ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AWARDS: చదువే అన్ని సమస్యలకు పరిష్కారం

ABN, Publish Date - Aug 27 , 2024 | 12:14 AM

చదువొక్కటే అన్ని సమస్యలకు పరిష్కారమని పలువురు వక్తలు అన్నారు. శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని నక్కా రామారావు యాదవ చారిటబుల్‌ ట్రస్టు, యాదవ ఉద్యోగ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం జిల్లాకేంద్రంలోని నక్కా రామారావు యాదవభవనంలో 10వ తరగతి, ఇంటర్‌లో ప్రతిభ కనబర్చిన 100 మంది విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు.

Students with awards

అనంతపురం కల్చరల్‌, ఆగస్టు 26: చదువొక్కటే అన్ని సమస్యలకు పరిష్కారమని పలువురు వక్తలు అన్నారు. శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని నక్కా రామారావు యాదవ చారిటబుల్‌ ట్రస్టు, యాదవ ఉద్యోగ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం జిల్లాకేంద్రంలోని నక్కా రామారావు యాదవభవనంలో 10వ తరగతి, ఇంటర్‌లో ప్రతిభ కనబర్చిన 100 మంది విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు. కార్యక్రమానికి ట్రస్టు చైర్మన పోతుల నాగరాజు, న్యాయవాది రాజశేఖర్‌ ముఖ్యఅతిథులుగా హాజరై మాట్లాడారు. యాదవ విద్యార్థులందరూ బాగా చదువుకుని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, నలుగురికీ సహాయ సహకారాలందించాలని కోరారు. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులను ప్రతిఒక్కరూ ప్రోత్సహించాలన్నారు. యాదవ విద్యార్థులకోసం ప్రపంచ సమాచారం అందించేందుకు తమ ట్రస్టు ఆధ్వర్యంలో వెబ్‌సైట్‌ను ప్రారంభిస్తామన్నారు. గ్రూప్‌-1, గ్రూప్‌-2, ఐఏఎస్‌, ఏపీఎస్‌ కోచింగ్‌లకు ఉచిత శిక్షణ కల్పించనున్నట్లు తెలిపారు. అనంతరం విద్యార్థులకు నగదు పురస్కారాలతోపాటు జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో నాగభూషణం యాదవ్‌, శ్రీనివాస్‌ యాదవ్‌, చంద్రమోహన, నరసింహులు, నాగేశ్వరరావు, నాగేశ్వరి, నారాయణస్వామి, శ్రీరాములు, లక్ష్మినారాయణ, మారుతి, సుధాకర్‌, రామకృష్ణ పాల్గొన్నారు.

Updated Date - Aug 27 , 2024 | 12:14 AM

Advertising
Advertising
<