Salary arrears must be paid వేతన బకాయిలు వెంటనే చెల్లించాలి
ABN, Publish Date - Sep 07 , 2024 | 12:31 AM
శ్రీరామిరెడ్డి, సత్యసాయి తాగునీటి పథకం కార్మికులకు పెండింగ్‌లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట శుక్రవారం ఆయా కార్మికులతో కలిసి సమ్మె చేపట్టారు.
కళ్యాణదుర్గం, సెప్టెంబరు 6: శ్రీరామిరెడ్డి, సత్యసాయి తాగునీటి పథకం కార్మికులకు పెండింగ్‌లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట శుక్రవారం ఆయా కార్మికులతో కలిసి సమ్మె చేపట్టారు.
ఈ సందర్భంగా పలువురు నాయకులు.. సత్యసాయి, శ్రీరామిరెడ్డి తాగునీటి పథకం కార్మికులకు 6 నెలలుగా వేతనాలు ఇవ్వలేదని, ఇలా అయితే వారు కుటుంబాలను ఎలా పోషించుకుంటారని ప్రశ్నించారు. పలుమార్లు అధికారులకు విన్నవించినా.. ఏ ఒక్కరూ పట్టించుకోలేదన్నారు. కార్మికులపై చిన్నచూపు తగదన్నారు. ఇప్పటికైనా పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని కోరారు. సమ్మెకు బోరంపల్లి సర్పంచు సోమశేఖర్‌రెడ్డి మద్దతు తెలిపారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షురాలు నాగమణి, సహాయ కార్యదర్శి అచ్యుత ప్రసాద్, సత్యసాయి జిల్లా కార్యదర్శి వన్నూరప్ప, జిల్లా ట్రెజరర్ వన్నూరుస్వామి, డివిజన అధ్యక్షుడు నరేష్, నాయకులు రమేష్, ప్రభాకర్, భవిత తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం..
Updated Date - Sep 07 , 2024 | 12:31 AM