ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

YCP DADI: పారిపోండ్రోయ్‌..!

ABN, Publish Date - Nov 09 , 2024 | 12:14 AM

సోషల్‌ మీడియాలో అసభ్యకర పోస్టులతో వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్న వైసీపీ సైకోలపై కూటమి ప్రభుత్వం చర్యలకు దిగింది. క్షేత్రస్థాయిలో దూకుడు పెంచింది. అధికారంలోకి రాకముందు, ఆ తరువాత కూటమి నేతలపై సోషల్‌ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టినవారిపై కఠిన చర్యలకు దిగింది.

Harikrishna Reddy making a fuss at the clock tower (File)

అసభ్యకర పోస్టులపై చర్యలకు దిగిన ప్రభుత్వం

గుంటూరులో హరికృష్ణారెడ్డి అరెస్టుతో గుబులు

అప్పట్లో క్లాక్‌ టవర్‌ వద్ద మీసం దువ్వి హల్‌చల్‌

జిల్లాలో పలువురికి నోటీసులు.. మరికొందరి గుర్తింపు

సిద్ధం సభలో శ్రీకృష్ణపై దాడిచేసిన వారికోసం వేట

అనంతపురం, నవంబరు 8(ఆంధ్రజ్యోతి): సోషల్‌ మీడియాలో అసభ్యకర పోస్టులతో వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్న వైసీపీ సైకోలపై కూటమి ప్రభుత్వం చర్యలకు దిగింది. క్షేత్రస్థాయిలో దూకుడు పెంచింది. అధికారంలోకి రాకముందు, ఆ తరువాత కూటమి నేతలపై సోషల్‌ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టినవారిపై కఠిన చర్యలకు దిగింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు కూటమి నాయకులు, ప్రజాప్రతినిధుల గౌరవానికి భంగం కలిగిస్తున్న వైసీపీ సోషల్‌ మీడియా కార్యకర్తలను జిల్లా పోలీసు యంత్రాంగం గుర్తిస్తోంది. ఇప్పటికే కొందరికి 41 నోటీసులు జారీ చేసింది. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టిన బుక్కరాయసముద్రం జడ్పీటీసీ, వైసీపీ నాయకుడు భాస్కర్‌, ఆ పార్టీ కార్యకర్తలు సాకే లక్ష్మీనారాయణ, నిమ్మల భాస్కర్‌కు విజయవాడ సైబర్‌ క్రైం పోలీసులు రెండు రోజుల క్రితం నోటీసులు జారీ చేశారు. సోషల్‌ మీడియాలో పెట్టిన పోస్టులకు ఎలాంటి ఆధారాలు ఉన్నాయో తీసుకుని విజయవాడ సైబర్‌ క్రైం పోలీస్‌ స్టేషనకు రావాలని నోటీసులో పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వంపై అసభ్యకర పోస్టులు పెట్టిన బెళుగుప్ప మండలం నక్కలపల్లికి చెందిన వైసీపీ సోషల్‌ మీడియా కార్యకర్త సంజీవరెడ్డిని పుట్టపర్తి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇతనిపై తిరుపతిలో కేసు నమోదైంది. దర్యాప్తులో భాగంగా సంజీవరెడ్డిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ పరిణామాల నేపథ్యంలో అప్పట్లో రెచ్చిపోయిన పలువురు పారిపోతున్నారు.


కల్లం అరెస్టు నేపథ్యంలో..

గుంటూరు జిల్లా వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడు కల్లం హరికృష్ణారెడ్డి సార్వత్రిక ఎన్నికలకు ముందు అనంతపురం జిల్లాకు వచ్చాడు. నగర నడిబొడ్డున టీడీపీ ధర్మవరం నియోజకవర్గ ఇనచార్జి పరిటాల శ్రీరామ్‌ను అసభ్య పదజాలంతో దూషించాడు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించాడు. దీంతో కల్లం హరికృష్ణారెడ్డిపై పోలీసులు అప్పట్లోనే కేసు నమోదు చేశారు. దీంతోపాటు సోషల్‌ మీడియాలో పెట్టిన పోస్టులపైనా కేసులు నమోదయ్యాయి. గుంటూరు పోలీసులు కల్లంను అరెస్టు చేయగానే.. అతనితో కలిసి అప్పట్లో హల్‌చల్‌ చేసిన వైసీపీ స్థానిక నాయకులు, కార్యకర్తల్లో అలజడి మొదలైంది. స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తల సహకారంతోనే కల్లం హరికృష్ణారెడ్డి అనంతపురం నగరానికి వచ్చాడు. క్లాక్‌ టవర్‌ వద్ద రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యవహారానికి బాధ్యులను గుర్తించే పనిలో జిల్లా పోలీసు యంత్రాంగం నిమగ్నమైనట్లు సమాచారం. అప్పటి వీడియోలను క్షుణ్ణంగా పరిశీలించి, పాల్గొన్నవారికి ముందుగా నోటీసులు ఇవ్వాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న కొందరు ఇప్పటికే జిల్లాను వీడినట్లు విశ్వసనీయంగా తెలిసింది.


శ్రీకృష్ణపై దాడి చేసినవారికోసం వేట..!

సార్వత్రిక ఎన్నికలకు ముందు రాప్తాడు మండల కేంద్రంలో వైసీపీ అధినేత, అప్పటి సీఎం జగన సిద్ధం సభను నిర్వహించారు. కవరేజీకి వెల్లిన ఆంధ్రజ్యోతి స్టాఫ్‌ ఫొటోగ్రాఫర్‌ శ్రీకృష్ణపై వైసీపీ మూకలు విచక్షణారహితంగా దాడి చేశాయి. ఈ దాడిపై శ్రీకృష్ణ రాప్తాడు పోలీసులకు అప్పట్లోనే ఫిర్యాదు చేశారు. దాడికి పాల్పడినవారి వివరాలు, ఫొటోలతో ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనాలను ప్రచురించింది. వైసీపీ అధికారంలో ఉండటంతో పోలీసులు ఆ దాడిని సీరియ్‌సగా తీసుకోలేదు. అధికార పార్టీ ప్రజాప్రతినిధుల ఒత్తిళ్ల కారణంగా ఒకరిని మాత్రమే అరెస్టు చేసి చేతులు దులుపుకున్నారు. ఆ తరువాత ఆ కేసును అటకెక్కించారు. శ్రీకృష్ణపై దాడి చేసినవారిలో ఆరుగురిని గుర్తించామని అప్పటి ఎస్పీ అన్బురాజన ప్రకటించారు. కానీ వారి వివరాలను వెల్లడించలేదు. తాజాగా ఈ కేసు ఫైల్‌ను కూడా పోలీసులు దుమ్ము దులుపుతున్నారని తెలిసింది.

జైలుకు జింక..!

అనంతపురం క్రైం, నవంబరు 8(ఆంధ్రజ్యోతి): సోషల్‌ మీడియాలో ముఖ్యమంత్రి చంద్రబాబు తదితరులపై అభ్యంతరకర పోస్టులు పెట్టినందుకు ఆత్మకూరు మండలం మదిగుబ్బ గ్రామానికి చెందిన జింకల రామాంజినేయులును పోలీసులు అరెస్ట్‌ చేశారు. అతన్ని శుక్రవారం కోర్టుకు హాజరుపరి, న్యాయాధికారి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు. టీడీపీ ఆత్మకూరు మండలం కన్వీనర్‌ గంతి శ్రీనివాసులు ఫిర్యాదు మేరకు రామాంజినేయులుపై పోలీసులు కేసు నమోదు చేశారు. సోషల్‌ మీడియాలో సీఎం చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు లోకేశ ఫొటోలను మార్ఫింగ్‌ చేసి, సంభాషణలను వక్రీకరించి జింకల రామాంజినేయులు పోస్టులు పెట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇటుకలపల్లి సీఐ హేమంతకుమార్‌ నిందితుడిని అరెస్టు చేశారు. కోర్టు ఈ నెల 21వరకు రిమాండ్‌ విఽధించింది.

Updated Date - Nov 09 , 2024 | 08:16 AM