ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న ప్రజాసంఘాలు

ABN, Publish Date - May 21 , 2024 | 11:52 PM

పెన్నానది నుంచి అనుమతులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్‌ను సీపీఐ, ప్రజాసంఘాల నాయకులు మంగళవారం అడ్డుకున్నారు. అనుమతులు లేకుండా పదుల సంఖ్యలో ట్రాక్టర్‌లను యథేచ్ఛగా తరలిస్తున్నారన్నారు. దీనిపై అధికారులకు తెలిపినా స్పందించలేదన్నారు.

agitation in penna river by social activists

హిందూపురం, మే 21: పెన్నానది నుంచి అనుమతులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్‌ను సీపీఐ, ప్రజాసంఘాల నాయకులు మంగళవారం అడ్డుకున్నారు. అనుమతులు లేకుండా పదుల సంఖ్యలో ట్రాక్టర్‌లను యథేచ్ఛగా తరలిస్తున్నారన్నారు. దీనిపై అధికారులకు తెలిపినా స్పందించలేదన్నారు. మంగళవారం సీపీఐ, ప్రజా సంఘాల నాయకులు సంతేబిదునరూరువద్ద పెన్నానది నుంచి ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ను అడ్డుకున్నారు. 9 ట్రాక్టర్లను రూరల్‌ పోలీసులకు అప్పగించారు. వారు మాట్లాడుతూ అక్రమంగా మూడు నెలలుగా వేబిల్లులు చూపుతూ నిత్యం 30 ట్రాక్టర్లతో ఇసుకను తరలిస్తున్నారన్నారు. దీనిపై జిల్లా అధికారులకు పలుమార్లు మొరపెట్టుకున్నా స్పందించలేదన్నారు. ఈ ప్రాంతంలో రైతులకు నీరులేక ఇబ్బందులు పడుతున్నారని, ఇసుక తరలిస్తే భూగర్భజలాలు ఇంకిపోతాయన్నారు. విషయం తెలుసుకుని సెబ్‌ అధికారులు వాటిని స్వాధీనం చేసుకుని స్టేషనకు ట్రాక్టర్లను తరలించారు. సీపీఐ నాయకులు వినోద్‌, తూమకుంట పారిశ్రామికవాడ కార్మిక సంఘం నాయకులు రవికుమార్‌, నాగరాజు, అబూబకర్‌, జబీవుల్లా, అంజాద్‌, బాబు, మూర్తి, గంగాధర్‌ పాల్గొన్నారు.

Updated Date - May 21 , 2024 | 11:52 PM

Advertising
Advertising