fraud: జీతం ఇవ్వకముందే సంతకాలు..!
ABN, Publish Date - Oct 09 , 2024 | 12:18 AM
కొందరు ఉన్నతాధికారుల వైఖరితో ఉరవకొండ డిగ్రీ కళాశాలలోని కాంట్రాక్ట్ లెక్చరర్లు ఇబ్బంది పడుతున్నారు. ఇతర ప్రాంతాల్లోని డిగ్రీ కళాశాలల్లో కాంట్రాక్ట్ లెకర్చర్లకు క్రమం తప్పకుండా జీతాలు వస్తుంటే ...ఇక్కడ మాత్రం కొర్రీలు వేస్తున్నారు. కాంట్రాక్టు లెక్చరర్లకు జీతాలు ఇవ్వక ముందే అడ్వాన్డ్స అక్విటెన్స కాపీ తీసుకుని అక్విటెన్స రిజిస్టర్‌పై రెవెన్యూ స్టాంప్ అతికించి దానిపై సంతకాలు తీసుకుంటున్నారు.
ఉరవకొండ డిగ్రీ కాలేజ్‌లో వింత రూల్స్
అక్విటెన్సపై అడ్వాన్సగా సంతకాలు
ప్రశ్నిస్తే కక్షసాధింపు
ఇబ్బంది పడుతున్న కాంట్రాక్ట్ లెక్చరర్లు
అనంతపురం విద్య, అక్టోబరు 8: కొందరు ఉన్నతాధికారుల వైఖరితో ఉరవకొండ డిగ్రీ కళాశాలలోని కాంట్రాక్ట్ లెక్చరర్లు ఇబ్బంది పడుతున్నారు. ఇతర ప్రాంతాల్లోని డిగ్రీ కళాశాలల్లో కాంట్రాక్ట్ లెకర్చర్లకు క్రమం తప్పకుండా జీతాలు వస్తుంటే ...ఇక్కడ మాత్రం కొర్రీలు వేస్తున్నారు. కాంట్రాక్టు లెక్చరర్లకు జీతాలు ఇవ్వక ముందే అడ్వాన్డ్స అక్విటెన్స కాపీ తీసుకుని అక్విటెన్స రిజిస్టర్‌పై రెవెన్యూ స్టాంప్ అతికించి దానిపై సంతకాలు తీసుకుంటున్నారు. తర్వాత ఎప్పుడో వాళ్లకు బుద్ధి పుట్టినప్పుడు జీతం ఇస్తున్నారు. ఇదెక్కడి నిబంధన అని ఎవరైనా ప్రశ్నిస్తే జీతాలు పెట్టకుండా నెలల తరబడి ఆపేస్తున్నారు.
కొత్త రూల్స్‌తో చుక్కలు
లెక్చరర్లకు 300301 పద్దు కింద జీతాలు చెలిస్తున్నారు. ఎక్కడేగాని అడ్వాన్స అక్విటెన్స కాపీలు కానీ, అక్విటెన్స రిజిస్టర్‌లో రెవెన్యూ స్టాంప్స్ అతికించి, దానిపై సంతకాలు తీసుకోవడం గానీ లేదు. చాలా కళాశాలల్లో ఇలాగే ఉంది.
అక్విటెన్సపై సంతకాలు చేస్తే జీతం తీసుకున్నట్టు లెక్క. అయితే ఉరవకొండ కాలేజ్‌లో మాత్రం మా రూల్స్ మావి అన్నట్టుగా అడ్వాన్స అక్విటెన్సలు తీసుకుంటున్నారు. ఇటీవల చాలా మంది లెక్చరర్ల ద్వారా ఇలాగే తీసుకున్నారు. జీవో 128 మేరకు అడ్వాన్స అక్విటెన్స అవసరం లేదని కళాశాల ఉన్నతాధికారులకు చెప్పినా, ట్రెజరీలో ఎస్టీఓ ఒప్పుకోవడం లేదని కుంటిసాకులు చెబుతూ...కాంట్రాక్టు లెక్చరర్ల జీతాలకు కొర్రీలు వేస్తున్నారు. అక్విటెన్స కాపీలు ఇవ్వని వారికి జీతాలు నిలిపేస్తున్నారు. ఈ ఏడాది సుమారు 4 నెలల నుంచి జీతాలు చెల్లించడం లేదు. ఒక లెక్చరర్‌కు జూన 2024 నుంచి సెప్టెంబరు 2024 వరకూ చెల్లించలేదు. నిబంధనలకు విరుద్ధంగా, ఏకపక్షంగా వ్యవహరిస్తున్న కళాశాల ఉన్నతాధికారులపై కాంట్రాక్టు లెక్చరర్లు మండిపడుతున్నారు.
మాకు నాన టీచింగ్ స్టాఫ్ లేరు : - రామకృష్ణ, ప్రిన్సిపాల్, డిగ్రీ కాలేజ్, ఉరవకొండ
మా కళాశాలలలో నాన టీచింగ్ స్టాఫ్ లేరు. డీడీఓగా నా బాధ్యతలు నాకుంటాయి. నాకు పని ఒత్తిడి ఉంటుంది. కాంట్రాక్టు లెక్చరర్లకు టైంకి జీతాల బిల్లులు పెడుతున్నాం. అక్విటెన్స లేకుంటే ట్రెజరీలో రిజెక్ట్ చేసే అవకాశం ఉంది. అందుకే అడ్వాన్స అక్విటెన్స తీసుకుంటున్నాం. గత కొంత కాలంగా ఇలాగే చేస్తున్నాం.
Updated Date - Oct 09 , 2024 | 12:18 AM