పలికారు.


వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిక: కురువళ్లి, సిద్ధరాంపురం గ్రామాల నుంచి వైసీపీకి చెందిన 50 కుటుంబాలు టీడీపీలోకి కాలవ శ్రీనివాసులు సమక్షంలో చేరారు. మాజీ సర్పంచలు పెద్దరామన్న, సుదర్శనరెడ్డి, టీడీపీ నాయకులు రామకృష్ణ, ప్రభయ్యస్వామి, వి వన్నూరుస్వామి, విరూపాక్షల వారు టీడీపీలోకి చేరారు. నాగరాజు, బాలచంద్ర, హెచ రాము, కె రాము, కే నాగేశ్వరరావు, సురేష్‌, కావలి సురేష్‌, కావలి రాము, బసయ్యలతో పాటు మరో 40 కుటుంబాలకు టీడీపీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు.

వైసీపీని సాగునంపుదాం

గుమ్మఘట్ట: రాష్ట్రంలో అరాచకపాలన కొనసాగిస్తున్న వైసీపీని వెంటనే సాగనంపుదామని కాలవ శ్రీనివాసులు తనయుడు కాలవ భరత ప్రజలకు పిలుపునిచ్చారు. ఆదివారం సాయంత్రం బీటీపీ, కోనాపురం గ్రామాలలో పర్యటించి ఇంటింటికి ప్రచారం నిర్వహించారు.


సూపర్‌సిక్స్‌ పథకాలతో మహిళలకు లబ్ధి

కణేకల్లు: సూపర్‌సిక్స్‌ పథకాలతో మహిళలకు లబ్ధి చేకూరుతుందని ఈ ఎన్నికల్లో టీడీపీ ఓట్లు వేయాలని కాలవ శ్రీనివాసులు కుమార్తె గౌతమి కోరారు. ఆదివారం ఆమె జక్కలవడికి గ్రామంలో ఇంటింటికి తిరిగి విస్త్రత ప్రచారం నిర్వహించారు.

సార్‌.. మా ఊర్లకు తాగునీటి పైపులైన, రోడ్డు వేయించండి

ఫ కాలవ శ్రీనివాసులుకు విన్నవించిన గ్రామస్థులు

బొమ్మనహాళ్‌: సార్‌ ఈ ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వంలో మా ఊర్లలో తాగునీటి కష్టాలు ఎక్కువగా ఉన్నాయి. సిద్ధరాంపురం గ్రామానికి రోడ్డు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. మీరైనా తాగునీటి పైపులైన, రోడ్లు వేయించి మా సమస్యలను తీర్చండి అని కురవళ్లి, సిద్ధరాంపురం గ్రామస్థులు కాలవ శ్రీనివాసులును కోరారు. ఈ ఎన్నికల్లో గెలిచిన వెంటనే మీ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Apr 29 , 2024 | 12:06 AM