ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

PALAPATIDINNE : కోరిన కోర్కెలు తీర్చే పాలపాటి దిన్నె ఆంజనేయస్వామి

ABN, Publish Date - Aug 05 , 2024 | 12:03 AM

కోరిన కోర్కెలు తీర్చే కరుణామయుడిగా పాలపాటి దిన్నె ఆంజనేయ స్వామి విరాజిల్లుతున్నాడు. శ్రావణమాసోత్సవాలకు ఆలయం లో ఏర్పాట్లు పూర్తి చేశారు. కదిరి ప్రాంతంలో ఖాద్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రం తరువాత నల్లచెరువు మండలంలోని పాలపాటి దిన్నె ఆంజనేయస్వామికి అంత టి ప్రాముఖ్యత ఉంది. ప్రతి శని, మంగళవారాల్లో ఉత్సవాలు నిర్వహిస్తారు. సుదూర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామిని దర్శించు కుంటారు. భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ వారు ప్రత్యేక బస్సులు నడుపుతారు.

Palapatidinne temple premises

నల్లచెరువు, ఆగస్టు 4: కోరిన కోర్కెలు తీర్చే కరుణామయుడిగా పాలపాటి దిన్నె ఆంజనేయ స్వామి విరాజిల్లుతున్నాడు. శ్రావణమాసోత్సవాలకు ఆలయం లో ఏర్పాట్లు పూర్తి చేశారు. కదిరి ప్రాంతంలో ఖాద్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రం తరువాత నల్లచెరువు మండలంలోని పాలపాటి దిన్నె ఆంజనేయస్వామికి అంత టి ప్రాముఖ్యత ఉంది. ప్రతి శని, మంగళవారాల్లో ఉత్సవాలు నిర్వహిస్తారు. సుదూర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామిని దర్శించు కుంటారు. భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ వారు ప్రత్యేక బస్సులు నడుపుతారు. ఆలయ ఈఓ రవీంద్ర రాజు ఆధ్వర్యంలో భక్తులకు మౌలిక వసతులతో పాటు అన్నదాన కార్యక్రమానికి ఏర్పాటు చేశారు.


అయితే ఈయేడాది ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ ఆదేశాల మేరకు ఉచిత దర్శనం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. ప్రతి శనివారం దాతల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహిం చడం ఆనవాయితీ. ఈనెల 24న మూడో శనివారం ఆంధ్రప్రగత గ్రామీణ బ్యాంక్‌ విశ్రాంతి ఉద్యోగులు, ఉద్యోగుల సహకారంతో అన్నదానం నిర్వహించనున్నట్లు ఈఓ తెలిపారు. ప్రతి శనివారం ఆలయంలో భజనలు, కోలాటం, ధార్మిక, సాం స్కృతిక కార్యక్రమాలు నిర్వహించన్నుట్లు తెలిపారు. ప్రతి శనివారం మధ్యాహ్నం 3గంటలకు ఉత్సవ విగ్రహం ఊరేగిస్తామన్నారు. కదిరినుంచి 14 కిలోమీటర్లలో నల్లచెరువు పాత రైల్వేస్టేషన మీదుగా పాలపాటి దిన్నె ఆలయం ఉంది. నల్లచెరువునుంచి పాలపాటి దిన్నె మూడు కిలోమీటర్లు. రోడ్డు సౌకర్యం ఉంది. ఆర్టీసీతోపాటు ప్రయివేటు వాహనాలు భక్తులకు అందుబాటులో ఉంటాయి.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Aug 05 , 2024 | 12:03 AM

Advertising
Advertising
<